వెబ్ పోర్టల్

వివిధ అంతర్జాల సేవలు అనగా ఈమెయిల్, ఆన్లైన్ ఫోరమ్ శోధనా యంత్రమును ఒక సమరూపంలో వెబ్సైటు (జాలస్థలి)మూలకంగా అందజేస్తే దానిని పోర్టల్ (తెలుగులో గవాక్షము, ద్వారం) అంటారు. ప్రతిఒక సమాచారం మూలం పేజీలో కేటాయించబడిన ప్రదేశంలో చూపబడుతుంది. వాడుకరి తనకు ఇష్టమైనరీతిలో సవరించుకొనవచ్చు. దీనికి స్వల్పతేడాలతో మేషప్, ఇంట్రానెట్ డేష్ బోర్డులు అనేవి కూడా వున్నాయి. శోధనాయంత్రపు ఎపిఐలను వాడుకుని వాడుకరులు ఇంట్రానెట్ లో శోధించేటట్లుగా చేయవచ్చు. ఈ మెయిల్, వార్తలు, స్టాకు ధరలు డేటాబేస్ లలోని సమాచారం, వినోద విషయాలు కూడా అందచేయవచ్చు. సమరూపంలో సేవలు అందచేయటం, వాడుకరి స్థితిని బట్టి అందుబాటులో కల సమాచారాన్ని నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. శోధన సంస్థల వెబ్ సైట్లు శోధనతో పాటు, ఈ-మెయిల్, వార్తలు, గ్రూపుల వార్తలు అందిచటానికి ఏర్పడ్డాయి. ఉదా: గూగుల్, యాహూ.

గూగుల్ తెలుగు

చరిత్ర

1990 దశకంలో విహరిణులు వ్యాప్తి చెందిన తరువాత, వ్యాపార సంస్థలు వెబ్ పోర్టల్ నిర్మాణం, లేక కొనటం ద్వారా ఇంటర్నెట్ విపణిలో తమకొక స్థానం పొంద దలచాయి. వెబ్ పోర్టల్ వాడుకరులు వెబ్లో విహరించడంలో తొలిగా చూసేది కాబట్టి చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. వీటిలో విషయం వ్యాపారంలో మార్పులకు అనుగుణంగా మారింది. నెట్ స్కేప్ అమెరికా ఆన్లైన్ లో విలీనం కాగా, వాల్ట్ డిస్నీ కంపెనీ గో.కామ్ అనే పోర్టల్ ను, ఐబిఎమ్ ప్రాడిజీ అనే పోర్టల్ ను ప్రారంభించాయి.

విభజన

వీటిని సమాంతరంగా లేక నిలువుగా విభజించుతారు. సమాంతర పోర్టల్ లో ఒకే రకమైన వ్యాపారం లేక రంగంలోని అన్ని కంపెనీలు లేక సంస్థలు వేదికగా వాడుకుంటాయి.[1] నిలువు పోర్టల్ లేక వోర్టల్ అనేది ఒక విశిష్ట మైనదానికి మాత్రమే సంబంధించినది[2]

వార్తలు (తెలుగు) పోర్టల్

తెలుగు టీవీ వార్తల ఛానళ్లు అనుబంధంగా వెబ్ పోర్టల్ నిర్వహిస్తున్నాయి. ఇతర భాషలలో పేరుగాంచిన పత్రికలు కూడా తెలుగులో వెబ్ పోర్టల్ నిర్వహిస్తున్నాయి. ఇవికాక కేవల వెబ్ పోర్టల్ నిర్వహించే సంస్థలూ వున్నాయి.

వెబ్ దునియా

  • వెబ్ దునియా:[3] 2000 సంవత్సరంలో నెట్లో భారతదేశ భాషలలో సేవలందచేయుటకు వినయ్ చజ్లిని స్థాపించారు. 2020 లో RWS కంపెనీ 21 మిలియన్ డాలర్లకు ఈ కంపెనీని చేజిక్కించుకుంది.[4]

ఇతరాలు

ప్రభుత్వ పోర్టల్

ఎపి ఆన్లైన్ తెలుగు

ప్రభుత్వాలు నిర్వహించే జాలస్థలలు ఈ విభాగానికి చేరుతాయి. తెలుగులో ముఖ్యమైనవి,

  • ఏపిఆన్లైన్ [10]

మూలాలు