కె. ఎన్. టి. శాస్త్రి

కె.ఎన్.టి.శాస్త్రి (1945 సెప్టెంబరు 5 – 2018 సెప్టెంబరు 13) భారతీయ సినిమా విమర్శకుడు, దర్శకుడు, రచయిత. సినీ విమర్శకుడిగా శాస్త్రి సినీరంగంపై పలు పుస్తకాలు రాశారు. ఉత్తమ సినీ విమర్శకుడిగానే శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నాడు. అతను తెలుగు సినిమాలలో ఎక్కువగా కృషి చేసాడు. కొన్ని కన్నడ సినిమాలలో కూడా పనిచేసాడు. అతను వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు. అతను 2008 నుండి 2011 వరకు హైదరాబాద్ ఫిల్మ్‌ క్లబ్ కు అధ్యక్షునిగా ఉన్నాడు. అతనికి సినీ విమర్శకునిగా సుమారు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అతను అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ జ్యూరీ సభ్యులలో ఒకడు. పత్రికల్లో జర్నలిస్టుగా కేఎన్‌టీ శాస్త్రి తన కెరీర్‌ను ప్రారంభించాడు. సినీ దర్శకుడు, విమర్శకుడు, రచయితగా శాస్త్రి ప్రసిద్ధి చెందాడు. తిలదానం, కమిలి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఉత్తమ సినీ పుస్తకాన్ని రచించినందుకు రెండు జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఉత్తమ సందేశాత్మక చిత్రానికి గాను అతను మరో అవార్డు అందుకున్నాడు. సురభి నాటకం డాక్యుమెంటరీకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత తిలాదానం సినిమాతో ఆయన దర్శకుడిగా మారాడు. బాలీవుడ్ నటి నందితాదాస్ హీరోయిన్‌గా తీసిన కమిలి చిత్రాన్ని దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటు మరో పది దేశాల్లో ప్రదర్శించారు. ఆ సినిమా కర్ణాటక ప్రభుత్వం నుంచి బెస్ట్ అవార్డు అందుకున్నది. నందిత కూడా ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. తిలాదానం సినిమాకు కూడా అతను నంది అవార్డు అందుకున్నాడు.[1][2] అతను ఎప్పుడూ పెద్ద నటులతో, భారీ స్థాయి బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లలేదు. చిన్న బడ్జెట్‌లో పలు సందేశాత్మక సినిమాలకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటి వరకు ఆయన పది దాకా సినిమాలు తీశాడు. అవన్నీ సందేశాత్మక సినిమాలే.[3]

కె.ఎన్.టి.శాస్త్రి
జననం(1945-09-05)1945 సెప్టెంబరు 5
ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం2018 సెప్టెంబరు 13(2018-09-13) (వయసు 73)
వృత్తిదర్శకుడు
రచయిత
సినిమా విమర్శకుడు

అతను తీసిన చివరి చిత్రం "షాను". ఈ చిత్రానికి సి.ఎఫ్.ఎస్.ఐ దర్శకత్వం వహించగా ఎం.జె.రాధాకృష్ణన్ ఛాయాగ్రహణం చేసాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఐసాక్ థామస్ కోటుకపల్లి.[4][5] అతను తీసిన ఇతర చిత్రాలు సురభి, కమిలి, స్నేహాన్వేషణ, ద ఏలియన్స్, హార్వెస్టింగ్ బేబీ గర్ల్స్, స్నేహ గీతె, సరసమ్మాన సమాధి.[6][7]

పురస్కారాలు

జాతీయ ఫిలిం పురస్కారాలు
  • జాతీయ ఉత్తమ చలనచిత్ర పురస్కారం - ఉత్తమ సినిమా విమర్శకునిగా - 1989
  • జాతీయ ఉత్తమ చలనచిత్ర పురస్కారం - ఉత్తమ సినిమా పుస్తకం (ప్రచురణకర్త) - 1993[8]
  • జాతీయ ఉత్తమ చలనచిత్ర పురస్కారం - ప్రత్యేక జ్యూరీ పురస్కారం - 1995
  • జాతీయ ఉత్తమ చలనచిత్ర పురస్కారం - ఉత్తమ ఆంథ్రాపాలజిస్టు/ఎథ్నోగ్రాఫి చిత్రం - 1999[9]
  • ఇందిరాగాంధీ పురస్కారం - ఉత్తమ దర్శకునిగా - 2002
  • జాతీయ ఉత్తమ చలనచిత్ర పురస్కారం - తెలుగులో ఉత్తమ చిత్రం - 2007
అంతర్జాతీయ గౌరవాలు
  • ప్రత్యేక జ్యూరీ పురస్కారం, హార్వస్టింగ్ బేబీ గర్ల్స్ (అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిలింఫెస్టివల్ ఆమ్స్‌స్టర్‌డ్యాం) [10]
  • దక్షిణ కొరియాలోని 7వ బూసన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో పురస్కారం
  • కినోటావ్ర్ ఫిలిం ఫెస్టివల్, బూసన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ సభ్యుడు.
నంది పురస్కారాలు
  • నంది ఉత్తమ దర్శకుడు - తిలాదానం (2001)
  • నంది ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం - సురభి (1999)[1]
జ్యూరీ సభ్యులు
  • వ్లాడివోస్టోక్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్, భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లలో జ్యూరీ సభ్యుడు.
  • ఇండియన్ పనోరమ - ఐదు సార్లు జ్యూరీ సభ్యుడు .
  • జ్యూరీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు.

మూలాలు