అయోధ్య రామమందిరం

భారతదేశంలోని అయోధ్య నగరంలో హిందూ మత ఆరాధ్య దైవం శ్రీ రాముడి ఆలయం నిర్మించబడింది

అయోధ్య రామమందిరం ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నెలకొనిఉన్న హిందూ దేవాలయం. ఇది రామ జన్మభూమి,

అయోధ్య రామమందిరం
అయోధ్య రామమందిరం
భౌగోళికం
స్థలంరామ జన్మభూమి, అయోధ్య, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
సంస్కృతి
దైవంరామ్ లల్లా (రాముడు బాలుడి రూపం
ముఖ్యమైన పర్వాలుశ్రీరామనవమి, దీపావళి, దసరా
వాస్తుశైలి
వాస్తుశిల్పిచంద్రకాంత్‌ సోమ్‌పుర[1]
దేవాలయాల సంఖ్య1
చరిత్ర, నిర్వహణ
సృష్టికర్తశ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర

2020 ఆగష్టు 5న, రామమందిర నిర్మణ ప్రారంభానికి భూమి పూజని భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది.

2024 జనవరి 22న, బాల రాముడు (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. మదురు రంగు కృష్ణ‌శిల‌పై రామ్ ల‌ల్లా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు, బాణం పట్టుకుని దర్శనమిస్తాడు.[2]

చరిత్ర

రామమందిరం నిర్మాణానికి ట్రస్టు

అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మాణానికి వీలుగా ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించింది.దీంతో బోర్డు ట్రస్టీలతో ట్రస్టును ఏర్పాటు చేసి అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి వీలుగా ట్రస్టు ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది.[3]

భూమి పూజ

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి 2020,ఆగస్టు,5న మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించనున్నారు. తద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.[4]

నిర్మాణ పనుల పురోగతి

ప్రస్తుతం అయోధ్య రామాలయ నిర్మాణ పనులలో మొదటి దశ పనులు పూర్తి అయినవని, రెండవ దశ పనులు నవంబర్ వరకు పూర్తి కావచ్చని అని శ్రీ రామ జన్మ భూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి భక్తులకు దర్శనం ప్రారంభం అవుతుందని, అదే సంవత్సరం శ్రీరాముని మూలావిరాట్టు విగ్రహం స్థాపన జరుగగలదని తెలిపారు. ఈ రామాలయ పునరుద్ధరణ పనులను గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్స్ట్స్ 'సోమ్ పురా ఫామిలీ ' చేపట్టింది. అయోధ్యలో రామ మందిరం 2.77 ఎకరాల విస్టీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో , ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్థు 20 అడుగులతో, మొదట 160, మొదటి అంతస్తులో 160 ,రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని శ్రీ రామ జన్మ భూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.[5]మందిరానికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి.

ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది.

మందిరంలో ఐదు మండపాలు (హాల్) ఉన్నాయి: నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి.

మందిరానికి తూర్పు వైపు సింహ ద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్లాలి. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు మరియు లిఫ్టులు ఉన్నాయి.

మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి.

మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప్) ఉంది. శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో, వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరీ మాత, దేవి అహల్య మందిరాలు ఉన్నాయి.[6]

కాంప్లెక్స్ నైరుతి భాగంలో, కుబేర్ తిలా వద్ద, శివుని పురాతన మందిరం, జటాయువు విగ్రహంతోపాటుగా పునరుద్ధరించబడింది.

మందిరంలో ఎక్కడా ఇనుము వాడలేదు. మందిర్ పునాది 14-మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మించబడింది, ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది. నేల తేమ నుండి రక్షణ కోసం, గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం (PFC) నిర్మాణంలో ఉంది. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు & లాకర్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో నాగర శైలిలో [7], స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడింది. 70 ఎకరాల విస్తీర్ణంలో సింహభాగం పచ్చదనం ఉండేలా.. పర్యావరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామమందిర నిర్మాణం జరిగింది. 2024 జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.[8]

ఇవీ చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు