సౌర ఘటం

సౌర ఘటం లేదా ఫోటోవోల్టాయిక్ ఘటం అంటే భౌతిక, రసాయనిక ధర్మమైన ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ ఆధారంగా కాంతి నుంచి నేరుగా విద్యుత్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ ఉపకరణం.[1] ఇది ఒక రకమైన ఫోటోఎలక్ట్రిక్ ఘటం. వీటిలో విద్యుత్ ప్రవాహం, వోల్టేజి, విద్యున్నిరోధం లాంటి గుణగణాలు కాంతి వాటిమీద పడ్డప్పుడు మార్పు చెందుతాయి. కొన్ని సౌరఘటాలను కలిపి సౌర ఫలకాలను (సోలార్ ప్యానెల్స్) తయారు చేస్తారు. ఒక సాధారణ సిలికాన్ సౌర ఘటం గరిష్టంగా సుమారు 0.5 నుంచి 0.6 వోల్టుల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదు.[2]

సాంప్రదాయిక క్రిస్టలీన్ సిలికాన్ సౌరఘటం.

మూలాలు