అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 21 నిర్వహించబడుతోంది.

అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 21 నిర్వహించబడుతోంది.[1][2] 1960లో, వర్ణవివక్ష పాస్ చట్టాలకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలోని షార్ప్‌విల్లేలో జరిగిన శాంతియుత ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పులలో 69మంది మరణించగా, 180మంది గాయపడ్డారు. 1966లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అన్ని రకాల జాతి వివక్షలను తొలగించడానికి తన ప్రయత్నాలను రెట్టింపు చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తూ మార్చి 21వ తేదీని జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది.[3]

2010లో జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం రోజున మాట్లాడుతున్న మానవ హక్కుల హైకమీషనర్ నవనీతం పిళ్లే (ఫోటో ఎరిక్ బ్రిడియర్స్, 22 మార్చి 2010)

దక్షిణాఫ్రికాలో మానవ హక్కుల దినోత్సవం

దక్షిణాఫ్రికాలో ప్రతి సంవత్సరం ఈరోజున ప్రభుత్వ సెలవుదినంగా జరుపుకుంటున్నారు. వర్ణవివక్ష సమయంలో దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్యం, అందరికీ సమాన మానవ హక్కుల పోరాటంలో మరణించిన వారిని ఈ రోజు స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

కార్యకలాపాలు

జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట నేపథ్యాన్ని తీసుకొని కార్యక్రమాలను నిర్వహిస్తారు:

  • 2010: జాత్యహంకారంపై అనర్హత
  • 2014: జాత్యహంకారం, జాతి వివక్షను ఎదుర్కోవడంలో నాయకుల పాత్ర [3]
  • 2015: జాతి వివక్షను ఎదుర్కోవడానికి గత సంఘటల నుండి నేర్చుకోవడం[3]
  • 2017: వలసల సందర్భంతో సహా జాతిపరమైన ప్రొఫైలింగ్, ద్వేషాన్ని ప్రేరేపించడం[3]
  • 2018: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడే సందర్భంలో సహనం, చేరిక, ఏకత్వం, వైవిధ్యం పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం[3]
  • 2019: పెరుగుతున్న జాతీయవాద పాపులిజం, తీవ్ర ఆధిపత్య భావజాలాలను తగ్గించడం, ఎదుర్కోవడం[3]
  • 2020: గుర్తింపు, న్యాయం, అభివృద్ధి: ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజల కోసం అంతర్జాతీయ దశాబ్దపు మధ్యంతర సమీక్ష[3]

మూలాలు

బయటి లింకులు