స్ఫటికం

స్ఫటికం (Crystal) అంటే దానిలోని భాగాలు (అంటే పరమాణువులు, అణువులు, అయాన్లు) ఒక క్రమమైన ఆకృతిలో అమర్చబడిన ఘన పదార్థం. ఈ స్ఫటికాకృతి అన్ని దిశల్లో విస్తరిస్తుంది.[1][2] స్ఫటికాలను, వాటి నిర్మాణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్ఫటిక శాస్త్రం (క్రిస్టలోగ్రఫీ) అంటారు.

అమెథిస్ట్ క్వార్ట్జ్ స్ఫటికాలు

మంచుగడ్డలు, వజ్రాలు, ఉప్పు మొదలైనవి స్ఫటికాలను ఉదాహరణలు. చాలావరకు అకర్బన ఘనపదార్థాలు స్ఫటికాలు కాకుండా బహుళ స్ఫటికాలుగా (Poly crystals) ఉంటాయి. అంటే అనేక స్ఫటికాలు కలిసి ఘన పదార్థంగా ఏర్పడతాయి. చాలా వరకు లోహాలు, రాళ్ళు, పింగాణి మొదలైనవి బహుళ స్ఫటికాలు. ఘనపదార్థాల్లో మూడో రకం నిరాకారమైన ఘనపదార్థాలు (Amorphous solids). వీటిలో పరమాణువుల అమరిక ఒక క్రమంలో ఉండదు. వీటికి ఉదాహరణలు గాజు, మైనం, చాలా వరకు ప్లాస్టిక్లు.

స్ఫటికాలను, విలువైన రాళ్ళను కొన్ని అశాస్త్రీయమైన చికిత్సలలో వాడుతుంటారు.[3][4]

స్ఫటిక నిర్మాణం

స్ఫటికం శాస్త్రీయమైన నిర్వచనం అందులో ఉన్న పరమాణుల అమరికను బట్టి నిర్వచించారు. ఏదైనా ఘన పదార్థంలో పరమాణువులు ఆవర్తన పద్ధతిలో అమర్చబడిఉంటే అది స్ఫటికం అవుతుంది. అన్ని ఘన పదార్థాలు స్ఫటికాలు కావు. ఉదాహరణకు నీరు ఘనీభవించినపుడు దశ మారే సమయంలో చిన్న స్ఫటికాలుగా ఏర్పడి ఆ తర్వాత అవి ఒకదానితో ఒకటి కలిసి బహుళ స్ఫటికాకృతిని ఏర్పరుస్తాయి. చివరగా ఏర్పడే మంచుముద్ద లో భాగమైన చిన్న ముక్కల్లో పరమాణువుల సౌష్టవ అమరిక ఉంటుంది కానీ మంచుముద్ద మొత్తానికీ ఈ గుణం ఉండదు.

క్రిస్టలోగ్రఫీలో స్ఫటికాల పరమాణువుల అమరికను అధ్యయనం చేస్తారు.


మూలాలు