కంబాల జోగులు

కంబాల జోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

కంబాల జోగులు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 నుండి ప్రస్తుతం
నియోజకవర్గంరాజాం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం1968
మంగళాపురం , రాజాం మండలం శ్రీకాకుళం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వృత్తిరాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

కంబాల జోగులు 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలం, మంగళాపురం గ్రామంలో ఆదమ్మ, గవరయ్య దంపతులకు జన్మించాడు. ఆయన 10వ తరగతి వరకూ శ్రీకాకుళంలోని ఎస్‌ఎంయూపీ పాఠశాలలో, శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, విశాఖపట్నంలోని ఆల్‌సైన్సు క్రిస్టియన్‌ లా కళాశాలలో బీఏ, బీఎల్‌ పట్టా అందుకున్నాడు.[3]

రాజకీయ జీవితం

కంబాల జోగులు రాజకీయ జీవితం 1995లో తెలుగుదేశం పార్టీతో మొదలు పెట్టాడు. ఆయన 1999 ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం పార్టీ నుండి పాలకొండ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించాడు, కానీ టికెట్ దక్కలేదు. ఆయన ఇక 2004లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డా. కళ్యాణ్ బాబు పై 11624 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోచేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆయన 2012లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కంబాల జోగులు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజాం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రతిభా భారతి పై 512 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.ఆయన 2019 ఎన్నికల్లో ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజాం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి మోహన్ పై 16848 ఓట్ల మెజారిటీ గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు