స్వర్గం

అయోమయ నివృత్తికి చూడండి స్వర్గం (సినిమా)

స్వర్గం ఒక నమ్మకం. స్వర్గం గురించి అనేక మూలాల నుండి వివిధ రకాల నమ్మకాలు ఉన్నా, సాధారణంగా స్వర్గాన్ని విశ్వసించేవారి యొక్క నమ్మకాలు ఆ వ్యక్తి ఏ మతసంప్రదాయానికి లేదా తెగకు చెందినవాడు అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మతాలు మరణం తర్వాత ఆత్మలు అమరత్వంతో ప్రశాంత జీవనం గడిపే ఒక ప్రదేశంగా స్వర్గాన్ని సూచిస్తాయి. సాధారణంగా స్వర్గం అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశంగా భావిస్తారు. మంచి పనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు. చెడ్డ పనులు చేసిన వాళ్ళు నరకంకు వెళతారు.

హిందువుల స్వర్గం

దేవతలుతో పాటు నివాసం. అమృతం దొరుకుతుంది. రంభ ఊర్వశి మేనక తిలోత్తమ లాంటి దేవకన్యలు స్వర్గలోక వాసుల్ని ఆనందపరుస్తారు. ఈ స్వర్గ లోకానికి అధిపతి ఇంద్రుడు.

యూదా క్రైస్తవుల స్వర్గం

స్వర్గార్హత పొందిన భక్తులు ఆడా మగా తేడా లేకుండా దేవదూతల్లాగా మారిపోతారు.అందమైన దేవకన్యలెవరూ దొరకరు. జీవనది నీళ్ళు త్రాగి జీవవృక్ష ఫలాలు తింటారు.దేవుడే నిత్యం దర్శనమిస్తూ ఉంటాడు.నిరంతరం దైవారాధనే. బైబిల్ ప్ర్రకారం స్వర్గం భూమికి ఎంతో దూరంలో లేదు. దేవదూతలు తరుచుగా భూమికి వచ్చిపోయే వారు.

ముస్లిముల స్వర్గం

స్వర్గార్హత పొందిన భక్తులకు చల్లనితోటల్లో విడిది . సెలయేళ్ల నీళ్ళు.శొంఠికలిపిన ద్రాక్షారసం అందించే అందమైన దేవకన్యలు.

స్వర్గంపై విమర్శలు

నాస్తికులు స్వర్గం యొక్క ఉనికిని ప్రశ్నిస్తారు. కొంతమంది నాస్తికులు స్వర్గం అనే భావన మంద మత్తుమందు (ఓపియేట్ ఆఫ్ ది మాసెస్) - మనుషులు జీవితంలోని యాతనను మరిచిపోవటానికి ఉపయోగించే సాధనం లేదా అధికారంలో ఉన్నవారు మరణం తర్వాత తాయిలంలా చూపించి ప్రజలను ఒక జీవనవిధానానికి బానిసలుగా మార్చటానికి ఉపయోగించే సాధనం అని భావిస్తారు.[1] అనార్కిస్ట్ ఎమ్మా గోల్డ్‌మన్ స్వర్గంపై తన భావనను వ్యక్తపరుస్తూ "అచేతనంగానో, సచేతనంగానో, చాలామంది ఆస్తికులు దేవతలు, దెయ్యాలు, స్వర్గం, నరకం, వరాలు, శాపాలు ప్రజలను అదుపులో పెట్టడానికి, సంతృప్తంగా ఉంచడానికి, సాధుస్వభావులుగా ఉంచడానికి ఉపయోగించే కొరడాగా చూస్తున్నారు." అని వ్రాసింది[2]. సిక్కు మతస్తులు దైవ విశ్వాసులులైనప్పటికీ వారు స్వర్గ నరకాలని నమ్మరు.

ఇవి కూడా చూడండి

మూలాలు