డయాప్టర్

డయాప్టర్ అనునది కటకం లేదా గోళాకార దర్పణ సామర్థ్యానికి ప్రమాణం. ఇది కటక లేదా దర్పన నాభ్యాంతరానికి వ్యుత్క్రమం (గుణకార విలోమం) (అంటే, 1 / మీటర్). అనగా ఇది నాభ్యాంతర వ్యుత్క్రమ కొలతకు ప్రమాణం. ఉదాహరణకు మూడు డయాప్టర్ల కటకం గుండా పోయే సమాంతర కాంతి కిరణాలు కటక కేంద్రం నుండి 1/3 మీటర్ల దూరంలో కేంద్రీకరింపబడతాయి. అనగా ఆ కటక నాభ్యాంతరం 1/3 మీటర్లు అవుతుంది. జోహాన్స్ కెప్లర్ వాడిన డయాప్ట్రస్ ఆధారంగా 1872 లో ప్రెంచ్ నేత్రవైద్యుడు ఫెర్డినాండ్ మోనోయర్ ప్రతిపాదించాడు.[1][2] ఆయన మోనోయర్ ఛార్టును రూపొందించాడు.

గోళాకార డయాప్టర్

కటకం మేకర్ సమీకరణం ప్రకారం:

ఇక్కడ

=కటక నాభ్యాంతరము
= కటకం తయారుచేసిన పదార్థ వక్రీభవన గుణకం.
= కాంతి వైపుకు ఉన్న తలమునకు వక్రతా వ్యాసార్థం
= కాంతి కు దూరంగా ఉన్న తలమునకు వక్రతా వ్యాసార్థం
కటకం యొక్క మందం (ప్రధానాక్ష తలంలో రెండు తలముల మధ్య దూరం)
కటకం సమీకరణం

ఈ సమీకరణాన్ని సులువుగా వాడటానికి నాభ్యాంతరం కన్నా, నాభ్యాంతరం యొక్క విలోమాన్ని వాడటం సులవు.అలాగే రెండు కటకాలను పక్క పక్కన ఉంచితే, అవి ఒకే కటకంగా ప్రవర్తిస్తాయి. రెండు కటకాల నాభ్యాంతరాల విలోమపు కూడికే, రెండూ కలిపి తయారయిన కటకపు నాభ్యాంతరం యొక్క విలోమం అవుతుంది.

ఇక్కడ

మొడటి కటకం యొక్క నాభ్యాంతరం
రెండవ కటకం యొక్క నాభ్యాంతరం
రెండు కటకాలు కలిపిన ప్రభావం కల కటకం యొక్క నాభ్యాంతరం

ఈ సమీకరణాన్ని కూడా సులువుగా వాడాలంటే డయాప్టర్ వాడటమే.డయాప్టర్ SI ప్రమాణంలో గుర్తింపబడలేదు. అందుకని అంతర్జాతీయ ప్రమాణాలలో ఇప్పటికీ లెంస్ శక్తిని కొలవటానికి డయాప్టర్ బదులు మీటర్−1ను వాడతారు. కానీ కొన్ని జాతీయ సంస్థలు dpt అని డయాప్టర్ ని వ్యవహరిస్తారు. ఉదాహరణకు DIN.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు