రికార్డింగ్ స్టూడియో

రికార్డింగ్ స్టూడియో (Recording studio) అనేది సంగీత, లేదా ఇతర ధ్వని మీడియాల యొక్క రికార్డింగ్, మిక్సింగ్ లను సిద్ధం చేసుకొనే ఒక ప్రదేశం. కొన్ని స్టూడియోలు స్వతంత్రమైనవి, కానీ అనేకం రికార్డు లేబుల్ లాగా పెద్ద వ్యాపారం యొక్క భాగంగా ఉన్నాయి. ఇండిపెండెంట్ స్టూడియోలు ఒకే బ్యాండ్ లేదా ప్రదర్శకుల సముదాయమునకు చెందినవి రికార్డు చేస్తాయి, అయితే బయటి వారికి కూడా అద్దెకిస్తాయి. కొన్ని స్టూడియోలు అద్దె గంటకి ఇంతని వసూలు చేస్తాయి, అయితే కొన్ని ప్రాజెక్టును బట్టి వసూలు చేస్తాయి.

ఒక రికార్డింగ్ స్టూడియో కంట్రోల్ రూమ్
ఇంగ్లాండ్ లో ఒక రికార్డింగ్ స్టూడియో

నిర్మాణం

రికార్డింగ్ స్టూడియో నిర్మాణం చేసే ముందు అందుకు తగిన ప్రాథమిక సమాచారం అవగాహన చేసుకొని, నా ఉద్దేశ్యం ఏమిటి 'స్టూడియో నిర్మాణం దేనికోసం ఉపయోగించబడుతుంది, బ్యాండ్ లను ప్రత్యక్షంగా రికార్డ్ చేయబోతున్నామా , గ్రాండ్ పియానోకు సరిపోయేంత స్థలం చూడటం , గాయక బృందాల వసతులకు ,కేవలం బీట్ లను ఉత్పత్తి చేస్తున్నారా, వాయిస్ ఓవర్లను రికార్డ్ చేస్తున్నారా, ఇవన్ని దృష్టి లో ఉంచుకొని స్థలం కోసం వెదకడం తో రికార్డింగ్ స్టూడియో నిర్మాణములో ముఖ్యమైనది, ఎందుకంటే తప్పనిసరిగా స్టూడియో పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. వాస్తవానికి పైన తెలిపినవి అన్నీ స్థలం ఖర్చు జమ అవుతాయి . ఒకవేళ అద్దెకు తీసుకుంటున్నా లేదా స్థలాన్ని పూర్తిగా కొనడానికి ప్రయత్నిస్తున్నా, చూస్తున్న ప్రాంతంలో ఆస్తి ధరల అవగాహన తో ఉండాలి . రికార్డింగ్ స్టూడియో నిర్మాణం లో ఆధునిక సాంకేతికతో కూడిన పరికరములను అమర్చు కోవడం , సరిఅయిన అంతర్జాతీయ మెరుగైన ప్రమాణాలతో నెలకొలిపితే వ్యాపారం సజావుగా సాగుతుంది.[1]

రూపకల్పన

రికార్డింగ్ స్టూడియో రూపకల్పన,నిర్మాణానికి ప్రత్యేకమైన జ్ఞానం అవసరం.సాధారణంగా, ఆర్కిటెక్చరల్ ఎకౌస్టిక్స్, సైకోఅకౌస్టిక్స్ నిపుణులు ఇంటీరియర్ డిజైన్‌ను చేస్తారు.సిస్టమ్ డిజైన్, ఆడియో పరికరాల వైరింగ్ సాధారణంగా ప్రత్యేక ఇంజనీరింగ్ సంస్థలచే నిర్వహించబడతాయి. ఖాళీ స్థలంలో స్టూడియోని రూపకల్పన చేసేటప్పుడు,నిర్మించేటప్పుడు, స్కేల్‌కు సరిపోయే సౌండ్‌ప్రూఫ్ స్థలాన్ని రూపొందించడం చాలా సులభం, స్టూడియో డిజైన్ ,నిర్మాణం విషయంలో అంతర్గత నిర్మాణాన్ని బహుళ-అద్దె భవనం లేదా కండోమినియం, ఇది చాలా ప్రత్యేకమైన అనుభవం, జ్ఞానం అవసరమయ్యే ఒక భాగం. పరిసరాల నుండి వచ్చే శబ్దం, విద్యుత్ సరఫరా శబ్దం కలపడం,పరిసరాలకు ధ్వని లీకేజీని నివారించడానికి చాలా భాగాలు ఉన్నాయి , పొరపాటున అస్పష్టమైన రూపకల్పన,నిర్మాణం జరిగితే అది నష్టం. రికార్డింగ్ స్టేషన్ , పనిచేసే స్థలం , రికార్డింగ్ రూమ్ ఫ్లోర్ విధానము అన్ని దృష్టిలో ఉంచుకొని రికార్డింగ్ రూమ్ కు రూప కల్పన చేయాలి.[2]

సిబ్బంది

రికార్డింగ్ స్టూడియో లో పనిచేసే సిబ్బందిలో రిసెప్షనిస్ట్, అకౌంటింగ్, సాధారణ వ్యవహారాలు, అమ్మకాల సంబంధాలు, వాస్తవ రికార్డింగ్ పనిలో పాల్గొన్న రికార్డింగ్ ఇంజనీర్లు, పరికరాలను నిర్వహించే సాంకేతిక ఇంజనీర్లు (నిర్వహణ ఇంజనీర్లు) కలిగి ఉంటారు .ఒక చిన్న స్టూడియోలో, తక్కువ సంఖ్యలో అవసరమును బట్టి తగిన సిబ్బంది ఉంటారు [3] .

ప్రసిద్ధిచెందినవి

20 వ శతాబ్దం ప్రారంభం, మధ్య కాలంలో నిర్మించిన అనేక రికార్డింగ్ స్టూడియోలు ఇప్పటికీ ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి , రికార్డింగ్ స్టూడియో ప్రత్యేక లక్షణాలు, వాతావరణం తో వాటిలో క్రింద పేర్కొన్నవి సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి.[4] [5]

  • అబ్బే రోడ్ స్టూడియోస్ - లండన్
  • ట్రైడెంట్ స్టూడియోస్ - లండన్
  • కాపిటల్ స్టూడియోస్ - లాస్ ఏంజిల్స్
  • ఒలింపిక్ స్టూడియోస్ - లండన్
  • క్రైటీరియా స్టూడియోస్ - మియామీ
  • అట్లాంటిక్ స్టూడియోస్ - న్యూయార్క్
  • చెరోకీ స్టూడియోస్ - లాస్ ఏంజిల్స్
  • మోటౌన్ హిట్స్విల్లే యు.ఎస్.ఎ. స్టూడియోస్ - డెట్రాయిట్
  • మ్యూజిక్ ల్యాండ్ స్టూడియోస్ - మ్యూనిచ్, జర్మనీ
  • సన్ స్టూడియోస్ - మెంఫిస్


మూలాలు