రాజధాని

దేశం, ప్రాంతం, రాష్ట్రం మొదలైన వాటి పరిపాలన శాఖలు ప్రధానంగా ఉన్న పట్టణం లేదా నగరం.

రాజధాని (రాజధాని నగరం) అనగా దేశం, ప్రాంతం, రాష్ట్రం మొదలైన వాటి పరిపాలన శాఖలు ప్రధానంగా ఉన్న పట్టణం లేదా నగరం. రాష్ట్ర లేదా దేశ రాజధాని పరిపాలన కొరకు సాధారణంగా మహా నగరపాలక సంస్థ ఉంటుంది. ఒక నగరాన్ని రాజధానిగా పేర్కొనడం రాజ్యాంగం ద్వారా, చట్టం ద్వారా జరుగుతుంది. కొన్ని దేశాలకు, ప్రాంతాలకు అధికారిక రాజధాని ఉన్నా, ప్రభుత్వ పాలన కేంద్రం వేరేగా వుండటానికి అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో సచివాలయ భవన సముదాయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో సచివాలయ భవన సముదాయం

మాధ్యమాలలో రాజధాని నగరాన్ని ఆ దేశ ప్రభుత్వానికి బదులుగా వాడుతారు. ఉదాహరణకు, వాషింగ్టన్, లండన్ మధ్య సంబంధాలు అనగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్‌డమ్ సంబంధాలు అని వాడతారు.[1]

మూలాలు

వెలుపలి లంకెలు