మిథాలి రాజ్

భారతదేశపు అత్యుత్తమ క్రికెట్ క్రీడాకారిణి

మిథాలి రాజ్ మాజీ భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిల్చింది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటర్ అయిన మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేసేది. 2003లో ఆమెకు అర్జున అవార్డు లభించింది.[2]

మిథాలి రాజ్
2018 లో మిథాలి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మిథాలి దొరై రాజ్
పుట్టిన తేదీ (1982-12-03) 1982 డిసెంబరు 3 (వయసు 41)[1]
జోధ్‌పూర్, రాజస్థాన్
ఎత్తు5 ft 4 in (1.63 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం లెగ్ బ్రేక్
పాత్రTop-order batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 56)2002 జనవరి 14 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2021 సెప్టెంబరు 30 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 56)1999 జూన్ 26 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2022 మార్చి 27 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.03
తొలి T20I (క్యాప్ 9)2006 ఆగస్టు 5 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2019 మార్చి 9 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1996/97–1998/99ఆంధ్ర
1999/00Air India
2000/01–2021/22రైల్వేస్
2018Supernovas
2019–2022Velocity
కెరీర్ గణాంకాలు
పోటీమటెమవన్‌డేWT20I
మ్యాచ్‌లు1223289
చేసిన పరుగులు6997,8052,364
బ్యాటింగు సగటు43.6850.6837.52
100s/50s1/47/640/17
అత్యధిక స్కోరు214125*97*
వేసిన బంతులు721716
వికెట్లు080
బౌలింగు సగటు11.37
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు0
అత్యుత్తమ బౌలింగు3/4
క్యాచ్‌లు/స్టంపింగులు12/–58/-19/–
మూలం: CricInfo, 2022 మార్చి 27

ఆమె చిన్నప్పుడు భారత సాంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాట్యం చేసేది. ప్రస్తుతం మిథాలి భారతీయ రైల్వేల్లో ఉద్యోగం చేస్తున్నది. మిథాలీ రాజ్‌ 2022లో ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో పాల్గొని అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డును సృష్టించింది.[3] 2022 జూన్ 8న అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి మిథాలి రాజ్ రిటైర్మెంట్ ప్రకటించింది.[4][5]

హైదరాబాద్‌లో 2024 జనవరి 24న జరిగిన కార్యక్రమంలో క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాళ్లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా 2020-21లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు‌గానూ మిథాలీ రాజ్‌ అవార్డును అందుకుంది.[6]

జీవిత విశేషాలు

మిథాలీ రాజ్ 1982 డిసెంబరు 3 న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక తమిళ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దొరై రాజ్, భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్ (వారెంట్ ఆఫీసర్), తల్లి లీలా రాజ్. మిథాలీ 10 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆమె హైదరాబాద్‌లోని కీస్ హైస్కూల్ ఫర్ గర్ల్స్ చదివింది. సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. చదువుకునే రోజుల్లో అన్నయ్యతో కలిసి క్రికెట్ కోచింగ్ తీసుకోడం ప్రారంభించింది.[7][8]

క్రీడా జీవితం

మిథాలి 1999లో తన పదహారేళ్ల ప్రాయంలో ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి మొత్తం 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ-20లు ఆడింది. ఆమె 12 టెస్టుల్లో 699 పరుగులు, 232 వన్డేల్లో 7805 పరుగులు, 89 టీ-20ల్లో 2364 పరుగులు చేసింది. మిథాలీ వన్డేల్లో ఇన్ని పరుగుల మైలురాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 114 నాటౌట్, టెస్టుల్లో అత్యధిక స్కోరు 214 పరుగులు, టీ-20ల్లో 97 నాటౌట్.[9]

రికార్డులు

పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న మిథాలి రాజ్
  • వన్డేల్లో అత్యధిక పరుగులు (7805) సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు[10]
  • వన్డే క్రికెట్‌లో అత్యధిక అర్ధ శతకాలు సాధించిన మహిళా క్రికెటర్‌
  • మహిళా వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌ జాబితాలో రెండో స్థానం (1321 పరుగులు)
  • వన్డేల్లో అత్యధిక సెంచరీలు (7) సాధించిన భారత మహిళా క్రికెటర్‌
  • టీ20 ఫార్మాట్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో మిథాలీ సాధించిన పరుగులు 2364. టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్‌ (రిటైర్మెంట్ నాటికీ)
  • మహిళా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమె చేసిన పరుగులు 10868. ఆమె (రిటైర్మెంట్ నాటికీ) 10 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌.
  • మహిళా ప్రపంచకప్‌ ఈవెంట్‌లో ఏకంగా ఆరుసార్లు (2000, 2005, 2009, 2013, 2017, 2022) పాల్గొన్న క్రికెటర్‌గా గుర్తింపు.
  • మహిళా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా గుర్తింపు.
  • మహిళా వన్డే క్రికెట్‌లో అతి పిన్న (16 ఏళ్ల 205 రోజులు) వయసులో సెంచరీ సాధించిన బ్యాటర్‌
  • మహిళా క్రికెట్‌లో సుదీర్ఘ కాలం (22 ఏళ్ల 274 రోజుల) పాటు కొనసాగిన క్రికెటర్‌గా రికార్డు.
  • మహిళా ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక సార్లు (12) హాఫ్‌ సెంచరీ ప్లస్‌ స్కోరు చేసిన క్రికెటర్‌గా (న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డెబీ హాక్లేతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానం).
  • మహిళా ప్రపంచకప్‌ టోర్నీలో కెప్టెన్‌గానూ యాభై కంటే ఎక్కువ పరుగులు ఎనిమిది సార్లు చేసింది.
  • వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్‌గా రికార్డు.
  • మహిళల క్రికెట్‌లోనే కాకుండా పురుషుల క్రికెట్‌లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డు మిథాలీ సొంతం. అదేమిటంటే.. ​​​తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ అరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్‌తో కలిసి మిథాలీ వరల్డ్‌కప్‌-2022లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది.

అవార్డులు

తొమ్మిదేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన ఆమె ప్రపంచ మహిళల క్రికెట్లో తన సత్తా చాటారు. తన 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు, మరెన్నో రికార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. భారత క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు 2003లొ మిథాలి రాజ్ కు ప్రధానం చేయబడింది. మిథాలీ రాజ్ 2021 నవంబరు 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డును అందుకుంది.[11]

మూలాలు

బయటి లింకులు