నో టైమ్ టు డై

నో టైమ్‌ టు డై 2021లో ఇంగ్లీషులో విడుదలైన జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లోని 25వ సినిమా. ది త్రీడీలో విడుదల కానున్న మొదటి జేమ్స్‌బాండ్‌ సినిమా. నో టైం టు డై 2019 నవంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల 2020 ఏప్రిల్‌కు వాయిదా పడింది. అయితే కరోనా వైరస్ కారణంగా 2020 నవంబర్‌కు, ఆ తర్వాత 2021 ఏప్రిల్‌కు వాయిదా పడి ఎట్టకేలకు 2021 సెప్టెంబర్ 28న విడుదల చేశారు.

నో టైమ్‌ టు డై
దర్శకత్వంకారీ ఫుకునాగా
స్క్రీన్ ప్లేనెయిల్ పుర్విస్ , రాబర్ట్ వాడె, క్యారీ జోజి ఫుకునగా, వాలర్ బ్రిడ్జ్
కథనెయిల్ పుర్విస్ , రాబర్ట్ వాడె, క్యారీ జోజి ఫుకునగా
నిర్మాత
  • మైఖేల్ జి. విల్సన్
  • బార్బరా బ్రోకలీ
తారాగణం
  • డేనియల్‌ క్రెగ్‌
  • రమీ మాలెక్‌
  • లియా సెడూ
  • క్రిస్టోఫ్‌ వాల్ట్స్‌
ఛాయాగ్రహణంలైనస్‌ సాండ్‌గ్రెన్‌
కూర్పుఇలియట్ గ్రాహం, టామ్ క్రాస్
సంగీతంహన్స్‌ జిమ్మర్‌
నిర్మాణ
సంస్థలు
మెట్రో -గోల్డ్విన్ - మేరు , ఇయాన్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుయూనివర్సల్ పిక్చర్స్
విడుదల తేదీ
2021 సెప్టెంబరు 28 (2021-09-28)
సినిమా నిడివి
163 నిమిషాలు[1]
భాషఇంగ్లీష్
బడ్జెట్$250–301 million[2][3]
బాక్సాఫీసు$313.3 million[4][5]

కథ

ఎంఐ6 లేబొరేటరీలో పనిచేసే శాస్త్రవేత్త ఓబ్రుచెవ్‌(డేవిడ్‌) అపహరణకు గురవుతాడు. బయో వెపన్ ను స్పెక్టర్ ముఠా దొంగిలిస్తుంది. దానిని ఉపయోగించి ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవాలన్నది సాఫిన్‌(రామి మాలిక్‌) కోరిక. జేమ్స్ బాండ్(డేనియల్ క్రెయిగ్), తను ప్రేమించిన అమ్మాయి మెడిలిన్ స్వాన్(లియా సెడూ) ఐదేళ్ళుగా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న అతడికి బయో వెపన్ ఆచూకీ తెలుసుకోవాల్సింది అధికారులు కోరతారు. ఓబ్రుచెవ్‌(డేవిడ్‌)ను బాండ్‌ ఎలా కనిపెట్టాడు ? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా సినిమా కథ.[6][7]

నటీనటులు

  • డేనియల్‌ క్రెగ్‌
  • రామి మాలెక్‌
  • లీసైడెక్స్‌
  • లషాణా లించ్‌
  • బెన్‌ విస్‌షా
  • నవోమి హారిస్‌
  • జెఫ్రీ రైట్‌

సాంకేతిక నిపుణులు

  • కథ, స్క్రీన్‌ప్లే: క్యారీ జోజి ఫుకునాగా, నీల్‌ పర్విస్‌, రాబర్ట్‌ వేడ్‌
  • దర్శకత్వం: క్యారీ జోజి ఫుకునాగా
  • సంగీతం: హన్స్‌ జిమ్మర్‌
  • సినిమాటోగ్రఫీ: లైనస్‌ సాండ్రన్‌
  • ఎడిటింగ్‌: ఇల్లాట్‌ గ్రాహమ్‌

మూలాలు