విండోస్ 10

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 (ఆంగ్లం: Microsoft Windows 10) అనేది మైక్రోసాఫ్ట్ ద్వారా ఉత్పత్తి చేయబడ్డ వ్యక్తిగత కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం. ఇది విండోస్ 8.1 తర్వాత విడుదలైన ఆపరేటింగ్ సిస్టం. ఇది జులై 29, 2015 న విడుదల చేయబడింది.[1]

అభివృద్ధి

2011లో జరిగిన మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ పార్టనర్ కాన్ఫరెన్స్‌లో మైక్రోసాఫ్ట్ మొబైల్ టెక్నాలజీస్ చీఫ్ ఆండ్రూ లీస్ మాట్లాడుతూ వ్యక్తిగత కంప్యూటర్లకు, ఫోన్లకు, టాబ్లకు, మొదలైన పరికరాలన్నిటికి ఒకే సాఫ్ట్వేర్ పర్యావరణం కలిగివుండాలి అని సంస్థ భావిస్తున్నట్లు తెలిపారు.  [2][3]

విడుదల

జూన్ 1, 2015న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను జూలై 29, 2015న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.[1] మైక్రొసాఫ్ట్ జులై 20, 2015 నుండి 29 జులై 2015 వరకు విండోస్ 10 గురించి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలో విస్తృతంగా ప్రచారం చేసింది.[4][5]

సంచికలు, ధర

విండోస్ 10 ఐదు ప్రధాన సంచికలలో లభిస్తుంది, వీటిలో హోమ్, ప్రో వెర్షన్లు చాలా దేశాలలో రిటైల్ గా అమ్ముడవుతున్నాయి. హోమ్ సంచిక గృహ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని విడులైంది. ప్రో సంచిక చిన్న వ్యాపారాలను లక్ష్యంగా చేసుకొని విడులైంది. విండోస్ 10 ప్రతి సంచికలో దాని క్రింద ఉన్న సంచికలోని అన్ని సామర్థ్యాలు, లక్షణాలను కలిగి ఉండటంతో పటు అదనపు లక్షణాలను జోడింపబడి ఉంటుంది.[6]

మూలాలు