దశాబ్దము

పదేళ్ళ కాలం

దశాబ్దము లేదా దశాబ్ది అనేది 10 సంవత్సరములకు సమానమైన ఒక కాలమానము. దీన్ని దశకం అని కూడా అంటారు. తెలుగులో దీన్ని పదేళ్ళు అని కూడా అనవచ్చు. సంస్కృతంలో అబ్దము, అబ్ది అంటే ఒక సంవత్సరం, దశ అంటే పది. వందేళ్ళను శతాబ్దము, శతాబ్ది అని, వెయ్యేళ్ళను సహస్రాబ్దం, సహస్రాబ్ది అనీ అంటారు.

వాడుక

ఏ పదేళ్ళ కాలాన్నైనా దశాబ్ది అని అనవచ్చు.[1][2] అయితే, క్యాలెండరు సంవత్సరాల్లో, పదవ స్థానంలోని అంకెతో దశాబదిని ఉదహరించడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు 2010 నుండి 2019 వరకూ ఉన్న పదేళ్ళ కాలాన్ని 2010లు అని పిలుస్తారు.[3][4]

గ్రెగోరియన్ క్యాలెండరు 1 వ సంవత్సరంతో మొదలౌతుంది. సున్నా సంవత్సరం లేదు). సామాన్య శకం 1 వ సంవత్సరానికి ముందున్న సంవత్సరాన్ని సామాన్య శక పూర్వం 1 గా వ్యవహరిస్తారు. మధ్యలో సున్నా సంవత్సరమేదీ లేదు. అంటే మొదటి దశాబ్ది, సామాన్య శకం 1 నుండి సామాన్య శకం 10 వరకు, రెండవ దశాబ్ది సామాన్య శకం 11 నుండి సామాన్య శకం 20 వరకూ ఉంటుంది.[5] 2010 నుండి 2019 వరకూ ఉన్న పదేళ్ళను 2010లు అని వ్యవహరించినప్పటికీ, 2011 నుండి 2020 వరకు ఉన్న కాలాన్ని 21 వ శతాబ్దపు రెండవ దశాబ్ది అని పిలుస్తారు.

ఏ పదేళ్ళ కాలాన్నైనా దశాబ్దిగా వ్యవహరించవచ్చు. ఉదాహరణకు, 1997 నుండి 2006 వరకూ ఉన్న కాలాన్ని ఉదహరిస్తూ, "ఈ దశాబ్ది కాలంలో భారతదేశం, కంప్యూటరు సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను చూసింది" అని రాయవచ్చు.

మూలాలు