శిలాశాసనం

తెలుగు శాసనాలు
విష్ణుకుండినులు
తూర్పు చాళుక్యులు
పశ్చిమ చాళుక్యులు
రాష్ట్రకూటులు
ఇతర వంశములు
సామ్రాజ్య చోళులు
కాకతీయులు
రెడ్డి రాజులు
రేచర్ల రెడ్లు
రేనాటి చోళులు
వైడుంబులు
చిందులు
తూర్పు గాంగులు
గజపతులు
కుతుబ్‌షాహీలు
మొఘల్‌ సామ్రాజ్యము
సూచిక I
సూచిక II

శిలాశాసనం (ఆంగ్లం : Epigraphy "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం, కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే శాసనం అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే శిలపై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గలవు.ఇలాంటి శాసనాలకు భారతలో ఉదాహరణలు:అశోకుడి (శిలా) శాసనం.

శిలాశాసనాలను అచ్చుతీసుకునే పద్దతి

ఎస్టాంపేజి (Estampage) శాసనంలో వున్న అక్షరాలను యధాతదంగా అదే పరిమాణంలో అదే వరసల్లో అచ్చంగా అచ్చుతీసుకునే పద్దతి ఇది. ఇప్పటి వరకూ ఆర్కియాలజీ డిపార్ట్మంట్ కూడా అధికారికంగా వాడుతున్న పద్దతి ఇది. నునుపైన గ్రానైట్ రాతిపైన గంటుకొడుతూ రాసిన అక్షరాలను అచ్చుతీసుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే ఎగుడుదిగుడుగా వున్న ఇసుక రాళ్ళలో పలచటి గంట్లుగా అక్షరాలు వుంటే ఇది కొంత కష్టం అవుతుంది.

  1. శాసనం ఉపరితలాన్ని శుబ్రం చేయాలి : శాసనపు బండ భూమిలో కూరుకుపోయి వుంటే వెలుపలికి తీయడం, చెట్లు కంపలో ఇరుక్కుని వుంటే వాటిని జాగ్రత్తగా తొలగించడం చేయాలి. ఆ తర్వాత శాసనం పైన వున్న దుమ్ముదూళీ ఇసుక రేణువులను శుభ్రంగా బ్రష్ తో మొదట తుడిచేయ్యాలి. ఇనుప బ్రష్ లాంటి బలమైన బ్రష్ లు వాడకూడదు దానివల్ల అక్షరాలు చెరిగిపోయే అవకాశం వుంది. జాగ్రత్తగా చూడాలి. అ తర్వాత నీళ్ళతో ఉపరితలాన్ని శుభ్రంగా కడిగి స్పాంజిలాంటిదానితో మురికి వదిలేలా తుడిచేయాలి.
  2. తడి కాగితాన్ని ఉపరితలం పై అంటించాలి : మనం అచ్చుతీసుకోడానికి మాప్లితో 24 మిమి లాంటి కాగితాలు మంచిగా ఉపయోగపడతాయి. నిజానికి ఈ ప్రాసెస్ లో చిరిగిపోకుండా గట్టిగా వుండే రకం కాగితం అవసరం అన్నమాట. నీళ్ళలో తడపడం వల్ల అక్షరాల గుంటల్లోకి సులభంగా వంగి లోపటికి వెల్లగలుగుతుంది. దానిపైన బ్రష్ తో తట్టుకుంటూ గుంతల్లో పంపేటప్పుడు చిరిగిపోయి ముక్కలవకుండా వుండేంత గట్టిగా వుండాలి. ఒకవేళ శాసనం వున్నంత పెద్ద పరిమాణంలో పేపర్ దొరకక పోతే వేర్వేరు ముక్కలను నంబర్లు వేసుకుంటూ ఒక క్రమంలో ఆ తర్వాత కలుపుకోవచ్చు.
  3. తడికాగితాన్ని అక్షరాల్లోకి సర్ధటం : శాసనం పై అంటించిన తడి కాగితాన్ని జాగ్రత్తగా మొత్తటి బ్రష్ తో తడుతూ అక్షరాల గుంటల్లోకి వెళ్ళేలా తట్టాలి. కాగితం తడిగా మొత్తగా వున్నప్పడు మాత్రమే ఇలా తట్టడం సాధ్య అవుతుంది. మరీ వేగంగా పనికావాలని గబాగబా కొడితే కాగితం ఇలాంటప్పడు చిరిగిపోయే అవకాశం వుంది. ఎటువంటి గమ్ అంటించకుండానే తడిగా వుండటం వల్ల ఇప్పుడు కాగితం శాసనం యొక్క ఉపరితలంపై అంటుకుని వుంటుంది.
  4. రంగు అద్దటం : అక్షరాలున్న గుంతల్లోని కాగితం పైన కాకుండా మిగిలిన సమతలం పై వున్న కాగితం పైన వరకూ మాత్రమే ఇప్పడు రంగు అద్దలన్నమాట. ఆ రంగు కూడా త్వరగా ఆరేది అయ్యివుండాలి. గుంటల్లో అంటకుండా జాగ్రత్త పడాలి. దానికోసం వర్తుల ఉపరితలం వున్న డాబర్(Dabber) లు ఉపయోగపడతాయి. అంటే మనం గుడ్డతో మూటలా కడితే ఎలా తయారవుతుందో అలాంటి ఉపరితలం వుండేలా అన్నమాట. ఇంక తయారీ గతంలో పెద్ద ప్రహసనం లా వుండేది. ల్యాంబ్ బ్లాక్ పౌడర్ పావుకిలో పాకెట్ [ lamb black powder one packet (250gm)], తీసుకుంటే దానిలో 50 యం.ఎల్ కామెల్ ఇంక్ బాటిల్స్ నాలుగు [camel ink black 4 small bottle (50ml)], అరబిక్ జిగురు ఒక 100 యం.ఎల్ [Arabic gum 100ml] వీటన్నింటికి కొంచెం నీళ్ళువేసిన ఒక ప్లాస్టిక్ పాత్రలో కలుపుకుంటే రంగు సిద్దం అయినట్లే. అయితే ఇది గాలితడిలితే త్వరగా ఆరిపోతూ వుంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్ లో జాగ్రత్తగా దాచిపెట్టుకోవలసి వుంటుంది. మరో పద్దతి కోర్స్ డూప్లికేటింగ్ ఇంక్ 200యం ఎల్ ట్యూబ్ (Kores Duplicating Ink 200ml) 58 రూపాయిల్లో మార్కెట్ లో దొరుకుతుంది. వీటిలో ఏ రంగు కానీ లేదా రబ్బర్ స్టాంప్ ల కోసం వాడే ఇంక్ ప్యాడ్ లోని ఇంక్ లాంటిదైనా కానీ డాబర్ ల మీద ముద్దలు ముద్దలుగా ఏర్పడకుండా సమానంగా సర్దుకోవాలి. ఒకవేళ అలా తరకలుగా ముద్దలుగా ఇంక్ అంటుకుని వుంటే అక్షరాల గుంతల్లో అది చేరే ప్రమాదం వుంది. అట్లా సమానంగా డాబర్ మీద సర్దుకున్న తర్వాత దాన్ని పేపర్ పై తట్టి నట్లు కొట్టకుండా సమతలంపై అంటుకునేలా నెమ్మదిగా అద్దాలి. అంటే అక్షరాలు లేని మిగిలిన సమతలం మొత్తం మీద ఇంక్ అంటేలా పూర్తిగా అంటించాలి. ఉపరితలం సైజును బట్టి డాబర్ సైజుని కూడా ఎంచుకోవాలి.
  5. ఆరేంత వరకూ ఆగండి : ఇలా ఇంక్ రాసిన తర్వాత అక్షరాలు విడిగా కాగితం రంగులో తెల్లగానూ మిగిలిన భాగం మనం అంటించిన నల్లటి రంగులోకి మారుతుంది. దాంతో అక్షరాలు చదివేందుకు అనుకూలంగా కనిపిస్తుంటాయి. వీలయితే ఇలాంటప్పుడు డిజిటల్ ఫోటోలుగా తీసుకోవచ్చు. తడికాగితాన్ని ఉపరితలం నుంచి లాగేస్తే అది చిరిగిపోయే అవకాశం వుంది. ఆరని ఇంకు మిగిలిన చోట అంటుకోవచ్చు. కాబట్టి కాగితం ఆరేంత వరకూ కొంత సమయం ఆగి తర్వాత జాగ్రత్తగా నెమ్మదిగా ఉపరితలం నుంచి తొలగించి వేరే చోట పూర్తిగా ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని బైండింగ్ క్లాత్ మీద కానీ శాసనం లైఫ్ సైజు లోని కార్డ్ బోర్డు షీటు మీద కానీ అంటించ వచ్చు.

ఇలా అచ్చు తీసుకోవడానికి రోజుల తరబడి శిక్షణలో వేలాది రూపాయిల పరికరాలో అక్కర్లేదు. కేవలం కొద్ది మాత్రం నైపుణ్యం, కొన్ని పరికరాలతో ఇలా అచ్చు తీసుకోవచ్చు.

నాగస్థంభ శిలాశాసనం

రకాలు

శాసనాలు స్థూలంగా రెండురకాలుగా విభజించవచ్చు. అవి లోహ శాసనాలు (లౌహికములు), శిలా శాసనాలు (శైలికములు).

లోహ శాసనాలు

అశోకుని శాసనం (238 క్రీ.పూ.), బ్రాహ్మీ లిపిలో, ప్రస్తుతం "బ్రిటిష్ మ్యూజియం"లో ఉంది.

లోహశాసనాలకే లౌహికములని మరో పేరు. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాల కన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ, చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహశాలనాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ శాసనాలను ప్రజలు ఏవో యంత్రాలను, మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిలో వ్రాసి వున్నాయని భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రావట్లేదు. పలువురు వీటిని నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యమిందులో వ్రాసివుందని భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకునే మూర్ఖత వల్ల ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్రశాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రిక సమాచారం నశించిపోయింది[1]

గ్రీకు భాష, అరామిక్ భాషలో (ద్విభాషా) శాసనం. అశోకుని కాలంనాటిది, కాంధహార్ వద్ద లభించింది. ప్రస్తుతం కాబూల్ మ్యూజియంలో గలదు.

ఇవీ చూడండి

కాకతీయుల తామ్ర శాసనాలు

ప్రాచీన మధ్య యుగపు వంశాల విషయంలో లాగానే కాకతీయుల చరిత్ర కూడా ముఖ్యంగా శాసనాలపైననే ఆధారపడి ఉంది. వాటిలో శిలాశాసనాలు కాక ఈ తామ్రశాసనాలు కూడా ముఖ్యమైనవే. ఇప్పటివరకూ పదమూడు తామ్రశాసనాలు వెలుగులోకి వచ్చాయి

తామ్రపత్రంసంవత్సరంవిషయంసూచిక
దానార్ణవుని మాంగల్లు దాన శాసనం956కాకత్య గుండ్యన కోరిక మేరకు తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడు ఓ బ్రాహ్మణుడికి మాంగల్లు గ్రామాన్ని దానం చేసిన విషయాన్ని తెలుపుతుందిEA.I pp 57 ff
గణపతిదేవుని మొగలుట్ల దానశాసనం1219రాజు కూతురు కోట గణపాంబ వేసిన శాసనం మొగలుట్ల గ్రామాన్ని ఓ బ్రాహ్మణుడికి దానం చేయడాన్ని ఇందులో పేర్కొన్నారు.EA.IV pp 93 ff
గణపతిదేవుని కోలవెన్ను దానశాసనం1250గణపతి దేవుడు ప్రథమ శాఖకు చెందిన కొంతమంది బ్రాహ్మణులకు కోలవెన్ను గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని తెలియపరుస్తుందిభారతి తెలుగు మాస పత్రిక జూన్ 1960
గణపతిదేవుని కరీంనగర్ తామ్రశాసనం1254ఓ కాలువను గూర్చిన వివాదంలో రాజు తీర్పును నమోదు చేసింది1AP Kn.Appendix
చక్రనారాయణ అనే శార్ఞధరుని శార్ఞపుర దానశాసనం1254-55కాకతి గణపతిదేవుని సామంతుడు శారజ్ఞధరుడు బ్రాహ్మణులకు శారజ్ఞధర పురాన్ని దానమిచ్చిన విషయం ప్రస్తావితంNDI.C.P No.17
గణపతిదేవుని గారవ పాడు తామ్రపత్రాలు1260బ్రాహ్మణులకు గారవపాడు గ్రామాన్ని దానంగా ఇవ్వడాన్ని తెలుపుతుంది.EI XVIII pp 34 ff
దాడిగన్నయ చింతలూరు దానశాసనం1264జైతుగి తన కూతుర్ని (సోమల దేవిని) గణపతిదేవునికిచ్చి వివాహం చేయటాన్ని తెలుపుతుందిNot Published
రుద్రమదేవి కాలపు ఆలపాడు దాన శాసనం1264రాణి అల్లుడు, యాదవ వంశానికి చెందిన ఎల్లణ దేవుడు ఆలపాడు గ్రామాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చిన విషయం పేర్కొంటుందిC.P. Ins of Hyd. Mus Vol.I, pp. 109 ff
రుద్రమదేవి సామంతుడి కోటగిరి దానశాసనం1273రాణి సామంతుడు - విరియాల సూరుడు వినాయకపురం గ్రామన్ని కొంతమంది బ్రాహ్మణులకు దానమిచ్చిన విషయాన్ని తెలియజేస్తుందిCorpus III p. 114 ff
ప్రతాపరుద్రుడి ఉత్తరేశ్వర దానశాసనం1290మంత్రి చాళుక్య ఇందుశేఖరుడు ఉత్తరేశ్వరగ్రామాన్ని విద్దనాచార్య బ్రాహ్మణునికి దానమివ్వడం గురించిE1 XXXVIII pp. 57 ff
దాయగజకేసరిగా ప్రతాపరుద్రుడి ఖండవల్లి దానశాసనం 11289మంత్రి అన్నల దేవుడు కొంత భూమిని విద్దనాచార్యడికి దానమివ్వటాన్ని నమోదు చేసిందిEA IV pp 103ff
దాయగజకేసరిగా ప్రతాపరుద్రుడి ఖండవల్లి దానశాసనం 21292చాళుక్య ఇందుశేఖరుడు ఓనపల్లి గ్రామాన్నివిద్దనాచార్యులకు దానమివ్వడాన్ని పేర్కొంటుందిEA IV pp 103ff
ప్రతాప రుద్రుడి సేనాని రాజరుద్రుడి గోరవంకపల్లి దాన శాసనం1293సామంతుడు, చెరకు వంశపువాడైన రాజరుద్రుడు గోరవంకపల్లి గ్రామాన్ని కొంతమంది బ్రాహ్మణులకు దానమిచ్చిన విషయంC.P.Ins of Hyd Mns. Vol 1 pp 98 ff
ప్రతాప రుద్రుని (నకిలీ) దానపత్రం855 విజయకాకతి రాజవంశజుడు మహాదేవుని కుమారుడిగా ప్రతాపరుద్రుడుని పేర్కొంది. ఒక బ్రాహ్మణుడికి అనంతపురం గ్రామాన్ని దానమిచ్చిన విషయం దీనిలో వుందిEC. XII Tumkur, 14

కాకతీయుల శిలా శాసనాల పట్టిక

జిల్లాతాలూకాగ్రామంశాసనంలోని విషయం
ఆదిలాబాద్చెన్నూరుకుందవరం
చింగ్లేపుట్ (తమిళనాడు)చింగ్లేపుట్కంజీవరం
కడపకమలాపురంగంగవరం
కడపప్రొద్దుటూరుఉప్పరపల్లి
కడపరాజంపేటపొందలూరు
కడపరాజంపేటనందలూరు
కడపరాజంపేటటంగుటూరు
కడపసిద్దవరంకాండువాయి
తూర్పు గోదావరిరామచంద్రాపురంద్రాక్షారామం
గయ (బీహార్)గయగయ
గుంటూరుబాపట్లఇడుపులపాడు
గుంటూరుబాపట్లమోటుపల్లి
గుంటూరుబాపట్లనాయని పల్లి
గుంటూరుబాపట్లపెదగంజాం
గుంటూరుబాపట్లపెద్ద చెరుకూరు
గుంటూరుబాపట్లసంతరావూరు
గుంటూరుబాపట్లస్వర్ణ
తెలియదుతెలియదుఆళ్ళపాడు
గుంటూరుబాపట్లచేబ్రోలు
గుంటూరుబాపట్లగోరవెంక పల్లి
గుంటూరుబాపట్లఇప్పాటం
గుంటూరుబాపట్లఖాజా
గుంటూరుబాపట్లలామ్
గుంటూరుబాపట్లమల్కాపురం
గుంటూరుబాపట్లపెనుమాక
గుంటూరుబాపట్లపెనుములి
గుంటూరుబాపట్లరాయపూడి
గుంటూరుబాపట్లతడికొండ
గుంటూరుబాపట్లవడ్డేశ్వరం
గుంటూరుబాపట్లయనమదల
గుంటూరుమార్కాపురంత్రిపురాంతకం
గుంటూరునర్సారావుపేటబొప్పూడి
గుంటూరునర్సారావుపేటఎడవల్లి
గుంటూరునర్సారావుపేటజొన్నలగడ్డ
గుంటూరునర్సారావుపేటకాకాని
గుంటూరునర్సారావుపేటకనుపర్రు
గుంటూరునర్సారావుపేటకొనిదెన
గుంటూరునర్సారావుపేటకొప్పారం
గుంటూరునర్సారావుపేటకుంకల గుంట
గుంటూరునర్సారావుపేటమునుమాక
గుంటూరునర్సారావుపేటమురికిపూడి
గుంటూరునర్సారావుపేటనర్పారావుపేట
గుంటూరునర్సారావుపేటపురుషోత్తమ పట్టణం
గుంటూరునర్సారావుపేటరావిపాడు
గుంటూరునర్సారావుపేటరొంపిచర్ల
గుంటూరునర్సారావుపేటసంతమాగులూరు
గుంటూరునర్సారావుపేటఉప్పుమాగులూరు
గుంటూరుపల్నాడుదుర్గి
గుంటూరుపల్నాడుజూలకల్లు
గుంటూరుపల్నాడుకారెంపూడి
గుంటూరుపల్నాడుమాచర్ల
గుంటూరుపల్నాడుపిడుగురాళ్ళ
గుంటూరుపల్నాడుపిన్నాలి
గుంటూరుపల్నాడుతంగేడ
గుంటూరుపల్నాడుతేరాల
గుంటూరుపల్నాడుఒప్పిశేర్ల
గుంటూరురేపల్లెఖండవ్రోలు
గుంటూరుసత్తెన పల్లిఅమరావతి
గుంటూరుసత్తెన పల్లిచింతపల్లి
గుంటూరుసత్తెన పల్లిగుడిపూడి
గుంటూరుసత్తెన పల్లిపాపాయపాలెం
గుంటూరుసత్తెన పల్లివేల్పూరు
గుంటూరుతెనాలిసిలుమూరు
గుంటూరుతెనాలిదుగ్గిరాల
గుంటూరుతెనాలిఈమాని
గుంటూరుతెనాలికోలకాలూరు
గుంటూరుతెనాలికొల్లూరు
గుంటూరుతెనాలిమూల్పూరు
గుంటూరుతెనాలిపెదకొండూరు
