అనసూయ భరధ్వాజ్

టివి వ్యాఖ్యాత, నటి

అనసూయ భరధ్వాజ్ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి.[2][3]

అనసూయ భరధ్వాజ్
జననం1979 (age 44–45)
హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
విద్యఎం. బి. ఎ (హెచ్. ఆర్)
విద్యాసంస్థభద్రుక కళాశాల
వృత్తిటెలివిజన్ వ్యాఖ్యాత, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుశాంక్ భరద్వాజ్
పిల్లలుశౌర్య, అయాన్
తల్లిదండ్రులు
  • సుదర్శన్ రావు [1] (తండ్రి)

ప్రారంభ జీవితం

ఆమె 2008లో భద్రుక కళాశాల నుండి ఎం.బి.ఎ చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె సాక్షి టివి లో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. [4]

అన‌సూయ ఇంట‌ర్ సెకండియ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు ఎన్‌సీసీ క్యాంప్‌ లో సుశాంక్ భ‌ర‌ద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌పోజ్ చేసాడు, కానీ అప్పుడు అంగీకారం తెలుపని ఆమె ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌ళ్లీ ఎన్‌సీసీ క్యాంప్‌లో భ‌ర‌ద్వాజ్‌తో స్నేహం కాస్త ప్రేమగా మరి తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో ఆమెకు 2010లో సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది.[5] వారికి ఇద్దరు పిల్లలు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్.[6]

జీవితం

ఆమె సాక్షి టెలివిజన్ లో న్యూస్ రీడర్‌గా పని చేసిన తరువాత జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) లో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేరింది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించింది.[7] టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి. ఆమె మూడుసారి జీ తెలుగు లో "ఒకరికొకరు" అవార్డులను నిర్వహించింది. ఆమె దుబాయిలో అప్సర అవార్డులు ఫంక్షన్, గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొంది.

సినిమాలు

సంవత్సరంసినిమాపాత్రభాషగమనికలు
2003నాగన్యాయ విద్యార్థితెలుగు
2016సోగ్గాడే చిన్నినాయనాబుజ్జితెలుగు
2016క్షణం (సినిమా)ACP జయతెలుగు
2017విన్నర్అనసూయతెలుగుపాటలో ప్రత్యేక ప్రదర్శన
2018గాయత్రిఅనుతెలుగు
2018రంగస్థలం (సినిమా)రంగమ్మత్తతెలుగు
2018సచ్చిందిరా గొర్రెతెలుగు
2019మీకు మాత్రమే చెప్తాతెలుగు[8]
2019కథనంతెలుగు
2019F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్|"డింగ్ డాంగ్ పాటలోతెలుగు
2019యాత్రగౌరు చరిత రెడ్డితెలుగు[9]
2021చావు కబురు చల్లగాపైన పటారం పాటలోతెలుగు
2021థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ప్రియాతెలుగు
2021పుష్పదాక్షాయణితెలుగు[10]
2022భీష్మపర్వంఆలిస్మలయాళం[11]
ఖిలాడిచంద్రకళ /చాందినితెలుగు[12]
దర్జాకనక మహాలక్ష్మితెలుగు[13]
వాంటెడ్ పండుగాడ్తెలుగు
2023మైఖేల్చారులత
ఫ్లాష్ బ్యాక్తెలుగు[14][15]
రంగమర్తాండ[16]
విమానంతెలుగు[17]
పెదకాపు-1అక్కమ్మతెలుగు[18]
ప్రేమ విమానంశాంతతెలుగు[19]
2024రజాకార్తెలుగు

