తెలంగాణ యువ నాటకోత్సవం - 6

తెలంగాణ యువ నాటకోత్సవం - 6 అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2022, ఏప్రిల్ 21 నుండి 24 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించబడుతున్న నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో తెలంగాణ యువ నాటకోత్సవం పేర నాటకోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ యువనాటకోత్సం 4 రోజులలో 10 నాటికలు ప్రదర్శించబడుతున్నాయి, ఒక్కో నాటికకు భాషా సాంస్కృతిక శాఖ నుండి 40వేల రూపాయల ప్రదర్శన పారితోషికం అందించబడుతోంది. దాదాపు 600 మంది నాటక కళాకారులు ఈ నాటకోత్సవంలో పాల్గొంటున్నారు.

తెలంగాణ యువ నాటకోత్సవం - 6 పోస్టర్, ఫ్లెక్సీలను అవిష్కరిస్తున్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు

పోస్టర్ ఆవిష్కరణ

ఈ యువ నాటకోత్సవానికి సంబంధించిన పోస్టర్, ఫ్లెక్సీలను 2022 ఏప్రిల్ 4వ తేదీన రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షకార్యదర్శులు చిలకమర్రి నటరాజ్, డా. మల్లేష్ బలాస్ట్, కోశాధికారి ప్రణయ్‌రాజ్ వంగరి, సినీ రచయిత తోటపల్లి సాయినాథ్, వడ్డేపల్లి నర్సింగరావు, ఒగ్గు రవి, ఆకుల శ్రీధర్, పవన్, భాను, బిర్రు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.[1][2]

బ్రోచర్ ఆవిష్కరణ

బ్రోచర్ ను ఆవిష్కరిస్తున్న మామిడి హరికృష్ణ తదితరులు

2021, ఏప్రిల్ 9వ తేదీ రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో సంచాలకులు మామిడి హరికృష్ణ ఈ నాటకోత్సవ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రంగస్థల సమాఖ్య అధ్యక్షకార్యదర్శులు చిలకమర్రి నటరాజ్, డా. మల్లేష్ బలాస్ట్, నటులు నామాల మూర్తి, సినీ దర్శకులు నాగసాయి మాకం, యువ నాటక దర్శకులు నటులు సురభి రాఘవ, ప్రభాకర్ సింగపంగ, బిర్రు కిరణ్ కుమార్, పవన్ కుమార్, మనోహర్ ఇతర కళాకారులు పాల్గొన్నారు.

సభా కార్యక్రమాలు

మొదటిరోజు

ఏప్రిల్ 21న మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభవేడుకలకు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సినీ దర్శకులు దశరథ్, కేవీఆర్ మహేంద్ర విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో నాటకోత్సవం ప్రారంభించారు. విచ్చేసిన అతిథుల చేతులమీదుగా నాటకరంగ నటుడు, దర్శకుడు మోహన్ సేనాపతికి స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది. ఈ కార్యక్రమంలో డా. ఖాజా పాషా, నాటకరంగ ప్రముఖులు బి.ఎం. రెడ్డి, డా. వెంకట్ గోవాడ, శ్రీధర్ బీచరాజు, తెర అధ్యక్షకార్యదర్శి సభ్యులు పాల్గొన్నారు.[3][4]

రెండవ రోజు

ఏప్రిల్ 22న రెండవరోజు జరిగిన సభా కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, ప్రొఫెసర్ తులసి, రంగస్థల నటి, అధ్యాపకురాలు బి.హెచ్. కల్యాణి, అధ్యక్షకార్యదర్శులు సిహెచ్. నటరాజ్, డా. మల్లేష్ బలాస్ట్ పాల్గొన్నారు. 5 దశాబ్ధాలకుపైగా తెలుగు నాటకరంగంలో కృషిచేస్తూ అనేక పద్య, సాంఘిక నాటకాల్లో నటిస్తున్న కొరిడే నరహరి శర్మకి అతిథుల సమక్షంలో స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.

మూడవరోజు

ఏప్రిల్ 23న మూడవరోజు జరిగిన సభా కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, సినీనటులు సివిఎల్ నరసింహారావు, నాటకరంగ ప్రముఖులు బాదంగీర్ సాయి, సురాపానం సినిమా టీం, తెర అధ్యక్షకార్యదర్శులు సిహెచ్. నటరాజ్, డా. మల్లేష్ బలాస్ట్ పాల్గొన్నారు. కొన్ని దశాబ్ధాలుగా తెలుగు నాటకరంగంలో కృషిచేస్తున్న జమ్మలమడక శశిమోహన్ కు అతిథుల సమక్షంలో స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.

నాలుగవరోజు

ఏప్రిల్ 24న జరిగిన నాటకోత్సవం ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నాడు. తెలుగు నాటకరంగంలో కృషిచేస్తున్న చక్రాల జానకీబాయి గారికి అతిథుల సమక్షంలో స్ఫూర్తి పురస్కారం అందజేయబడింది.[5][6]

ప్రదర్శించిన నాటికలు

తెలంగాణ యువనాటకోత్సం 6వ సిరీస్ లో 4 రోజులలో 10 నాటికలు ప్రదర్శించబడుతున్నాయి

తేదినాటిక పేరుసంస్థరచయితదర్శకత్వం
21.04.2022పెట్రోమాస్ పంచాయితీకర్టెన్ కాల్ థియేటర్, హైదరాబాదుహిందీ కథ: ఫనీశ్వర్ నాథ్ రేణు
నాటకీకరణ: డా వెంకట్ గోవాడ
సురభి సంతోష్
మీకోసం నేనుఆర్ట్ ఫామ్ క్రియేషన్స్పి.టి. మాధవ్వై.వి.ఎస్. మూర్తి
22.04.2022టియర్స్ ఆఫ్ బ్లడ్విశ్వకర్మ ఆర్ట్స్, వీరారెడ్డిపల్లి, యాదాద్రితమిళమాలం: తిరువరూర్ కె తంగరాజన్
అనువాదం: భానుప్రకాశ్
భానుప్రకాశ్
తృష్ణవరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక, వరంగల్వి. నర్సింగరావుకె. తిరుమలరావు
23.04.2022పైసా-పరమాత్మకళా కిరణాలు కల్చరల్ అసోసియేషన్, నిడిగొండ, జనగాంకె. కుమారస్వామిబిర్రు కిరణ్ కుమార్
కరోనా కుచ్ కరోనానవరంగ్ ఆర్ట్స్ హైదరాబాద్శశిమోహన్ఏ. అనిల్ కుమార్
మౌనధ్వనిశృతి లయ కళాభారతి, వైరా, ఖమ్మంసయ్యద్ గఫార్సంపసాల వరదరాజు
24.04.2022గప్పాలుపాప్‌కార్న్ థియేటర్, హైదరాబాదుమూలం: యోగేష్ సోమన్
అనువాదం: లక్ష్మీకాంత్ దేవ్
తెలుగు రచన: మనోజ్ ముత్యం
సురభి రాఘవ
H2OSISవెంకటకృష్ణ థియేటర్, వెల్జాలపవన్ కృష్ణపవన్ కృష్ణ
పైసా వసూల్నటరాజా ఆర్ట్స్, హైదరాబాదుమూల రచయిత: ప్రిగేస్ కారంతీ

స్వేచ్ఛానువాదం: చిలుకమఱ్ఱి నటరాజ్

చిలుకమఱ్ఱి నటరాజ్

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు