పరాగ్ అగర్వాల్

భారతీయ-అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్, టిట్వర్ సి.ఇ.ఒ.

పరాగ్ అగర్వాల్  ఇప్పుడు ఈ పేరు ప్రపంచమంతా తెలుసు.జాక్ డోర్సీ స్థానంలో ట్విట్టర్ సీఈవో గా నియమితులైన ఆయన గురించే చర్చ సాగుతోంది.భారత్‌లోని ముంబైలో పుట్టి అమెరికాకు వెళ్లిన ఆయన ట్విట్టర్‌లో ఇంజినీర్‌గా చేరిన పది సంవత్సరాల కాలంలోనే సీఈవో స్థాయికి చేరుకున్నారు.ఇప్పటికే ప్రతిష్ఠాత్మక టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్ (సుందర్ పిచాయ్), ఐబీఎం (అరవింద్ కృష్ణ), మైక్రోసాఫ్ట్ (సత్య నాదెళ్ల), అడోబ్ (శాంతనూ నారాయణ్)లకు భారత వ్యక్తులు అధిపతులుగా ఉండగా ఇప్పుడు పరాగ్ అగర్వాల్ వారి సరసన చేరాడు.ప్రపంచ ప్రముఖ సంస్థల్లో ఒకటైన ట్విట్టర్ సీఈవో స్థానాన్ని దక్కించుకున్నారు.భారత ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటారు.[3]

పరాగ్ అగర్వాల్
2005లో పరాగ్ అగర్వాల్
జననం (1984-05-21) 1984 మే 21 (వయసు 39)[1]
విద్య
  • ఐఐటి బాంబే (BTech)
  • Stanford University (MS, PhD)
బిరుదుసీఈవో, ట్విట్టర్
అంతకు ముందు వారుజాక్ డోర్సీ
జీవిత భాగస్వామివినీతా అగర్వాల్[2]
పిల్లలు1

జీవిత విశేషాలు

పరాగ్ అగర్వాల్ భారత్‌లోని ముంబైలో 1984 వ సంవత్సరం లో జన్మించారు.ఆయన తండ్రి అటామిక్ ఎనర్జీ శాఖలో సీనియర్ ఆఫీసర్ గా పని చేశారు.ఆయన తల్లి స్టూల్ టీచర్ గా రిటైర్ అయ్యారు.పరాగ్ స్కూల్ విద్య అంతా అటామిక్ ఎనర్జీ సెంట్రల్ పాఠశాలలో సాగింది.ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే నుంచి 2015లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు.అనంతరం అమెరికా వెళ్లారు.అక్కడ కాలిఫోర్నియాలోని స్టాండ్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

వృత్తి జీవితం

మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ, యాహూ సంస్థల్లో తొలుత పని చేశారు.ఆ మూడు సంస్థల్లోనూ మంచి పేరు సంపాదించారు.ఎక్కువగా పరిశోధన విభాగాల్లోనే పని చేయడం ఆయనకు కలిసి వచ్చింది.2011లో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్‌లో చేరారు.మొదట్లో ఆయన ప్రకటనలకు సంబంధించిన ప్రొడక్టులు, ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్ పై పని చేశారు.సంస్థ తొలి డిస్టిన్‌గ్యూష్డ్ ఇంజినీర్ (Distinguished Engineer) కూడా ఆయనే కావడం విశేషం.పరాగ్ ప్రతిభకు మెచ్చి 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) గా నియమించింది ట్విట్టర్.2016, 2017లో ట్విట్టర్ వేగంగా అభివృద్ధి చెందడంలో,యూజర్లు గణనీయంగా పెరగడంలో పరాగ్ కృషి ఎంతో ఉందని ట్విట్టర్ వెల్లడించింది.ఈ క్రమంలో ఆయనను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమించింది.

ప్రాజెక్ట్ బ్లూస్కై

2019 నవంబర్‌లో అప్పటి సీఈవో జాక్ డోర్సీ ప్రాజెక్ట్ బ్లూస్కై ప్రాజెక్టుకు పరాగ్‌ను హెడ్ ని చేశాడు.ట్విట్టర్ లో తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు స్వతంత్ర బృందాన్ని ఏర్పాటు చేసుకోవడమే ప్రాజెక్ట్ బ్లూస్కై.

జీత భత్యాలు

జాక్ డోర్సే సీఈవో పదవికి రాజీనామా చేయడంతో పరాగ్ అగర్వాల్ ఆ బాధ్యతలనుతీసుకున్నారు.పరాగ్ జీతానికి సంబంధించిన వివరాలను యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు ట్విట్టర్ తెలిపింది.ఏడాదికి 1 మిలియన్ డాలర్ల (రూ. 7.5 కోట్లకు పైగా) వేతనాన్ని ఆయన పొందుతారని  దీంతో పాటు 1.25 మిలియన్ డాలర్ల (రూ. 94 కోట్లు) విలువైన షేర్లను కూడా పొందుతారని తెలిపింది.[4]

ట్విట్టర్ సీఈవో

నవంబర్ 29, 2021న ట్విట్టర్ సీఈవో పదవికి జాక్ డోర్సీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.దీంతో దిగ్గజ టెక్ సంస్థకు సీఈవోగా నియమితుడైన అతి పిన్నవయస్కుడిగా పరాగ్ అగర్వాల్ నిలిచారు.మార్క్ జుకర్ బర్గ్ కూడా సరిగ్గా 37ఏళ్ల వయసులోనే ఫేస్‌బుక్ సీఈవో గా బాధ్యతలు తీసుకున్నారు.

మూలాలు