గుంటూరువినుకొండఇనుమెల్ల
గుంటూరువినుకొండఇప్పూరు
కరీంనగర్హుజూరాబాద్కట్టంగూర్
కరీంనగర్హుజూరాబాద్గొడిశాల
కరీంనగర్జగిత్యాలధర్మపురి
కరీంనగర్కరీంనగర్హస్నాబాద్
కరీంనగర్కరీంనగర్కరీంనగర్
కరీంనగర్కరీంనగర్మంతెన
కరీంనగర్కరీంనగర్నగునూరు
కరీంనగర్కరీంనగర్రేగొండ
కరీంనగర్కరీంనగర్శనిగ్రామ
కరీంనగర్మంథనికమ్మపల్లి
కరీంనగర్మంథనికాళేశ్వరం
కరీంనగర్మెట్ పల్లిచిత్తాపూర్
కరీంనగర్పెద్దపల్లిమయాదారం
కరీంనగర్పెద్దపల్లిసుండెల్ల
కరీంనగర్పెద్దపల్లియెల్గేడు
ఖమ్మం జిల్లాఖమ్మంచిన కందుకూరు
ఖమ్మం జిల్లాఖమ్మంకటుకూరు
ఖమ్మం జిల్లాఖమ్మంకూసుమంచికూసుమంచి గణపేశ్వరాలయం దాన శాసనం
ఖమ్మం జిల్లాఖమ్మంమాటేరు
ఖమ్మం జిల్లాఖమ్మంపమ్మి
ఖమ్మం జిల్లామధిరచిన కందుకూరు
ఖమ్మం జిల్లాఇల్లందుకోటగడ్డ
కృష్ణాజిల్లాబందరుమల్లవోలు
కృష్ణాజిల్లాదివిగణపేశ్వరం
కృష్ణాజిల్లాదివిశ్రీకాకుళం
కృష్ణాజిల్లాగుడివాడమండపాడు
కృష్ణాజిల్లామచిలీ పట్నంపెద్దకళ్ళేపల్లి
కృష్ణాజిల్లానందిగామగుడిమెట్ట
కృష్ణాజిల్లానందిగామకంకాల
కృష్ణాజిల్లానందిగామకొక్కిరేణి
కృష్ణాజిల్లానందిగామమాగల్లు
కృష్ణాజిల్లానందిగామనడిగూడెం
కృష్ణాజిల్లానందిగామతాడువాయి
కృష్ణాజిల్లావిజయవాడకోలవెన్ను
కృష్ణాజిల్లావిజయవాడవిజయవాడ
కర్నూలునందికొట్కూరుశ్రీశైలం
కర్నూలునంద్యాలపానెం
తెలియదుతెలియదుగరవపాడు
మహబూబ్ నగర్అలంపూర్అలంపూర్
మహబూబ్ నగర్మహబూబ్ నగర్వర్ధమానపురం
మహబూబ్ నగర్మహబూబ్ నగర్బోద్ పూర్
మహబూబ్ నగర్మహబూబ్ నగర్మక్తల్
మహబూబ్ నగర్మహబూబ్ నగర్పామాపురం
మహబూబ్ నగర్మహబూబ్ నగర్ఉమామహేశ్వరం
మహబూబ్ నగర్నాగర్ కర్నూలువర్ధమానపురం
మెదక్గజ్వేల్ఇటిక్యాల
మెదక్గజ్వేల్మునిగడప
మెదక్హుజూర్ నగర్పాలకవీడు
మెదక్మెదక్మన్నూరు
మెదక్మెదక్టేక్ మాల్
మెదక్రామయ్యపేటవెంకటాపూర్
మెదక్సంగారెడ్డిఎల్మెల
మెదక్సిద్దిపేటదుద్దెడ
మెదక్సిద్దిపేటకొండపాక
మెదక్సిద్దిపేటపుల్లూరు
నల్గొండ జిల్లాభువన గిరిబొల్లెపాలెం
నల్గొండ జిల్లాభువన గిరికొలనుపాక
నల్గొండ జిల్లాభువన గిరిమాసాపేట
నల్గొండ జిల్లాదేవరకొండబొల్లారం
నల్గొండ జిల్లాదేవరకొండఏలేశ్వరం
నల్గొండ జిల్లాదేవరకొండకందుకూరు
నల్గొండ జిల్లాదేవరకొండపెద్దమునగాల
నల్గొండ జిల్లాదేవరకొండరంగారెడ్డి గూడెం
