ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్ లిమిటెడ్ భారతదేశానికి చెందిన ఒక బహుళజాతి సాంకేతిక సంస్థ. ఇది బిజినెస్ కన్సల్టింగ్, సమాచార సాంకేతికత, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో సేవలు అందిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం, కర్ణాటకలోని బెంగుళూరులో ఉంది.[6] 2020 ఆర్థిక ఫలితాల ప్రకారం ఇన్ఫోసిస్ భారత దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత రెండవ అతిపెద్ద సాంకేతిక సంస్థ. ఫోర్బ్స్ గ్లోబల్ 200 ర్యాంకుల ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీల్లో 602 వ స్థానంలో ఉంది.[7] డిసెంబరు 31, 2020 నాటికి ఈ సంస్థ మార్కెట్ విలువ 71.91 బిలియన్ డాలర్లు.[8]

ఇన్ఫోసిస్ లిమిటెడ్
Typeపబ్లిక్
Traded as
ISININE009A01021
పరిశ్రమఐటి సేవలు, ఐటి కన్సల్టింగ్
స్థాపన7 July 1981; 42 సంవత్సరాల క్రితం (7 July 1981)
Founders
ప్రధాన కార్యాలయం
బెంగళూరు, కర్ణాటక
,
భారతదేశం
Areas served
ప్రపంచ వ్యాప్తం
Key people
నందన్ నిలేకని
(ఛైర్మన్)
సలీల్ పరేఖ్
(మేనేజింగ్ డైరెక్టర్) & సి ఇ ఓ)[1]
Services
  • ఐటి సేవలు
  • అవుట్ సోర్సింగ్
  • కన్సల్టింగ్
  • మేనేజ్‌డ్ సర్వీసెస్
RevenueIncrease 93,594 crore (US$12 billion)[2] (2020)
Operating income
Increase 22,007 crore (US$2.8 billion)[2] (2020)
Net income
Increase 16,649 crore (US$2.1 billion)[2] (2020)
Total assetsIncrease 92,768 crore (US$12 billion)[3] (2020)
Total equityIncrease 65,450 crore (US$8.2 billion)[3] (2020)
Number of employees
242,371 (మార్చి 2020)[4][5]
Divisions
  • ఇన్ఫోసిస్ బిపిఎం
  • ఎడ్జ్ వర్వ్ సిస్టమ్స్
  • ఇన్ఫోసిస్ కన్సల్టింగ్
Websitewww.infosys.com Edit this on Wikidata
Footnotes / references
[4]

చరిత్ర

ఇన్ఫోసిస్ సంస్థను ఏడు మంది ఇంజనీర్లు కలిసి, మహారాష్ట్ర లోని పూణే లో 250 డాలర్ల పెట్టుబడితో 1981లో ప్రారంభించారు. ఇది మొదట్లో ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో 1981 జులై 2న నమోదయింది. [9] 1983 లో ఈ సంస్థ కర్ణాటకలోని బెంగుళూరుకు మారింది. 1992 ఏప్రిల్ లో ఈ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుని అదే సంవత్సరంలో పబ్లిక్ కు వెళ్ళి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మారింది. 2011 జూన్ నాటికి ఇన్ఫోసిస్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది.[10]

ఉత్పత్తులు, సేవలు

ఇన్ఫోసిస్ ఆర్థిక, బీమా, తయారీ రంగాల్లో ఉన్న సంస్థలకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, నిర్వహణ సేవలను అందిస్తుంది.[11]

ఇన్ఫోసిస్ వారి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో చెప్పుకోదగ్గది ఫినకిల్. ఇది ఒక సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్. ఇందులో రీటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్ కి అవసరమైన మాడ్యూళ్ళు ఉన్నాయి.[12]

ఉద్యోగులు

2019 డిసెంబరు నాటికి ఇన్ఫోసిస్ లో మొత్తం 2,43,454 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 37.8 శాతం మహిళలున్నారు.[13] మొత్తం ఉద్యోగుల్లో 2,29, 658 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులున్నారు.[13] మిగతా 13,796 మంది సపోర్ట్, సేవల రంగంలో ఉన్నారు. 2016 లో ఈ సంస్థ ఉద్యోగుల్లో 89% మంది భారతదేశంలోనే ఉన్నారు.[14]

మూలాలు