ముస్లిం లీగ్

ముస్లిం లీగ్ (బెంగాలీ : অল ইন্ডীয়া মুসলিম লিগ ఉర్దూ: آل انڈیا مسلم لیگ), ఢాకాలో 1906 లో స్థాపించబడింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి రాజకీయ పార్టీ. భారత ఉపఖండంలో ముస్లింల కొరకు ప్రత్యేక దేశం పాకిస్తాన్ ఆవిర్భావానికి పాటుపడింది.[1] భారత్ కు స్వాతంత్ర్యం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో భారతీయ సమైక్య ముస్లిం లీగ్ అనే పేరుతో కేరళ, కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయింది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రథమ రాజకీయ పార్టీగా అవతరించింది. బంగ్లాదేశ్ లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.

'అఖిల భారత ముస్లిం లీగ్'
Leaderనవాబ్ వికారుల్ ముల్క్ (మొదటి గౌరవ అధ్యక్షుడు)
Foundedడిసెంబరు 30 1906, ఢాకా
Headquartersలక్నో (ప్రధాన కేంద్రము)
Official ideology/
political position
ముస్లింల కొరకు రాజకీయ హక్కులు

చరిత్ర

ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడింది. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించింది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్‌లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా బలూచిస్తాన్, తూర్పు బెంగాల్, కాశ్మీరు లోయ, వాయువ్య సరిహద్దులు, పంజాబ్ ప్రాంతం, సింధ్ ప్రాంతాలు, బాంబే ప్రెసిడెన్సీ లలో వుండేది.

స్థాపన

దీని స్థాపన 1906 డిసెంబరు 30అఖిల భారత ముహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ షాహ్‌బాగ్ సమావేశంలో జరిగింది. ఢాకాలో జరిగిన ఈ సదస్సులో నవాబ్ సర్ ఖ్వాజా సలీముల్లా పాల్గొన్నాడు. ఈ సదస్సులో మూడువేల మంది హాజరయ్యారు, సదస్సుకు నవాబ్ వికారుల్ ముల్క్ అధ్యక్షత వహించాడు.[2]

ఆరంభ సంవత్సరాలు

సర్ ఆగా ఖాన్ ముస్లింలీగ్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం లక్నోగా ఏర్పడింది. ఇందులో ఆరు ఉపాధ్యక్షులు, ఒక సచివుడు, రెండు ఉప-సచివులు ప్రారంభ మూడు సంవత్సరాలకు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రతినిధులు వేరు వేరు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.[3]

పాకిస్తాన్ కొరకు ఉద్యమం

లాహోర్ సమావేశంలోని ముస్లింలీగ్ కార్యాచరణ కమిటీ

1940 లో జరిగిన లాహోర్ సమావేశంలో జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు చెందినవారు, వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విశదమయ్యే విషయమేమంటే, వీరిరువురూ వేర్వేరు చారిత్రక వనరులద్వారా ప్రేరేపితమౌతారు. వీరి గ్రంథాలు వేర్వేరు, వర్ణనలు వేర్వేరు, ఇలాంటి సమయంలో వీరిరువురూ ఒకే రాజ్యంలో (దేశంలో) ఇమడలేకపోతారు, కావున వీరిరువురికీ ప్రత్యేకమైన రాజ్యాలుండడం శ్రేయస్కరం.

మూలాలు

ఇవీ చూడండి

బయటి లింకులు