ప్రభాస్

సినీ నటుడు

ఉప్పలపాటి ప్రభాస్ రాజు తెలుగు నటుడు. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.[3]ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత.

ప్రభాస్
బాహుబలి సినిమా ప్రచారానికై పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ప్రభాస్
జననం
ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు

(1979-10-23) 1979 అక్టోబరు 23 (వయసు 44)/ 1979 , అక్టోబరు 23
ఇతర పేర్లుడార్లింగ్, ప్రభాస్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ఇప్పటివరకు
ఎత్తు6′ 2½”[1][2]
తల్లిదండ్రులుసూర్యనారాయణా రాజు
శివ కుమారి

వ్యక్తిగత జీవితం

ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు తన కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. నటులు గోపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి,మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. బి .టెక్ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాద్ లో పూర్తిచేశారు.[4]

సినీ జీవితం

2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన రాఘవేంద్ర సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన వర్షం సినిమా ప్రభాస్ కు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించింది. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించినా పరాజయం పాలయ్యాయి. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ శ్రియా సరసన ఛత్రపతి సినిమాలో నటించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ప్రభాస్ ను తెలుగులో ఒక నటుడిగా నిలబట్టింది. కానీ ఆ తర్వాత విడుదలైన పౌర్ణమి, యోగి సినిమాలు పరాజయం చెందాయి. ఆ తర్వాత ప్రభాస్ ఇలియానా సరసన పైడిపల్లి వంశీ దర్శకత్వంలో మున్నా సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. 2008లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో త్రిష సరసన తన కెరియర్ లో రెండో సారి బుజ్జిగాడు సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది.

2009లో మెహెర్ రమేష్ దర్శకత్వంలో అనుష్క, నమితల సరసన బిల్లా సినిమాలో నటించాడు. ఒక క్రూరమైన డాన్ మరియూ అతనిలాగే ఉండే ఒక చిల్లరదొంగ పాత్రల్లో ప్రభాస్ నటించాడు. ఈ సినిమా తనకు గుర్తింపునిచ్చినా సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విడుదలైన ఏక్ నిరంజన్ కూడా పరాజయం పాలైంది. 2010లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ సరసన డార్లింగ్ సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో నటించాడు ప్రభాస్. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.

2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ దర్శకత్వంలో రెబెల్ సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కథ బాగున్నప్పటికి పరాజయం పాలైంది. 2013లో రచయిత కొరటాల శివ దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొవటంతో పాటు ప్రభాస్ ను ఒక కొత్తగా చూపించడం జరిగింది. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్" తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న  విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రం 2019లో విడుదలయింది. 2021 లో ప్రభాస్ నటించిన రాథే శ్యామ్ విడుదల కానుండగా, 2022 లో సలార్, ఆదిపురుష్ సినిమాలు విడుదల కానున్నాయి.[5] మరో వైపు వైజయంతీ బ్యానర్ పై దీపికా పడుకోణె తో కలిసి సినిమా చేయనున్నారు, దీనికి వర్కింగ్ టైటిల్ గా ప్రాజెక్ట్ కె అని పెట్టడం జరిగింది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని రెండు భాగాలుగా మన ముందు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక రెండవ పార్ట్ శౌర్యంగపర్వం[6] అనే టైటిల్ తో సలార్ సినిమా కి కొనసాగింపుగా మన ముందు వస్తుంది ఇక ఈ సినిమా గురించి అతి త్వరలో మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి.

నటించిన చిత్రాలు

సంవత్సరంCinimaపాత్ర (లు)భాషఇతర విశేషాలు
2002ఈశ్వర్ఈశ్వర్తెలుగు
2003రాఘవేంద్రరాఘవేంద్రతెలుగు
2004వర్షంవెంకట్తెలుగు
2004అడవి రాముడురాముతెలుగు
2005చక్రంచక్రంతెలుగు
2005ఛత్రపతిశివాజి

ఛత్రపతి

తెలుగు
2006పౌర్ణమిశివకేశవతెలుగు
2007యోగిఈశ్వర్ ప్రసాద్

యోగి

తెలుగు
2007మున్నామున్నాతెలుగు
2008బుజ్జిగాడుబుజ్జి

లింగరాజు

తెలుగు
2009బిల్లాబిల్లా,
రంగా
తెలుగు
2009ఏక్ నిరంజన్నిరంజన్,ఛోటుతెలుగు
2010డార్లింగ్ప్రభాస్తెలుగు
2011మిస్టర్ పర్‌ఫెక్ట్విక్కీతెలుగు
2012రెబెల్ఋషితెలుగు
2013మిర్చిజయ్తెలుగు
2015బాహుబలి:ద బిగినింగ్అమరేంద్ర బాహుబలి, శివుడుతెలుగు,
తమిళ్,
హిందీ
మళయాళం
2017బాహుబలి 2: ది కన్ క్లూజన్అమరేంద్ర బాహుబలి, శివుడుతెలుగు,
తమిళ్,
హిందీ
2019
సాహోసిద్దార్ధ్ నందన్ సాహోతెలుగు,
హిందీ,
తమిళం,
మలయాళం
2021రాధే శ్యామ్[7]విక్రమాదిత్యతెలుగు,తమిళం,హిందీ,

మలయాళం,కన్నడ

2022సాలార్తెలుగు, కన్నడ, తమిళం,హిందీ,

మలయాళం

చిత్రీకరణ జరుగుతున్నది
ఆదిపురుష్శ్రీరామ్హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంచిత్రీకరణ జరుగుతున్నది
ప్రాజెక్ట్ కెతెలుగు,తమిళం,హిందీ,

మలయాళం,కన్నడ

ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నది
స్పిరిట్[8]తెలుగు,తమిళం,హిందీ,

మలయాళం,కన్నడ

ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నది

అవార్డులు మరియూ పురస్కారాలు

సంవత్సరంఅవార్డ్క్యాటెగరీచిత్రంఫలితం
2004సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ యువ నటుడువర్షంవిజేత
2004దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ఉత్తమ నటుడువర్షంపేర్కొనబడ్డాడు
2005దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ఉత్తమ నటుడుఛత్రపతిపేర్కొనబడ్డాడు
2009దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ఉత్తమ నటుడుఏక్ నిరంజన్పేర్కొనబడ్డాడు
2010సినీ"మా" అవార్డ్స్ఉత్తమ నటుడు - జ్యూరీడార్లింగ్విజేత
2011దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్స్ఉత్తమ నటుడుమిస్టర్ పర్‌ఫెక్ట్పేర్కొనబడ్డాడు
2012దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్స్ఉత్తమ నటుడుమిస్టర్ పర్‌ఫెక్ట్'పేర్కొనబడ్డాడు
2013నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలుఉత్తమ నటుడు[9][10][11][12]మిర్చివిజేత

మూలాలు