నల్గొండ జిల్లాదేవరకొండసారంపేట
నల్గొండ జిల్లాదేవరకొండఊట్లపల్లి
నల్గొండ జిల్లాదేవరకొండఏలేశ్వరం
నల్గొండ జిల్లాహుజూర్ నగర్బూరుగు గడ్డ
నల్గొండ జిల్లాహుజూర్ నగర్సిలుకూరు
నల్గొండ జిల్లాహుజూర్ నగర్గణపవరం
నల్గొండ జిల్లాహుజూర్ నగర్మట్టంపల్లి
నల్గొండ జిల్లాహుజూర్ నగర్మేళ్ళచెర్వు
నల్గొండ జిల్లాహుజూర్ నగర్సోమవరం
నల్గొండ జిల్లాహుజూర్ నగర్తొగరాయి
నల్గొండ జిల్లామిరియాల గూడఆగమోతుకూరు
నల్గొండ జిల్లామిరియాల గూడఆలుగడప
నల్గొండ జిల్లామిరియాల గూడఇంకిర్యాల
నల్గొండ జిల్లామిరియాల గూడమాటూరు
నల్గొండ జిల్లామిరియాల గూడరాజసావరం
నల్గొండ జిల్లామిరియాల గూడవాడపల్లి
నల్గొండ జిల్లానల్గొండఆలుగడప
నల్గొండ జిల్లానల్గొండఅన్నారెడ్డిగూడెం
నల్గొండ జిల్లానల్గొండకందుపట్ల
నల్గొండ జిల్లానల్గొండసీకటి మిద్ది
నల్గొండ జిల్లానల్గొండగణపవరం
నల్గొండ జిల్లానల్గొండకొలనుపాక
నల్గొండ జిల్లానల్గొండకొత్తపల్లి
నల్గొండ జిల్లానల్గొండపానుగల్
నల్గొండ జిల్లానల్గొండపానుగల్లు
నల్గొండ జిల్లానల్గొండపేరూరు
నల్గొండ జిల్లానల్గొండసర్వేల్
నల్గొండ జిల్లానల్గొండఏలేశ్వరం
నల్గొండ జిల్లారామన్నపేటచిట్యాల
నల్గొండ జిల్లారామన్నపేటదుప్పల్లి
నల్గొండ జిల్లారామన్నపేటకూరెళ్ళ
నల్గొండ జిల్లారామన్నపేటతుమ్మలగూడెం
నల్గొండ జిల్లాసూర్యాపేటజలాల్ పూర్
నల్గొండ జిల్లాసూర్యాపేటకూసుమంచి
నల్గొండ జిల్లాసూర్యాపేటమామిళ్ళగూడ
నల్గొండ జిల్లాసూర్యాపేటనాగులపాడు
నల్గొండ జిల్లాసూర్యాపేటనగులపాడు
నల్గొండ జిల్లాసూర్యాపేటపాతర్లపాడు
నల్గొండ జిల్లాసూర్యాపేటపిల్లల మర్రి
నెల్లూరు జిల్లాదర్శిఅలువాల పాడు
నెల్లూరు జిల్లాదర్శిభీమవరం
నెల్లూరు జిల్లాదర్శిదర్శి
నెల్లూరు జిల్లాదర్శిగంగవరం
నెల్లూరు జిల్లాదర్శికొక్కర్లకోట
నెల్లూరు జిల్లాదర్శిపొట్లపాడు
నెల్లూరు జిల్లాదర్శిసార్నగాపురం
నెల్లూరు జిల్లాదర్శితాళ్ళూరు
నెల్లూరు జిల్లాదర్శితమ్మలూరు
నెల్లూరు జిల్లాకందుకూరుభీమవరం
నెల్లూరు జిల్లాకందుకూరుగుడ్లూరు
నెల్లూరు జిల్లాకందుకూరుకందుకూరు
నెల్లూరు జిల్లాకందుకూరుపాకాల
నెల్లూరు జిల్లాకందుకూరువేంపాడు
నెల్లూరు జిల్లాకావలికాట్రయపాడు
నెల్లూరు జిల్లానెల్లూరునెల్లూరు
నెల్లూరు జిల్లాపొడ్లిసిమట
నెల్లూరు జిల్లాదొంగలూరు