టెలివిజన్

సంవత్సరంచూపించుపాత్రఛానెల్గమనిక
2013–22జబర్దస్త్హోస్ట్ఈటీవీ తెలుగు
2013భలే ఛాన్సులేపోటీదారుమా టీవీ
బిందాస్హోస్ట్జీ తెలుగు
మోడ్రన్ మహాలక్ష్మిహోస్ట్మా టీవీ
2014తాడకహోస్ట్ఈటీవీ తెలుగు
వన్ - నో మోర్ సిల్లీ గేమ్స్హోస్ట్జీ తెలుగు
2015కొంచెం టచ్ లో ఉంటె చెప్తాఅతిథి
2015–16బూమ్ బూమ్హోస్ట్జెమినీ టీవీ
2016ఎ డేట్ విత్ అనసూయహోస్ట్టీవీ9
ఢీ జోడిఅతిథిఈటీవీ
జన్యువులుపోటీదారు
2017నా షో నా ఇష్టంపోటీదారుఈటీవీ ప్లస్
స్టార్ మా పరివార్ అవార్డులుహోస్ట్మా టీవీ
జాక్ పాట్హోస్ట్జెమినీ టీవీ
డ్రామా జూనియర్స్ సీజన్ 1న్యాయమూర్తిజీ తెలుగు
డ్రామా జూనియర్స్ సీజన్ 2న్యాయమూర్తి
మీలో ఎవరు కోటీశ్వరుడుపోటీదారుమా టీవీ
జాక్‌పాట్-2హోస్ట్జెమినీ టీవీ
2018బ్లాక్ బస్టర్హోస్ట్
కామెడీ నైట్స్అతిథిజీ తెలుగు
డ్రామా జూనియర్స్ సీజన్ 3న్యాయమూర్తి
బిగ్ బాస్ S2అతిథిమా టీవీ
2018–19రంగస్థలంహోస్ట్జెమినీ టీవీ
2019లోకల్  గ్యాంగ్స్న్యాయమూర్తిజీ తెలుగు
2020ప్రతి రోజు పండగేహోస్ట్ఈటీవీ తెలుగు
థాలియా? పెళ్ళాం??హోస్ట్జెమినీ టీవీ
2021మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 1ప్రెజెంటర్జెమినీ టీవీ
2022ఆగట్టుంటావా ఈగట్టుకొస్తావాప్రెజెంటర్మా టీవీ

సినిమా కార్యక్రమాలు

YearFilmLanguageNotes
2009ఫిట్టింగ్ మాస్టర్తెలుగు
2010రక్త చరిత్రతెలుగు
2011ఎల్.బి.డబ్ల్యు(LBW)తెలుగు
వాంటెడ్తెలుగు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజుతెలుగు
2012ఎందుకంటే...ప్రేమంట!తెలుగు
రొటీన్ లవ్ స్టోరితెలుగు
ఇష్క్తెలుగు
2013మిస్టర్ మన్మథతెలుగు
ఓం_3డితెలుగు
ప్రేమ ప్రణయంతెలుగు
బలుపుతెలుగు
ఎదలో చరగని గురుతులుతెలుగు
కెవ్వు కేకతెలుగు
2014డికె బోస్తెలుగు
కరెంట్ తీగతెలుగు
ఆశ పడ్డావ్తెలుగు
మిర్చి లాంటి కుర్రాడుతెలుగు
ఈ వర్షం సాక్షిగాతెలుగు
2015కుమారి 21ఎఫ్తెలుగు
లెజెండ్తెలుగు
సినిమా చూపిస్త మావతెలుగు
కొరియర్ బాయ్ కళ్యాణ్తెలుగు
లయన్తెలుగు
కిట్టుగాడుతెలుగు
వినవయ్యా రామయ్యతెలుగు
శ్రీమంతుడుతెలుగు
భలే భలే మగాడివోయ్తెలుగు
డైనమైట్తెలుగు
పడ్డానండి ప్రేమలో మరితెలుగు
మామ మంచు అల్లుడు కంచుతెలుగు
మొసగాళ్ళకు మొసగాడుతెలుగు
2016ఊపిరి (సినిమా)తెలుగు
నిర్మలా కాన్వెంట్తెలుగు
ఇజంతెలుగు
డిక్టేటర్తెలుగు
కృష్ణాష్టమితెలుగు
2017జై లవకుశతెలుగు
బాల కృష్ణుడుతెలుగు

పురస్కారాలు

సినిమాఅవార్డువర్గంఫలితంమూ
2017క్షణం2వ IIFA ఉత్సవంఉత్తమ సహాయ నటి - తెలుగుగెలిచింది
6వ సైమా అవార్డులుఉత్తమ సహాయ నటి - తెలుగుగెలిచింది
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ సహాయ నటి - తెలుగునామినేట్ చేయబడింది[20]
2019రంగస్థలం66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్గెలిచింది[21]
8వ సైమా అవార్డులుఉత్తమ సహాయనటి - తెలుగుగెలిచింది[22][23]
జీ సినీ అవార్డ్స్ తెలుగుఉత్తమ సహాయనటి - స్త్రీగెలిచింది[24]

మూలాలు

బయటి లంకెలు