ఇగువాజు జలపాతం

బ్రెజిల్ మరియు అర్జెంటీనాలో ఉన్న ఇగువాజు నది జలపాతం

ఇగువాజు జలపాతం (Iguazu Falls) అనేది అర్జెంటీనాలో 80%, బ్రెజిల్లో 20% ఉన్న భారీ జలపాతాల వరుస. ఇగువాజు నది పరానా పీఠభూమి నుండి దూకేటపుడు ఇగువాజు జలపాతం ఏర్పడింది. ఇక్కడి నుండి 23 కి.మీ. దూరంలో ఇది పరనా నదిలో కలుస్తుంది. ఇది దాదాపు 275 పాయలు కలిగిన జలపాతాల వరుస. ఇవి 82 మీటర్లు, 64 మీటర్ల మధ్య ఎత్తుతో ఉంటాయి. ఈ జలపాతం ఇగువాజు నదిని ఎగువ, దిగువ భాగాలుగా విభజించింది.

ఇగువాజు జలపాతం
ఇగువాజు జలపాతం చూడండి
ప్రదేశంఅర్జెంటీనా: మిసియోనెస్ ప్రాదేశిక ప్రాంతం బ్రెజిల్: పరనా రాష్ట్రం
అక్షాంశరేఖాంశాలు25°41′12″S 54°26′41″W / 25.68667°S 54.44472°W / -25.68667; -54.44472
రకంపెద్ద జలపాతం
మొత్తం ఎత్తు60–82 metres (197–269 ft)[1]
బిందువుల సంఖ్య275[1]
పొడవైన బిందువు82 metres (269 ft)[1]
మొత్తం వెడల్పు2.7 kilometres (1.7 mi)[1]
నీటి ప్రవాహంఇగువాజు నది
సగటు ప్రవాహరేటు1,756 m3/s (62,010 cu ft/s)[1]

పాయలన్నీ కలిపితే, ఈ ఇగువాజు ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం అవుతుంది. [2] ఇది అత్యంత ప్రసిద్ధ జలపాతాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాదిగా సందర్శకులను ఆకర్షిస్తుంది.

ఇగూసు జలపాతం, వీక్షిస్తున్న సందర్శకులు

మూలాలు