ఇరిగినేని తిరుపతినాయుడు

ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యులు. ఆయన 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించి వరుసగా 1999 నుంచి 2004 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి.[1]

జీవిత విశేషాలు

ఆయన ప్రకాశం జిల్లా కు చెందిన పామూరు మందలానికి చెందిన మోపాడు గ్రామంలో నర్సలనాయుడు లక్ష్మమ్మ దంపతులకు జూలై 1 1937 న జన్మించారు. ఆయా విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావాలతో రాజకీయ రంగప్రవేశం చేసారు. సర్పంచ్‌గా, సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా అనేక పదవులను అలంకరించారు. ఆయన నాటి కమ్యూనిస్టు నేత గుజ్జుల యల్లమందారెడ్డికి శిష్యులు. ఆయన భార్య లక్ష్మమ్మ 1959లో మోపాడు సర్పంచ్ గా గెలిచారు. ఆయన 1964 లో సర్పంచ్ గా ఎన్నికై 16 యేండ్లకు పైగా సేవలందించారు. 1981 లో సమితి అధ్యక్షునిగా గెలుపొందారు. 1882 లో తెలుగుదేశం పార్టీ లో చేరి జిల్లా అధ్యక్షునిగా భాద్యతలు నిర్వహించారు. 1987లో కాంగ్రెస్‌పార్టీలో చేరి, ఆపార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాశిరెడ్డిపై ఇరిగినేని గెలిచారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఇరిగినేనిపై కాశిరెడ్డి విజయం సాధించారు. తరువాత 1999, 2004 ఎన్నికల్లో రెండు దఫాలు వరుసగా ఇరిగినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు.[2]

ఇరిగినేని తిరుపతి నాయుడు అనారోగ్యంతో ఫిబ్రవరి 12 2017 ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులోని స్వగృహంలో కన్నుమూశారు.[3]

మూలాలు

ఇతర లింకులు