తెలంగాణ యువ నాటకోత్సవం - 5

తెలంగాణ యువ నాటకోత్సవం - 5 అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2019, జూలై 4 నుండి 7 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నాటకోత్సవం.[1] నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ యువ నాటకోత్సవం పేర నాటకోత్సవాలను నిర్వహిస్తుంది.

తెలంగాణ యువ నాటకోత్సవం - 5 ప్రారంభ కార్యక్రమం
బి.ఎం. రెడ్డికి స్ఫూర్తి పురస్కార సత్కారం

సభా కార్యక్రమాలు

మొదటిరోజు

జూలై 4న మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభవేడుకలకు తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో యువ నాటకోత్సవంను ప్రారంభించారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ దర్శకుడు బి.ఎం. రెడ్డికి స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది. ఈ కార్యక్రమంలో తడకమళ్ళ రామచంద్రరావు, తెర అధ్యక్షకార్యదర్శి సభ్యలు పాల్గొన్నారు.

రెండవరోజు

జూలై 5 రెండవరోజు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, సినీ దర్శకుడు చంద్రమహేష్, రచయిత పెద్దింటి అశోక్ కుమార్, డబ్బింగ్ కళాకారుడు ఆర్.సి.యం. రాజు విచ్చేసి నాటకరంగ కళాకారులు స్నేహమయి ప్రకాష్ కు స్ఫూర్తి పురస్కారం అందజేశారు.

మూడవరోజు

జూలై 6 మూడవరోజు కార్యక్రమానికి నటుడు సుబ్బరాయ శర్మ, దర్శకులు ఖాజా పాషా, హరనాథ్ బాబు, పాత్రికేయులు జిఎల్ఎన్ మూర్తి విచ్చేసి నాటకరంగ కళాకారులు వనం లక్ష్మీకాంతరావుకు స్ఫూర్తి పురస్కారం అందజేశారు.

నాలుగవరోజు

జూలై 7న సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, నటుడు రవి కుమార్, గేయ రచయిత అభినయ శ్రీనివాస్, రంగస్థల దర్శకుడు డి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొని నాటక రచయిత రావుల పుల్లాచారికి స్ఫూర్తి పురస్కారం అందజేయడంతోపాటు తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షుడు చిలుకమర్రి నటరాజ్, కార్యదర్శి డా. మల్లేశ్ బలష్టు, సహ కార్యదర్శి వెంకట్ గోవాడ, కోశాధికారి ప్రణయ్‌రాజ్ వంగరి, సభ్యులు నిరుపమ సునేత్రి తదితరులను సత్కరించారు.[2]

ప్రదర్శించిన నాటికలు

తెలంగాణ యువనాటకోత్సం 5వ సిరీస్ లో 4 రోజులలో 10 నాటికలు ప్రదర్శించబడ్డాయి.[3][4]

తేదినాటిక పేరుసంస్థరచయితదర్శకత్వం
04.07.2019ఎవరికి చుట్టాలుసాహితి కళాసమతి, హైదరాబాదుఎ. సమతఎ. సమత
కండీషన్స్ అప్లైసంస్కృతి, నిజామాబాదుగోవిందరాజులు నాగేశ్వరరావురమణ వంగల
05.07.2019బిచ్చగాడుతనిషీత క్రియేషన్స్, హైదరాబాదుబాలగంగాధర్ శ్రీకాకులపుబాలగంగాధర్ శ్రీకాకులపు
ఎలుగుబంటి - ఎలుక ముఖంసిద్ధిపేట రంగస్థలి, సిద్ధిపేటఆంటోని చెకోవ్ (మూలం)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి (స్వేచ్చానువాదం)
సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి
దిక్సూచివిశ్వకర్మ ఆర్ట్స్, వీరారెడ్డిపల్లిప్రభాకర్ సంగపంగభానుప్రకాష్
06.07.2019పుష్ఫలత నవ్విందిపాప్‌కార్న్ థియేటర్, హైదరాబాదుకరుణ కుమార్తిరువీర్
ఇక్కడ పెళ్ళిళ్లు చేయించబడునుమంచ్‌ థియేటర్‌, హైదరాబాదుకిరణ్ కుమార్హర్ష
శుభలగ్నంమయూరి ఆర్ట్‌ క్రియేషన్స్‌, వరంగల్‌లింగమూర్తిశ్యామలరావు
07.07.2019ఖతర్నాక్ మల్లన్నవేంకటేశ్వర సురభి థియేటర్, హైదరాబాదుబెట్రోల్‌ బ్రెక్‌ (మూలం)
సురభి జయచంద్ర వర్మ
సురభి జయచంద్ర వర్మ
మేరే ప్యారే పతంగ్‌బ్రిడ్జ్‌ థియేటర్‌ గ్రూప్‌ అసోసియేషన్స్‌, ఖమ్మంప్రశాంత్వికాస్ చైతన్య

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు