తాప్సీ

భారతీయ సినీ నటి, మోడల్

తాప్సీ వర్థమాన సినీ నటి. ఝుమ్మందినాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది.

తాప్సీ

జన్మ నామంతాప్సీ పను
జననం01 ఆగస్ట్ 1987
ఢిల్లీ, భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2008 - ప్రస్తుతం
ప్రముఖ పాత్రలుఝుమ్మందినాదం

జీవిత విశేషాలు

తాప్సి 1987 ఆగస్టు 1 న న్యూఢిల్లీలో దిల్మోహన్ సింగ్ పన్నూ, నిర్మల్జీత్ దంపతులకు జన్మించింది. [1][2] ఆమె జాట్ సిక్కు. ఆమె తండ్రి రిటైర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాగా, తల్లి గృహిణి. [3] ఆమెకు షగున్ అనే ఒక చెల్లెలు కూడా ఉంది. అశోక్ విహార్ లోని మాతా జై కౌర్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె గురు తేజ్ బహదూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివారు.

గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక తాప్సి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసింది. [4][5] ఆడిషన్ చేసిన తరువాత ఆమె ఫుల్ టైమ్ మోడల్ గా మారింది, ఛానల్ వి 2008 టాలెంట్ షో గెట్ గార్జియస్ కు ఎంపికైంది, ఇది చివరికి ఆమెను నటనకు దారితీసింది. పన్నూ అనేక ప్రింట్, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కనిపించారు, ఆమె మోడలింగ్ రోజుల్లో అనేక టైటిల్స్ గెలుచుకుంది, వీటిలో 2008 ఫెమినా మిస్ ఇండియా పోటీలో "పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్", "సఫి ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్కిన్" ఉన్నాయి.  

నటించిన సినిమాలు

తెలుగు

హిందీ

తమిళ్

మలయాళం

  • డబుల్స్ (2011)

బయటి లింకులు