ప్రేమలు

ప్రేమలు 2024లో విడుదలైన తెలుగు సినిమా. భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించగా తెలుగులో ఎస్.ఎస్ కార్తికేయ విడుద‌ల చేశాడు. నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 08న విడుదల చేయగా[1] సినిమా మార్చి 08న విడుదలైంది.[2]

ప్రేమలు
దర్శకత్వంగిరీష్ ఏడీ
రచనగిరీష్ ఏడీ
కిరణ్ జోసీ
మాటలుఆదిత్య హాసన్
నిర్మాత
తారాగణం
  • నస్లేన్ కె. గఫూర్
  • మమితా బైజు
  • అల్తాఫ్ సలీమ్
  • మీనాక్షి రవీంద్రన్
ఛాయాగ్రహణంఅజ్మల్ సాబు
కూర్పుఆకాష్ జోసెఫ్ వర్గీస్
సంగీతంవిష్ణు విజయ్
నిర్మాణ
సంస్థ
భావన స్టూడియోస్
పంపిణీదార్లుభావన రిలీజ్
ఫార్స్ ఫిల్మ్ కో
విడుదల తేదీs
2024 ఫిబ్రవరి 9 (2024-02-09)(మలయాళం)
2024 మార్చి 8 (2024-03-08)(తెలుగు)
సినిమా నిడివి
156 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

కథ

కేరళకు చెందిన సచిన్ (నస్లెన్ గఫూర్) తమిళనాడులోని ఒక కాలేజీలో చదివి బయటకు వస్తాడు. యూకే వెళ్లిపోవాలని అనుకుంటాడు కానీ వీసా రిజెక్ట్ అవడంతో ఓ ఫ్రెండ్ సలహాతో హైదరాబాదులో గేట్ కోచింగ్ జాయిన్ అవుతాడు. రేణు (మమిత బైజు) కేరళ నుంచి జాబ్ చేయడం కోసం హైదరాబాద్ వస్తుంది. అనుకోకుండా ఓ పెళ్లిలో వీరిద్దరూ కలుస్తారు. అప్పటికే రేణు వాళ్ళ ఆఫీసులో ఆది (శ్యామ్ మోహన్) రేణుని ఇష్టపడుతూ ఉంటాడు. మంచి ఉద్యోగం చేస్తూ బాగా సెటిలైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే రీనూ సచిన్‌కి దగ్గరవుతూ ఉంటుంది. ఆ తర్వాత స్నేహితులుగా మారిన వీరి ప్రయాణం ఎలా సాగింది? సచిన్ రేణుకి తన ప్రేమని చెప్పాడా ? రేణు సచిన్ ప్రేమకు ఒకే చెప్పిందా? ఆ తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

  • నస్లెన్ కె. గఫూర్
  • మమితా బైజు
  • మాథ్యూ థామస్ (విస్తరించిన అతిధి పాత్ర)
  • శ్యామ్ మోహన్
  • సంగీత్ ప్రతాప్
  • అఖిలా భార్గవన్
  • మీనాక్షి రవీంద్రన్
  • అల్తాఫ్ సలీం
  • షమీర్ ఖాన్
  • రంజిత్ నారాయణ్ కురుప్
  • ఏఆర్ రాజగణేష్
  • కేఎస్ ప్రసాద్
  • గోపు కేశవ్
  • శ్యామ్ పుష్కరన్ (అతిధి పాత్ర)

పాటలు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వెల్‌కమ్ టు హైదరాబాద్"కిట్టు విస్సాప్రగడహారిక నారాయణ్, రితేష్ జి రావు4:08
2."మినీ మహారాణి"కిట్టు విస్సాప్రగడఆదిత్య అయ్యంగార్, మనీషా ఈరభతిని3:52

మూలాలు

బయటి లింకులు