గేథే

జోహాన్ వోల్ఫ్‌గ్యాంగ్ ఫోన్ గోథే (ఆంగ్లం : Johann Wolfgang von Goethe)[1]; ఆగస్టు 28, 1749 - మార్చి 22 1832). ఒక జర్మనీ రచయిత, జార్జి ఈలియట్ ప్రకారం, "జర్మనీకు చెందిన, ఓ గొప్ప లేఖల పురుషుడు, భూమిపై నడచిన నిజమైన ఆఖరి పాలిమత్.[2] గోథే కవిత్వం, డ్రామా, సాహిత్యం, మత శాస్త్రము, మానవతావాదం, విజ్ఞాన శాస్త్రము మొదలైన రంగాలలో నిష్ణాతుడు. గేథే యొక్క మహారచన (మాగ్నమ్ ఒపస్) ఫాస్ట్ రెండు భాగాల డ్రామా, ప్రపంచ సాహిత్యంలో ఓ కలికితురాయి.[3] గేథే రచనలలో అనేక కవితలు, బిల్డుంగ్‌స్రోమన్ విల్హెమ్ మీస్టర్స్ అప్రెంటైస్‌షిప్, ఎపిస్టోలరీ నావెల్ ద సారోస్ ఆఫ్ యంగ్ వెర్దర్ మొదలగునవి ప్రసిద్ధమైనవి.

జోహాన్ వోల్ఫ్‌గ్యాంగ్ ఫోన్ గోథే

జననం:28 ఆగస్టు 1749, 22 ఆగస్టు 1749, 1749
వృత్తి:కవి, నవలాకారుడు, డ్రామా రచయిత, ప్రకృతి తత్వవేత్త, డిప్లమాట్
జాతీయత:జెర్మన్
రచనా కాలము:రొమాంటిసిజం
Literary movement:స్టర్మ్ ఉండ్ డ్రాంగ్; వీమర్ క్లాసిసిజం
ప్రభావాలు:కాళిదాసు,గెల్లెర్ట్, హాఫిజ్, హెర్డెర్, హోమర్, ఒస్సియాన్, క్లోప్‌స్టాక్, లెస్సింగ్, రూసో, షేక్స్‌పియర్, షెల్లింగ్, షిల్లర్, స్పినోజా, వింకల్‌మన్
ప్రభావితులు:ముహమ్మద్ ఇక్బాల్, లామార్క్, ఛార్లెస్ డార్విన్, హెగెల్, షోపెన్‌హాయర్o, కార్లైల్, కీర్కెగార్డ్, నీట్‌జే, నికోలా టెస్లా, తుర్గెనేవ్, స్టీనర్, థామస్ మాన్, హెస్సే, ఆండ్రే గైడ్, కాసిరర్, జంగ్, స్పెంగ్లర్, విట్ట్‌గెన్‌స్టైన్, గ్రాస్, ఇకెడా
గేథే సంతకం

గేథే 18, 19వ శతాబ్దపు జర్మన్ సాహిత్యం, వీమర్ క్లాసిసిజం ఉద్యమంలో ఓ ప్రముఖుడు, ఇతడి ఉద్యమం జ్ఞానావేశం, సెంటిమెంటాలిటీ, స్టర్మ్ ఉండ్ డ్రాంగ్, రొమాంటిసిజం కల్గివున్నది. శాస్త్రీయ గ్రంథము థియరీ ఆఫ్ కలర్స్ ద్వారా ఛార్లెస్ డార్విన్ను ఇతని వృక్షశాస్త్ర మార్ఫాలజీ సిద్ధాంతాలలో ప్రభావితం చేయగలిగాడు..[4][5]

