ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం (అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం) ప్రతి సంవత్సరం అక్టోబరు 14న నిర్వహించబడుతుంది.[1] ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రమాణ సంస్థలు తమతమ దేశాలలో ప్రమాణాలను నిర్ణయించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఏఎస్ఎంఈ),[2] ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (ఐఈసీ), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ), ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయు), ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ), ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ (ఐఈటీఎఫ్) వంటి ప్రమాణాల అభివృద్ధి సంస్థలలో స్వచ్ఛంద ప్రమాణాలను అభివృద్ధి చేసే వేలాది మంది నిపుణుల కృషిని గుర్తుచేసుకుంటారు.

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం
తేదీ(లు)అక్టోబరు 14
ఫ్రీక్వెన్సీవార్షికం
ప్రదేశంప్రపంచవ్యాప్తంగా
స్థాపితం1946 (ఏర్పాటు), 1970 (ప్రారంభం)
1985 ఇరాన్ లో "ది వరల్డ్ స్టాండర్డ్ డే" స్టాంప్

చరిత్ర

1946, అక్టోబరు 14న లండన్‌లో జరిగిన సమావేశంలో 25 దేశాల ప్రతినిధులు పాల్గొని వినియోగదారులకు ప్రామాణికమైన, నాణ్యమైన వస్తు ఉత్పత్తులను అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణిక సంస్థను ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించారు. దానికి గుర్తుగా అక్టోబరు 14న పంచ ప్రమాణాల దినోత్సవం జరుపబడుతుంది. ఒక సంవత్సరం తరువాత అంతర్జాతీయ ప్రమాణిక సంస్థ ఏర్పడినప్పటికీ, 1970 వరకు మొదటి ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకోలేదు.[3]

లక్ష్యం

ప్రస్తుతం ఈ సంస్థలో 125 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రామాణీకరణ యొక్క ప్రాముఖ్యత గురించి పరిశ్రమలు, వినియోగదారులలో అవగాహన పెంచుతారు.

ఇతర వివరాలు

  1. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని జాతీయ సంస్థలు వేరువరు రోజుల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 2014లో యునైటెడ్ స్టేట్స్ 2014, అక్టోబరు 23న ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహించింది.[4]
  2. కెనడా దేశపు జాతీయ అక్రెడిటేషన్ బాడీ అయిన స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ కెనడా (ఎస్.సి.సి) అంతర్జాతీయ సంస్థలతో కలిసి ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2012లో స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అక్టోబరు 12 శుక్రవారం రోజున ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంది.
  3. 1947లో భారతదేశంలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ చట్టాన్ని ఆమోదించి దానిని శాసనపరమైన సంస్థగా మార్చి, ఐ.ఎస్‌.ఐ ముద్రను ప్రకటించారు. 1947లోనే భారతీయ ప్రమాణాల సంస్థ తొలిసారిగా బట్టలకు, ఇంజనీరింగ్‌కు రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మొదటగా మన జాతీయ పతాకం ఎంత పొడవు, వెడల్పు ఉండాలో నిర్ణయించింది. 1951లో ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ సంస్థ కార్యాలయంలో దీనిని అందుకున్నాడు.

మూలాలు

ఇతర లంకెలు