ఈథర్నెట్

ఈథర్నెట్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ (LAN), లేదా మెట్రోపాలిటన్ ఏరియా నెట్‌వర్క్ (MAN) లేదా వైడ్ ఏరియా నెట్‌వర్క్ (WAN) లలో వైర్ల సహాయంతో కంప్యూటర్లు అనుసంధానించే ఒక మార్గం.[1] దీన్ని 1980వ దశకంలో మొదటి సారిగా వ్యాపార అవసరాల కోసం ప్రవేశపెట్టారు. 1983 లో దీన్ని IEEE 802.3 పేరుతో ప్రామాణీకరించారు. అప్పటి నుంచీ ఈథర్నెట్ క్రమంగా ఎక్కువ బిట్ రేట్ ను, ఎక్కువ సంఖ్యలో నోడ్స్ ని, ఎక్కువ దూరాలను పెంచుకుంటూ వస్తూనే పాత పద్ధతిలో పనిచేసే పరికరాలకు (Backward compatibility) కూడా సహకారం అందిస్తూ వస్తోంది. కొంత కాలానికి ఇది దీని పోటీ సాంకేతికతలైన టోకెన్ రింగ్, FDDI, ARCNET లాంటి వాటిని అధిగమించింది.

ల్యాప్‌టాప్‌లో ఈథర్నెట్ కనెక్షన్
ఈథర్నెట్ ఉపయోగించి లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ అయినట్లు చూపిస్తున్న చిత్రం
RJ45 ఈథర్నెట్ కనెక్టర్

ఇది 1990 నుండి LAN లలో కలిసి కంప్యూటర్లు లింకింగ్ చేయుటకు అత్యంత విస్తృతంగా ఉపయోగించిన పద్ధతి. దీని డిజైన్ యొక్క ప్రాథమిక ఆలోచన బహుళ కంప్యూటర్లను యాక్సెస్ చేయటం, ఏ సమయంలోనైనా సమాచారాన్ని పంపించగలగటం.[2][3][4][5]

మూలాలు