నుదురు

లలాటము, నుదురు లేదా నొసలు (Forehead) తలకు ముందుభాగమైన ముఖంలో పైన, రెండు కన్నులకు, ముక్కుకు పైనున్న భాగం. తలపైని వెంట్రుకలు నుదిటికి పై హద్దు, నుదిటి దిగువ హద్దు కళ్ళకు పైన ఉన్న పుర్రె యొక్క ఎముక సుప్రా ఆర్బిటల్ రిడ్జ్ . నుదిటి యొక్క రెండు వైపులా టెంపోరల్ రిడ్జ్లు ఉంటాయి. [1] [2] అయితే, కనుబొమ్మలు నుదిటిలో భాగం కావు.

నుదురు
నుదుట బొట్టుతో ఒక వనిత
లాటిన్frons
అంగ వ్యవస్థUnknown, none
ధమనిsupraorbital, supratrochlear
సిరsupraorbital, frontal
నాడిfrontal
MeSHForehead
Dorlands/Elsevierf_16z/12379682

హిందువులు నుదుట బొట్టు పెట్టుకుంటారు.

పని

హావభావాలు

నుదిటి కండరాలు ముఖ కవళికలను ఏర్పరచటానికి సహాయపడతాయి. నాలుగు ప్రాథమిక కదలికలు ఉన్నాయి, ఇవి విడివిడిగా గానీ, కలయికతో గానీ విభిన్న వ్యక్తీకరణలను ఏర్పరుస్తాయి. ఆక్సిపిటోఫ్రంటాలిస్ కండరాలు కనుబొమ్మలను కలిసి గానీ విడివిడిగా గానీ పైకి లేపుతాయి. ఇది ఆశ్చర్యం, కుతూహలం లను ఏర్పరుస్తుంది. ముడతలుగల సూపర్సిలి కండరాలు కనుబొమ్మలను లోపలికి, క్రిందికి లాగగలవు, ఇది కోపాన్ని ఏర్పరుస్తుంది. ప్రొసెరస్ కండరాలు కనుబొమ్మల మధ్య భాగాలను క్రిందికి లాగగలవు. [3]

ముడుతలు

నుదిటిలోని కండరాల కదలికలు చర్మంలో ముడుతలను ఉత్పత్తి చేస్తాయి. ఆక్సిపిటోఫ్రంటాలిస్ కండరాలు నుదిటి పైన అడ్డంగా ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ముడుతలను ఉత్పత్తి చేస్తాయి. సూపర్సిలి కండరాలు ముక్కు పైన కనుబొమ్మల మధ్య నిలువు ముడుతలను ఉత్పత్తి చేస్తాయి. ప్రొసెరస్ కండరాలు ముక్కును ముడతలు పడేలా చేస్తాయి. [3]

మూలాలు