జీవితం

బాల్యం

గోథే తండ్రిగారు జోహాన్ కాస్పర్ గోథే. ఆయన అప్పటీ రోమన్ రాజ్యపు సామంత నగరమైన ఫ్రాంక్ఫుర్ట్ లో నివసించేవారు. లైప్జిష్ లో బారిష్టర్ విద్యాభాసం చేసి రాజసలహాదారుగా పనిచేస్తున్నప్పటికీ ఆ విషయాలపై ఎక్కువ శ్రధ్ధ కనబరిచేవారుకాదు.ఆయన వివాహం గోథే తల్లి అయిన కాథరీనా ఎలిజబెత్ టెక్స్తర్ తొ 1748 ఆగస్టు 20 న జరిగింది. అప్పటికి ఆయన వయసు 38, ఆవిడ వయసు 17. గోథే, తన చెల్లెలు కొర్నేలియా ఫ్రీడ్రికా క్రీస్టినా (1750) తప్ప మిగిలిన సంతానం అంతా చిన్న వయసులోనే మరణించారు.

గోథేకి అప్ప్తటి సమకాలీన విషయాలపై తన తండ్రిగారు, వ్యక్థిగత ఉపధ్యాయులు విద్యాభ్యాసం చేసారు.ముఖ్యంగా వివిధ భాషలైన లాటిన్,గ్రీక్,ఫ్రెంచ్,ఇటాలియన్,ఇంగ్లిష్, హీబ్రూలపై జరిగింది. ఇవేకాక నృత్యం,గుర్రపు స్వారీ,ఖడ్గయుధ్ధం కూడా నేర్చుకున్నారు. జోహాన్ కాస్పెర్ తన జీవితంలో సాధించలేని సౌకర్యాలన్నీ తన పిల్లలకు సమకూర్చాలనే పట్టుదలతో ఉండేవారు.

గోథేకు చిత్రలేఖనంపై అభిరుచి ఉన్నప్పటికీ, తన ద్రుష్టి సాహిత్యంపైకి మరలింది. ఫ్రీడ్రిష్ గొట్లీబ్ క్లోప్స్తోక్, హోమెర్ వంటి రచయితలపై ఆసక్థి కనబరిచేవారు. నాటకాలపై కూడా ఆయనకు మక్కువ ఉండేది. ప్రతీ సంవత్సరం వార్ంట్లో జరిగే తోలుబొమ్మలాట అంతే ఆయనకి ఎంతో ఇష్టం. తను రాసిన విల్హెల్ం మైస్తెర్స్ అపరెంటీస్షిప్ లో ఈ తోలుబొమ్మలాట గురించి పలుమార్లు ప్రస్తావించారు.

చరిత్ర, మతం గురించిన పుస్తకాలు చదవడంలో ఎంతో ఆసక్తిని కనబరిచేవారు. ఆయన బాల్యం గురించి ఆయన మాటల్లో

"నాకు చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం,పని చేయదం మొదలగు ఏవిషయం అయినా మనసుతో నేర్చుకోవడం అలవాటు.ఫస్ట్ బుక్స్ ఆఫ్ మోసెస్, ఏనీడ్, ఓవిడ్ యొక్క విస్లేషనలు నన్ను కత్తిపడెసేవి.ఎప్పుడైనా ఆ కథలో ఉన్న చరిత్ర,మిథ్య,మతం సంకెళ్ళు నాకు బిగుస్తున్నప్పుడు,ఫస్ట్ బుక్స్ ఆఫ్ మోసెస్ లో చెప్పబడిన గొర్రెల కాపరుల మధ్యకు చేరి ఏకాంతంగా స్వేచ్చావాయువులు పీల్చుకునేవాడిని."

గోథేకు ఫ్రాంక్ఫుర్ట్ నటులతో సాన్నిహిత్యం ఏర్పడింది. తన తొలిప్రయత్నాలో ఉన్నప్పుడు గ్రెట్చెన్ కు ఆకర్షితుడయ్యాడు. తరవతి కాలంలో తనతోనే ఫాస్ట్ అనే సుప్రసిద్ధ నాటకాన్ని రచించాడు.వారిద్దరి మద్ధ్య సాన్నిహిత్యాన్ని "డిక్టుంగ్ ఉండ్ వార్హైట్"లో వ్యక్తపరిచాడు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Johann Wolfgang von Goethe గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.