పోలిట్‌బ్యూరో

రాజకీయ పార్టీల కార్యనిర్వాహక కమిటీ

రాజకీయ పక్షాలలో, ముఖ్యంగా కమ్యూనిజం ఆశయాలు పాటించే పార్టీలలో సంస్థాగతమైన నిర్ణయాలు తీసుకుని, అమలు చేసే విభాగాన్ని పోలిట్‌బ్యూరో లేదా ఆచరణాదేశక వర్గం (Politburo) అంటారు.[1] ఈ విభాగ అధ్యక్ష పదవిని సర్వ కార్యదర్శి (General Secretary) అని వ్యవహరిస్తారు. ఈ వ్యక్తి పార్టీ మొత్తంమీద అధికారాలు కలిగి, గమనాన్ని నిర్దేశించగలుగుతాడు.ప్రతి ప్రధాన రాజకీయ పార్ఠీలు అన్ని పోలిట్‌బ్యూరోలు కలిగిఉన్నాయి.

సీపీఎం పొలిట్‌బ్యూరో జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం (భారతదేశం)

చరిత్ర, వివరణ

పొలిట్‌బ్యూరో, లేదా పొలిటికల్ బ్యూరో అనేది ఎక్కువుగా కమ్యూనిస్ట్ పార్టీలో చాలా ముఖ్యమైన నిర్ణయాధికారం కలిగి పార్ఠీకి నాయకత్వానికి ప్రధాన అవయవం లాంటిది. సాధారణంగా పాశ్చాత్య రాజకీయ వ్యవస్థలలో ఇది ఒకరకంగా మంత్రివర్గానికి సమానంగా భావించవచ్చు.రాజకీయ పక్షంలో వచ్చే అన్ని వివాదాస్పద సమస్యలును పర్వేక్షించి, విధాన నిర్ణయాలను ప్రకటిస్తుంది. సోవియట్ దేశ వ్యవస్థలో పొలిట్‌బ్యూరో చాలా కాలం (1952 - 1966 మధ్య ప్రెసిడియం అని పిలుస్తారు) ఉన్నత రాజకీయ వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా ఉంది.[2]

కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెసు 1919 మార్చిలో పొలిట్‌బ్యూరోను అధికారికంగా ఎనిమిదవ కాంగ్రెస్‌లో స్థాపించబడింది.[2] దాని మొదటి సమావేశాన్ని అదే సంవత్సరం ఏప్రిల్ 16 న నిర్వహించింది. ఇంతకుముందు నాయకుల చిన్న సమూహాలు ఉండేవి. కానీ ఇవి ఎన్నడూ లాంఛనప్రాయంగా సంస్థాగత నిర్ణయాలు తీసుకునేవి కావు.ఇవి సాధారణంగా ప్రతి 4 - 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. పొలిట్‌బ్యూరోలో పూర్తి సభ్యులు, "అభ్యర్థులు" అని పిలవబడేవారు ఉంటారు. వారు అన్ని సమావేశాలకు హాజరుకావచ్చు. కానీ ఏ అంశంపై ఓటు హక్కు ఉండదు.కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పొలిట్‌బ్యూరో అభ్యర్థుల మొదటి పరిమాణం 1970 ల చివరలో పద్నాలుగు మంది అభ్యర్థుల నుండి ఎనిమిది మంది అభ్యర్థులకు కుదించబడింది.సోవియట్ చరిత్ర మొత్తంలో, దేశ అభివృద్ధిలో కీలకమైన అంశాలపై ఎల్లప్పుడూ కీలకమైన ఓటును జనరల్ కార్యదర్శి కలిగి ఉంటాడు.[3] తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే వరకు లెనిన్ పొలిట్‌బ్యూరోపై తన పట్టును పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు.పొలిట్‌బ్యూరో సభ్యులకు మిగిలి ఉన్నదంతా “అగ్రశ్రేణి” అన్ని ఆలోచనలకు లోబడి ఉండటమే. ఎలాంటి వ్యతిరేకత కనపర్చటానికి అవకాశం ఉండదు.అలాంటి పరిస్థితి ఉంటే వారి మనుగడకు ముప్పు ఏర్పడింది.[3]

మూలాలు

వెలుపలి లంకెలు