రాష్ట్రీయ లోక్‌దళ్‌

భారతదేశం యొక్క రాజకీయ పార్టీ
(రాష్ట్రీయ లోక్ దళ్ నుండి దారిమార్పు చెందింది)

రాష్ట్రీయ లోక్ దళ్ (సంక్షిప్తంగా: ఆర్ఎల్‌డీ) ( అనువాదం : నేషనల్ పీపుల్స్ పార్టీ ) అనేది ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లోని ఒక భారతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీ. 1996లో జనతాదళ్ నుండి విడిపోయిన తరువాత భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు చౌదరి అజిత్ సిం‍గ్ ఈ పార్టీని స్థాపించాడు.

రాష్ట్రీయ లోక్‌దళ్‌
Chairpersonజయంత్ చౌదరి[1]
స్థాపకులుచౌదరి చరణ్ సింగ్
స్థాపన తేదీ1996; 28 సంవత్సరాల క్రితం (1996)
Preceded byలోక్ దళ్
ప్రధాన కార్యాలయంAB 97, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ, 110011
రాజకీయ విధానంసెక్యులరిజం[2]
ప్రాంతీయవాదం[3]
జాట్‌ల అభ్యున్నతి[4]
రైతుల హక్కులు[5]
ECI Statusగుర్తింపు లేని పార్టీ[6]
కూటమిCurrent

గతంలో

లోక్‌సభ స్థానాలు
0 / 543
రాజ్యసభ స్థానాలు
1 / 245
శాసన సభలో స్థానాలు
9 / 403
Election symbol
Party flag
Website
www.rashtriyalokdal.com

చరిత్ర

అజిత్ సిం‍గ్ 1996లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ఎన్నికయ్యాడు. కానీ పార్టీకి, లోక్‌సభకు రాజీనామా చేసి భారతీయ కిసాన్ కంగర్ పార్టీని స్థాపించి 1997లో లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో బాగ్‌పట్ నుండి తిరిగి ఎన్నికయ్యాడు.

1999లో రాష్ట్రీయ లోక్ దళ్ పేరుతో పార్టీని పునఃప్రారంభించాడు. అయన 1998 ఎన్నికలలో ఓడిపోయి, 1999, 2004, 2009లో తిరిగి ఎన్నికై ఎన్‌డీఏ ప్రభుత్వంలో 2001 నుండి 2003 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2011లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో చేరిన తర్వాత డిసెంబర్ 2011 నుండి మే 2014 వరకు పౌర విమానయాన శాఖ మంత్రిగా పని చేశాడు. అజిత్ సింగ్ 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో ముజఫర్‌నగర్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీకి అభ్యర్థి సంజీవ్ బల్యాన్‌ చేతిలో 6526 ఓట్ల అతి స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

ఆర్ఎల్‌డీ ఆ తరువాత 2014 నుండి 2022 వరకు ఉనికిని కోల్పోయి 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో భాగంగా 33 స్థానాల్లో పోటీ చేసి తొమ్మిది స్థానాలను గెలుచుకోగలిగింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) ఇండియా కూటమిలో ఉండగా 2024 మార్చి 2న ఎన్‌డీఏ కూటమిలో చేరింది.[7]

ఆర్ఎల్‌డీ పార్టీ ఆఫీస్ బేరర్లు

  • జాతీయ అధ్యక్షుడు - జయంత్ సింగ్

ఎన్నికల చరిత్ర

లోక్‌సభ

లోక్‌సభభారత

సాధారణ ఎన్నికలు

సీట్లలో

పోటీ చేశారు

సీట్లు

గెలుచుకున్నారు

%

ఓట్లు

12వ లోక్‌సభ199880-
13వ లోక్‌సభ1999720.37%
14వ లోక్‌సభ20041030.63%
15వ లోక్‌సభ2009750.44%
16వ లోక్‌సభ2014800.13%
17వ లోక్‌సభ2019300.24%

ఉత్తర ప్రదేశ్ శాసనసభ

శాసనసభఅసెంబ్లీ ఎన్నికలుసీట్లలో

పోటీ చేశారు

సీట్లు

గెలుచుకున్నారు

%

ఓట్లు

13వ శాసనసభ19963882.13%
14వ శాసనసభ200238142.65%
15వ శాసనసభ2007254101.95%
16వ శాసనసభ20124692.33%
17వ శాసనసభ201717111.71%
18వ శాసనసభ20223395.18%

రాజ్యసభ సభ్యులు

నం.పేరుపదవీకాలంనియోజకవర్గం
1జయంత్ చౌదరి25 మే 2021ప్రస్తుతంఉత్తర ప్రదేశ్

శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు)

నం.పేరునియోజకవర్గంరాష్ట్రం
1డా. సుభాష్ గార్గ్భరత్‌పూర్రాజస్థాన్
2రాజ్‌పాల్ సింగ్ బలియన్బుధానఉత్తర ప్రదేశ్
3పర్సన్ చౌదరిషామ్లీ
4అజయ్ కుమార్చప్రౌలి
5ప్రదీప్ కుమార్ సింగ్సదాబాద్
6గులాం మొహమ్మద్సివల్ఖాస్
7అష్రఫ్ అలీ ఖాన్థానా భవన్
8చందన్ చౌహాన్మీరాపూర్
9అనిల్ కుమార్పుర్ఖాజి
10మదన్ భయ్యాఖతౌలీ

కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల జాబితా

నం.పేరుపదవీకాలంపోర్ట్‌ఫోలియోప్రధాన మంత్రి
1చౌదరి అజిత్ సింగ్22 జూలై 200124 మే 2003వ్యవసాయ మంత్రిఅటల్ బిహారీ వాజ్‌పేయి
18 డిసెంబర్ 201126 మే 2014పౌర విమానయాన శాఖ మంత్రిమన్మోహన్ సింగ్

రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రుల జాబితా

నం.పేరుపదవీకాలంపోర్ట్‌ఫోలియోముఖ్యమంత్రి
1సుభాష్ గార్గ్20182023రాష్ట్ర సాంకేతిక విద్య (IC) , ఆయుర్వేద & భారతీయ ఔషధాల (IC) , పబ్లిక్ గ్రీవెన్స్ & రిడ్రెసల్ (IC) , మైనారిటీ వ్యవహారాల వక్ఫ్, వలసరాజ్యాల వ్యవసాయ కమాండ్ ఏరియా, అభివృద్ధి & నీటి వినియోగంఅశోక్ గెహ్లాట్

మూలాలు