తెలంగాణ యువ నాటకోత్సవం - 4


తెలంగాణ యువ నాటకోత్సవం - 4 అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2018, డిసెంబర్ 27 నుండి 30 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ యువ నాటకోత్సవం పేర నాటకోత్సవాలను నిర్వహిస్తుంది.

సభా కార్యక్రమాలు

మొదటిరోజు

డిసెంబర్ 27న మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభవేడుకలకు తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డి, సినీ దర్శకులు శివనాగేశ్వరరావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో యువ నాటకోత్సవంను ప్రారంభించారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ కళాకారులు మాలెల అంజిలయ్య కు స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల రంగస్థల కళలశాఖ పూర్వ శాఖాధిపతి డా. జిఎస్. ప్రసాదరెడ్డి, దర్శకులు బి.ఎన్. రెడ్డి, సత్కళభారతి సత్యనారాయణ పాల్గొన్నారు.[1]

రెండవరోజు

డిసెంబర్ 28 రెండవరోజు కార్యక్రమానికి పద్మశ్రీ సురభి బాబ్జీ, తెలంగాణ రెసొర్స్ సెంటర్ చైర్మన్ ఎం. వేదకుమార్, ఆంధ్రజ్యోతి కాలమిస్ట్ జి.ఎల్.ఎన్. మూర్తి, టీటీఆర్సీ అధ్యక్షులు విజయ్ కుమార్జీ, సినీ దర్శకులు శ్రీధర్ బీచరాజు, సినీ నాటక రచయిత దర్శకులు ఖాజా పాషా విచ్చేసి కళాకారులకు అభినందనలు తెలియజేశారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ కళాకారులు తిరునగరు వెంకట రంగయ్యకు స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.[2]

మూడవరోజు

డిసెంబర్ 29 మూడవరోజు కార్యక్రమానికి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దర్శకులు కన్నన్, నటులు ఉత్తేజ్, దైవజ్ఞ శర్మ, కార్టూనిస్ట్ రెంటాల జయదేవ్ విచ్చేసి కళాకారులకు అభినందనలు తెలియజేశారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ కళాకారులు బోయపల్లి నరసయ్యకు స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.

నాలుగవరోజు

డిసెంబర్ 30న సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో డా. చెల్లప్ప ఐఏఎస్ (రిటైర్డ్), తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి, రాష్ట్ర రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ బండి సాయన్న పాల్గొని నాటకరంగ కళాకారులు అమరేంద్ర కు స్ఫూర్తి పురస్కారం అందజేయడంతోపాటు తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షుడు చిలుకమర్రి నటరాజ్, కార్యదర్శి డా. మల్లేశ్ బలష్టు, సహ కార్యదర్శి వెంకట్ గోవాడ, కోశాధికారి ప్రణయ్‌రాజ్ వంగరి, సభ్యులు నిరుపమ సునేత్రి తదితరులను సత్కరించారు.[3]

ప్రదర్శించిన నాటికలు

తేదినాటిక పేరుసంస్థరచయితదర్శకత్వం
27.12.2018అసురఅన్న ఆర్ట్స్, వనపర్తిపి. వినోద్ కుమార్పి. వినోద్ కుమార్
వైద్యో నారాయణో ‘హరీ…!తెలంగాణ రంగస్థల కళాకారుల వేదిక, వరంగల్వడ్లపల్లి నర్సింగరావుకె. తిరుమలయ్య
28.12.2018సదారమె అను కాంతిమతి[4]శ్రీ విజయ భారతీ నాట్యమండలి (సురభి), హైదరాబాద్తడకలూరి కుప్పుస్వామి (రచన)
హేమ మానస (నాటకీకరణ)
హారిక వర్మ రేకందర్
జిహాద్మిర్రర్ థియేటర్, పెద్దపల్లిబి. సాంబశివమూర్తిబి. సాంబశివమూర్తి
చరమస్థలంవిశ్వహిత కళాకేంద్రం, హైదరాబాద్విలియం బట్లర్ ఈట్స్ (మూలం)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి (స్వేచ్చానువాదం)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి
29.12.2018అసురదేవోభవసిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్నర్సయ్య బోయపల్లిబి. మంజునాథ్
ది షో మస్ట్ గో ఆన్దర్శన్ ఆర్ట్స్, హైదరాబాద్మనోజ్ అవుదుర్తిసంజీవ్ పటేల్
ఓ ప్రేమ.. ఓ దొంగమంచ్ థియేటర్, హైదరాబాద్రాకేష్ కుమార్రాకేష్ కుమార్
30.12.2018తెగారంజాబిల్లి కల్చరల్ సొసైటీ, నిజామాబాద్పెద్దింటి అశోక్ కుమార్డా. మల్లేశ్ బలష్టు
అంబల్ల బండసహృదయ కల్చరల్ గ్రూప్, సికింద్రాబాద్భూపాల్ రెడ్డి (మూలకథ)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి (నాటకీకరణ)
డా. ఆంథోని రాజ్

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు