సిక్కు పండుగల జాబితా

10మంది సిక్కు గురువుల ఆదేశానుసారం సిక్కులు పండుగలు జరుపుకుంటుంటారు. వైశాఖిదీపావళి వంటి హిందూ  పండుగలు  కూడా జరుపుకుంటారు సిక్కులు. 

సిక్కు పండుగలు

వేరే సిక్కు పండుగలు

పైన జాబితాలో లేని కొన్ని ఇతర పండుగలు కూడా సిక్కులకు ఉన్నాయి. దాదాపుగా 45 ఇతర చిన్న పండుగలు కూడా ఉంటాయి సిక్కులకు. వీటిని చాలా వరకు కొన్ని చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో జరుపుకుంటారు. 8 సిక్కు గురువుల జన్మదినోత్సవాలు ప్రకాశ్ ఉత్సవ్ లుగా, గురుత్వ బాధ్యతల తరలింపు దినోత్సవాలను గుర్గడి దివస్ లుగా, సిక్కు గురువుల నిర్వాణ దినాలను జ్యోతిజోత్ దివస్ లుగా నిర్వహించుకుంటారు సిక్కులు. శ్రీ గురు హరిగోబింద్ జీ పుట్టిన  వడాలీ గ్రామంలోని చెహర్తా సాహిబ్ గురుద్వారా మందిరంలో బసంత్ పండుగ చేసుకుంటారు. ఇది పతంగుల పండుగ. ఈ ప్రదేశంలో గురూజీ జన్మదినం వంటి పండుగలు కూడా చేసుకుంటారు.[4] అన్ని పండుగలకూ సిక్కులు గురుద్వారకు వెళ్ళి, గురుగ్రంథ సాహిబ్ పఠనం, గుర్బానీ, కీర్తనలు పాత్ లు పాడుతూ గడుపుతుంటారు.

కొన్ని చారిత్రిక పండుగలు, జాతరలు కూడా జరుపుకుంటారు. ఈ జాతరలకు వేలాదిగా జనం వస్తుంటారు. ఇవి దాదాపుగా 2 నుంచి 3 రోజులు జరుగుతుంటాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి:

  • ఫతేగర్ సాహిబ్ ప్రాంతంలో గురుగోబింద్ సింగ్ యొక్క చిన్న సహిబ్జదాల నిర్వాణానికి సూచనగా వారి పేరు మీద జాతర.
  • చంకుర్ యుద్ధంలో గురుగోబింద్ సింగ్ యొక్క పెద్ద సహిబ్జదాల వీరమరణానికి సూచనగా ఆ ప్రాంతంలో నిర్వహిస్తారు.
  • ముక్త్ సర్ లో మొఘల్ రాజులతో చేసిన యుద్ధంలో వీరమరణం పొందిన గురుగోబింద్ సింగ్ యొక్క 40 మంది అనుచరుల సంస్మరణగా శ్రీ ముక్త్ సర్ సాహిబ్ పట్టణంలో ఉత్సవం జరుపుకుంటారు సిక్కులు.

References