తోట త్రిమూర్తులు

తోట త్రిమూర్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు.[1][2]

తోట త్రిమూర్తులు

ఎమ్మెల్సీ
పదవీ కాలం
19 నవంబర్ 2021 – ప్రస్తుతం
నియోజకవర్గంగవర్నర్‌ కోటా

వ్యక్తిగత వివరాలు

జననం22 ఏప్రిల్ 1961
వెంకటాయపాలెం గ్రామం, రామచంద్రపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలుతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులుపుండరీకక్షులు, సూర్యకాంతం
జీవిత భాగస్వామిసూర్య కుమారి

జననం, విద్యాభాస్యం

తోట త్రిమూర్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం మండలం, వెంకటాయపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించాడు. 7వ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

తోట త్రిమూర్తులు యువకుడిగా ఉన్న సమయంలోనే రాజకీయాలు పట్ల ఆసక్తి పెంచుకొని గ్రామ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ తరువాత 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరి రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదుగుతూ వచ్చాడు.

1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అనంతరం1995 లో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2004లో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి పాలైన తర్వాత తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి 2008లో నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం వల్ల కాంగ్రెస్ లో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

2014 రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరి 2014లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014-19 వరకు జిల్లా మెట్ట సీమలో వివిధ రూపాల్లో తన బలాన్ని పెంచుకోవడమే కాకుండా జిల్లా కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడుగా ఏదీగాడు.

తోట త్రిమూర్తులు 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు. తోట త్రిమూర్తులు 2019 సెప్టెంబరు 14లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి,[3] 2019 సెప్టెంబరు 15న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4] ఆయన 2021 జూన్ 14లో గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితుడయ్యాడు.[5][6] ఆయన 2021 జూన్ 21న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7]

శాసనసభకు పోటీ

సంవత్సరంనియోజకవర్గం పేరునియోజకవర్గం రకంఓడిన అభ్యర్థి పేరుపార్టీఓట్లుగెలుపొందిన అభ్యర్థి పేరుపార్టీఓట్లుమెజారిటీఫలితం
1994రామచంద్రపురంజనరల్గుట్టల శ్రీ సూర్యనారాయణ బాబుతెలుగుదేశం పార్టీ34027తోట త్రిమూర్తులుస్వతంత్ర309233104గెలుపు
1999రామచంద్రపురంజనరల్పిల్లి సుభాష్ చంద్రబోస్భారత జాతీయ కాంగ్రెస్46417తోట త్రిమూర్తులుతెలుగుదేశం పార్టీ2724219,175గెలుపు
2004రామచంద్రపురంజనరల్తోట త్రిమూర్తులుతెలుగుదేశం పార్టీ45604పిల్లి సుభాష్ చంద్రబోస్స్వతంత్ర531607,556ఓటమి
2009రామచంద్రపురంజనరల్తోట త్రిమూర్తులుప్రజారాజ్యం పార్టీ52558పిల్లి సుభాష్ చంద్రబోస్భారత జాతీయ కాంగ్రెస్565894,031ఓటమి
2012 (ఉప ఎన్నిక)రామచంద్రపురంజనరల్పిల్లి సుభాష్ చంద్రబోస్వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ77292తోట త్రిమూర్తులుతెలుగుదేశం పార్టీ6537311,919గెలుపు
2014రామచంద్రపురంజనరల్పిల్లి సుభాష్ చంద్రబోస్వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ85254తోట త్రిమూర్తులుతెలుగుదేశం పార్టీ6833216,922గెలుపు
2019రామచంద్రపురంజనరల్తోట త్రిమూర్తులుతెలుగుదేశం పార్టీ70,197చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ75,3655,168ఓటమి
2023మండపేటజనరల్

వివాదాలు

1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నాడు. విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టులో 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడిన అనంతరం 2024 ఏప్రిల్ 16న ఈ కేసులో తోట త్రిమూర్తులుకు 18నెల‌ల జైలుశిక్ష‌తో పాటు రూ.2ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. తోట త్రిమూర్తులుతో పాటు ఈ కేసులో 9మంది నిందితులున్నారు.[8][9][10][11][12]

మూలాలు