శేఖర్ మాస్టర్

భారతీయ సినిమా కొరియోగ్రాఫర్

శేఖర్ మాస్టర్ (వి.జె. శేఖర్) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. తెలుగు,[1] హిందీ, కన్నడ సినిమారంగ పాటలకు కొరియోగ్రఫీ చేసాడు.

శేఖర్ మాస్టర్
జననం
వి.జె. శేఖర్

(1979-11-06) 1979 నవంబరు 6 (వయసు 44)
వృత్తితెలుగు సినిమా కొరియోగ్రాఫర్
పురస్కారాలుదక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు
నంది ఉత్తమ నృత్యదర్శకులు

జీవిత విషయాలు

శేఖర్ 1979, నవంబరు 6న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జన్మించాడు.[2] విజయవాడలోని ఒక ఇన్స్టిట్యూట్ లో క్రాష్ కోర్సు నేర్చుకున్న శేఖర్, 1996లో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా సభ్యత్వ కార్డును పొందాడు. కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశాడు. మూవీ కొరియోగ్రాఫర్ కావడానికి ముందు ఆరు సంవత్సరాలు బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా, ఎనిమిది సంవత్సరాలు అసిస్టెంట్‌గా పనిచేశాడు.[3]

సినిమాలు

డాన్స్ కొరియోగ్రాఫర్‌గా

  1. కుంగ్ ఫూ కుమారి - బ్రూస్ లీ
  2. పక్కా లోకల్, ఆపిల్ బ్యూటీ - జనతా గ్యారేజ్
  3. లవ్ మి ఎగైన్ - నాన్నకు ప్రేమతో
  4. బ్లాకుబస్టర్ బ్లాకుబస్టరే - సరైనోడు
  5. టాపు లేసిపోద్ది - ఇద్దరమ్మాయిలతో
  6. నాన్ యాడ పుడితే నీకేంటన్నాయ్ - జులాయి
  7. సైరో సైరో, బంతిపూల - బాద్ షా
  8. సూపర్ మచ్చి - సన్నాఫ్ సత్యమూర్తి
  9. గుండెజారి గల్లంతయ్యిందే - గుండెజారి గల్లంతయ్యిందే
  10. ఇది నిజమే - శివ మనసులో శృతి
  11. చూపించండే - హార్ట్ అటాక్
  12. పింపుల్ డింపుల్ - ఎవడు
  13. పిల్లా నీకోసమే - పిల్లా నువ్వు లేని జీవితం
  14. సక్కుబాయి - ఢమరుకం
  15. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు - ఖైదీ నెంబరు 150
  16. యూ అండ్ మీ - ఖైదీ నెంబర్ 150
  17. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే- ఫిదా
  18. సీటిమార్ - దువ్వాడ జగన్నాథం
  19. నెక్ట్స్ ఏంటి - నేను లోకల్
  20. స్వింగ్ జరా - జై లవకుశ
  21. పెద్ద పులి - చల్ మోహన్ రంగా
  22. ఎంత సక్కగున్నవే - రంగస్థలం
  23. నిన్ను రోడ్ మీద చూసి - సవ్యసాచి
  24. నా బిసి సెంటర్లు - విన్నర్
  25. అన్ని పాటలు - పేపర్‌ బాయ్
  26. ఏక్ బార్ - వినయ విధేయ రామ
  27. కీడా - యాక్షన్ జాక్సన్
  28. అన్ని పాటలు - దోచేయ్
  29. అన్ని పాటలు - ఒక లైలా కోసం
  30. దిమాఖ్ కరాబ్ - ఇస్మార్ట్ శంకర్
  31. రాములో రాముల - అల వైకుంఠపురములో
  32. కన్నే కన్నే - అర్జున్ సురవరం
  33. డాంగ్ డాంగ్, మైండ్ బ్లాక్ - సరిలేరు నీకెవ్వరు
  34. నా రామ చిలక - బావ
  35. ఊహల్లోనా - మంత్ర
  36. అల్లుడు శీను
  37. ప్రేమకథా చిత్రమ్
  38. చిన్నదాన నీ కోసం
  39. పండగ చేస్కో
  40. ఇట్టేజ్ రెచిపోడమ్ - టెంపర్
  41. అఖిల్
  42. మిడిల్ క్లాస్ అబ్బాయి
  43. శైలజారెడ్డి అల్లుడు
  44. దేవదాస్
  45. హలో గురు ప్రేమకోసమే
  46. F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్
  47. మిస్టర్ మజ్ను
  48. అల్లాబే అల్లాబే - రాజా ది గ్రేట్
  49. విన్నాన్నే విన్నాన్నే, నిన్నిలా నిన్నిలా - తొలిప్రేమ
  50. టైటిల్ సాంగ్ - సైరా నరసింహారెడ్డి
  51. జర్రా జర్రా - గద్దలకొండ గణేష్
  52. శివ మనసులో శృతి
  53. మంగళ
  54. కూడి ఇట్టా - సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్
  55. జులాయి పాట - జులాయి
  56. అన్ని పాటలు - ఒరేయ్ బుజ్జిగా
  57. మీకో దండం - 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
  58. అమృత - సోలో బ్రతుకే సో బెటర్
  59. సారంగ దరియా - లవ్ స్టోరీ
  60. ఆకాశం నీ హద్దురా
  61. రంగ్ దే
  62. గాలి సంపత్
  63. గరం గరం సిలకా, రాకాసి రాకాసి - రభస

టీవీ కార్యక్రమాలు

సంవత్సరంకార్యక్రమంఛానల్విభాగం
2009ఢీ 2ఈటీవినృత్య దర్శకుడు
2012ఢీ-5 (జోడి స్పెషల్)నృత్య దర్శకుడు
2014ఢీ జూనియర్స్ -1 (ఢీ -7)జడ్జీ
2015ఢీ జూనియర్స్ -2 (ఢీ -8)జడ్జీ
2016ఢీ జోడి స్పెషల్ (ఢీ -9)జడ్జీ
2017ఢీ 10జడ్జీ
2018ఢీ జోడి (ఢీ 11)జడ్జీ
2019ఢీ ఛాంపియన్స్ (ఢీ 12)జడ్జీ
2019జబర్దస్త్అతిథి జడ్జీ[4]
2019ఎక్ట్రా జబర్దస్త్అతిథి జడ్జీ[5]
2020ఢీ 13 కింగ్ v/s క్వీన్స్ (ఢీ 13)జడ్జీ

అవార్డులు

సంవత్సరంఅవార్డువిభాగంసినిమాఫలితం
2012సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులుఉత్తమ కొరియోగ్రాఫర్జులాయిగెలుపు
20132013 నంది పురస్కారాలుఉత్తమ కొరియోగ్రాఫర్గుండెజారి గల్లంతయ్యిందేగెలుపు
201461 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులుఇద్దరమ్మాయిలతోగెలుపు
201663 వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్బ్రూస్ లీగెలుపు
201764 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్జనతా గ్యారేజ్గెలుపు[6]
49 వ సినీగోయర్స్ అవార్డులుఉత్తమ కొరియోగ్రఫీఖైదీ నం 150గెలుపు
201865 వ ఫిలింఫేర్ అవార్డులు సౌత్దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులుఖైదీ నెంబర్ 150, ఫిదాగెలుపు[7]
16 వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ కొరియోగ్రాఫర్ఖైదీ నెంబర్ 150గెలుపు

మూలాలు

బయటి లింకులు