నారాయణ గురు

భారతీయ సామాజిక సంస్కర్త

నారాయణ గురు, (1856 - సెప్టెంబరు 20, 1928) కేరళకు చెందిన ఒక సంఘసంస్కర్త. సమాజంలోని మూఢ విశ్వాసాలను, కుల తత్వాన్ని నిరసించాడు.[1] కులం కారణంగా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు అన్యాయానికి గురవుతున్నారనీ, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం ఉండాలని అతను భావించాడు. వారిని ఉద్ధరించడానికి ఆలయాలు, పాఠశాలలు మొదలైన సంస్థలు నెలకొల్పడానికి పాటు పడ్డాడు.[2]

శ్రీ నారాయణ గురు
శ్రీ నారాయణ గురు
జననం1856
చెంపళంతి, ట్రావెంకూర్, కేరళ
నిర్యాణము1928 సెప్టెంబరు 20
వర్కాల, ట్రావెంకూర్
ప్రభావితులైన వారు

బాల్యం

అతను ఇంటిని విడిచిపెట్టి, గురు కేరళ, తమిళనాడు గుండా ప్రయాణించాడు. ఈ ప్రయాణాలలో, అతను సామాజిక, మత సంస్కర్త చట్టంపి స్వామికల్‌ని కలుసుకున్నాడు. అతను అయ్యావు స్వామికల్‌కు గురువును పరిచయం చేసాడు. అతను ధ్యానం, యోగా నేర్చుకున్నాడు.[3]

1887లో అతను ప్రాచుర్యంలోకి వచ్చాక అతని బాల్య విశేషాల గురించి అనేక రకాలైన కథలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అందులో వేటిలోనూ నిర్దిష్టమైన సమాచారం లభించలేదు. నారాయణ గురు 1856లో కేరళ లోని తిరువనంతపురం సమీపంలోని చెంపళంతి అనే గ్రామంలో మదన్ ఆసన్, కుట్టియమ్మ అనే వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించాడు. వయలవరంలోని వారి ఇల్లు ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థాయిలో ఉంది. అతనికి నారాయణన్ అనే పేరు పెట్టి, నానూ అని పిలుచుకునే వారు. నానూకు ముగ్గురు సోదరీ మణులు ఉండేవారు. తండ్రి మదన్ ఆసన్ ఉపాధ్యాయుడు. అతనికి సంస్కృతం, జ్యోతిష శాస్త్రం, ఆయుర్వేదం లోనూ ప్రవేశం ఉండేది. నారాయణన్ కు ఐదేళ్ళ వయసులో పక్కనే ఉన్న గురుకుల పాఠశాల లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు.[4]

గుర్తింపు

రవీంద్రనాథ ఠాగూర్ నారాయణ గురును 1922 నవంబరున శివగిరి ఆశ్రమంలో కలిశాడు. తరువాత ఠాగూర్ అతనిని గురించి నారాయణ గురును మించిన లేక అతనితో పోల్చదగిన ఆధ్యాత్మిక వేత్తను నేను ఎన్నడూ చూడలేదని ప్రశంసించాడు.[5][6]

ఇవి కూడా చూడండి

మూలాలు