డయోడ్

డయోడ్ ఒక రెండు టర్మినళ్ళు కలిగిన (ద్విశీర్ష) ఎలక్ట్రానిక్ పరికరం. ఇది ఒక దిశలో విద్యుత్ ప్రవాహానికి దాదాపు సున్నా నిరోధం కలిగిఉంటుంది. అలాగే దానికి వ్యతిరేక దిశలో విద్యుత్ ప్రవాహాన్ని దాదాపు పూర్తిగా నిరోధిస్తుంది. సెమి కండక్టర్ (అర్ధవాహకం) డయోడ్లు ఇప్పుడు ఎక్కువగా ఉనికిలో ఉన్నాయి. ప్రస్తుతం డయోడ్లను ఎక్కువగా సిలికాన్తో తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు ఇతర అర్ధవాహక మూలకాలైన సెలీనియం, జర్మేనియం లాంటి వాటిని కూడా ఉపయోగిస్తుంటారు.[1]

సిలికాన్ డయోడ్ దగ్గరి చిత్రం. కుడివైపున ఉన్నది ఆనోడ్; ఎడమవైపున ఉన్నది కాథోడ్ (నల్ల పట్టీతో గుర్తించినది) చతురస్రాకారపు సిలికా పటిక ఆ రెండింటి మధ్యలో ఉంది.

ప్రధాన లక్షణాలు

డయోడు యొక్క ప్రధాన లక్షణాలు ఒక వైపు నుంచి విద్యుత్ ప్రసారాన్ని అనుమతించడం. దీన్నే డయోడు యొక్క ముందు దిశ అనవచ్చు. దానికి వ్యతిరేక దిశలో విద్యత్తును అనుమతించకపోవడం. దీన్ని డయోడు యొక్క వ్యతిరేక దిశ అనవచ్చు. కాబట్టి ఈ డయోడును ఏదైనా భౌతిక పదార్థాలను ఒక వైపు మాత్రమే పంపించగల చెక్ వాల్వుతో పోల్చవచ్చు. ఈ లక్షణం వల్లనే డయోడును ఆల్టర్నేట్ కరెంటు (నిర్ణీత సమయానికొకసారి దిశ మార్చుకునే విద్యుత్ ప్రవాహం) ను డైరెక్టు కరెంటు (ఎల్లప్పుడూ ఒకే వైపుగా ప్రవహించే విద్యుత్ ప్రవాహం) గా మార్చడానికి ఉపయోగిస్తారు. అప్పుడు ఇది రెక్టిఫయర్ లా పని చేస్తుంది.

ఇవి కూడా చూడండి

మూలాలు