ఐర్లాండ్ గణతణత్రం

(రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ నుండి దారిమార్పు చెందింది)


ఐర్లాండ్ (Listeni/ˈaɪərlənd//ˈaɪərlənd/;), లేదా ఐర్లాండ్ గణతణత్రం అన్నది వాయువ్య ఐరోపాలోనిఐర్లాండ్ ద్వీపంలో ఆరింట ఐదు వంతుల భూమిలో ఉన్న సార్వభౌమ దేశం. దేశ రాజధాని, అత్యంత పెద్ద నగరం ద్వీపానికి తూర్పుదిశగా నెలకొన్న డబ్లిన్ నగరం. డబ్లిన్ నగరపు మెట్రోపాలిటన్ ప్రాంతంలో దేశంలో మూడవ వంతు అయిన 4.75 మిలియన్ల ప్రజలు జీవిస్తున్నారు. రాజ్యం తన ఏకైక భూసరిహద్దును యునైటెడ్ కింగ్‌డమ్ లో భాగమైన ఉత్తర ఐర్లాండ్ పంచుకుంటోంది. అది తప్ప దేశం చుట్టూ అట్లాంటిక్ మహా సముద్రం, దక్షిణాన సెల్టిక్ సముద్రం, ఆగ్నేయ దిశలో సెయింట్ జార్జ్ ఛానెల్, తూర్పున ఐరిష్ సముద్రం ఉన్నాయి.  ఐర్లాండ్ పార్లమెంటరీ గణతంత్ర రాజ్యం.[1] ఆయిరాక్టాస్ అనబడే పార్లమెంటులో డయిల్ ఐరియన్ అనే దిగువ సభ, సీనాడ్ ఐరియన్ అనే ఎగువ సభ ఉంటాయి. ఎన్నికైన అధ్యక్షుడు (ఉవక్టరాన్) అలంకారప్రాయమైనదైనప్పటికీ, అతడికి కొన్ని మున్ని ముఖ్యమైన అధికరాలు, విధులూ ఉంటాయి. ప్రభుత్వ నేత టావోయిసీచ్ (ప్రధాన మంత్రి) ను డయిల్ ఎన్నుకుంటుంది, అధ్యక్షుడు నియమిస్తాడు. టావోయిసీచ్ ఇతర మంత్రులను నియమిస్తాడు.

ఐరోపా పటంలో ఆకుపచ్చ రంగులో చూపబడిన ప్రాంతం "ఐర్లాండ్"

మూలాలు