నిజామాబాద్ జిల్లాబోధన్బిక్కోలు
నిజామాబాద్ జిల్లాకామారెడ్డిబందరామేశ్వర పల్లి
ప్రకాశం జిల్లాగిద్దలూరుసలకలవీడు
ప్రకాశం జిల్లామార్కాపురంత్రిపురాంతకం
ప్రకాశం జిల్లాఒంగోలుఆల్లూరు
ప్రకాశం జిల్లాఒంగోలుబొల్లవరప్పాడు
ప్రకాశం జిల్లాఒంగోలుగొనసపూడి
ప్రకాశం జిల్లాఒంగోలుఈడమూడి
ప్రకాశం జిల్లాఒంగోలుకండ్లగుంట
ప్రకాశం జిల్లాఒంగోలుకరవడి
ప్రకాశం జిల్లాఒంగోలుమడ్డిపాడు
ప్రకాశం జిల్లాఒంగోలునాగులప్పలపాడు
ప్రకాశం జిల్లాఒంగోలునిడమానూరు
ప్రకాశం జిల్లాఒంగోలురావినూతల
ప్రకాశం జిల్లాఒంగోలుఉప్పుగుండూరు
ప్రకాశం జిల్లాఒంగోలువలపర్ల
ప్రకాశం జిల్లాఒంగోలుఎండ్లూరు
తిరుచిరాపల్లి (తమిళనాడు)తిరుచిరాపల్లిశ్రీరంగం
వరంగల్ జిల్లాజనగామఆకునూరు
వరంగల్ జిల్లాజనగామకుందవరం
వరంగల్ జిల్లాజనగామనిడిగొండ
వరంగల్ జిల్లామహబూబాబాద్ఇనుగుర్తి
వరంగల్ జిల్లామహబూబాబాద్మహబూబాబాద్
వరంగల్ జిల్లామహబూబాబాద్మాటేడు
వరంగల్ జిల్లామహబూబాబాద్రాజులకోటపల్లి
వరంగల్ జిల్లామహబూబ్ నగర్మహబూబాబాద్
వరంగల్ జిల్లామహబూబ్ నగర్మాటేడు
వరంగల్ జిల్లాములుగుచిట్యాలపాడు
వరంగల్ జిల్లాములుగుమాకాపురం
వరంగల్ జిల్లాములుగుపాలమీట
వరంగల్ జిల్లానర్సంపేటడిక్కకుంట
వరంగల్ జిల్లానర్సంపేటగుండాల
వరంగల్ జిల్లానర్సారావుపేటబనాజీపేట
వరంగల్ జిల్లానర్సారావుపేటడిక్కకుంట
వరంగల్ జిల్లానర్సారావుపేటపాకాల్
వరంగల్ జిల్లానర్సారావుపేటరామకృష్ణాపురం
వరంగల్ జిల్లానర్సారావుపేటరాంపూర్
వరంగల్ జిల్లావరంగల్అనుమకొండ
వరంగల్ జిల్లావరంగల్బెక్కలూరు
వరంగల్ జిల్లావరంగల్ధర్మాసాగర్
వరంగల్ జిల్లావరంగల్గార్ల
వరంగల్ జిల్లావరంగల్గిజ్మాజీపేట
వరంగల్ జిల్లావరంగల్అనుమకొండ
వరంగల్ జిల్లావరంగల్ఖాజీపేట
వరంగల్ జిల్లావరంగల్కొలనుపల్లి
వరంగల్ జిల్లావరంగల్కొండపర్తి
వరంగల్ జిల్లావరంగల్కుమారుపల్లి
వరంగల్ జిల్లావరంగల్మట్టెవాడ
వరంగల్ జిల్లావరంగల్ముప్పువరం
వరంగల్ జిల్లావరంగల్వర్ధమానపురం
వరంగల్ జిల్లావరంగల్వరంగల్
వరంగల్ జిల్లావరంగల్ఎలకుర్తి
వరంగల్ జిల్లామహబూబాబాదుగుడితండాగణపతిదేవుని
పశ్చిమగోదావరి జిల్లాతణుకుజుట్టిగ
పశ్చిమగోదావరి జిల్లాతణుకుకందవల్లి
పశ్చిమగోదావరి జిల్లాతణుకుఉత్తరేశ్వర

మూలాలు

వెలుపలి లంకెలు