పబ్‌మెడ్

(PubMed నుండి దారిమార్పు చెందింది)

 

PubMed
Contact
పరిశోధనా కేంద్రంUnited States National Library of Medicine (NLM)
విడుదల తేదీజనవరి 1996; 28 సంవత్సరాల క్రితం (1996-01)

పబ్‌మెడ్ అనేది లైఫ్ సైన్సెస్, బయోమెడికల్ అంశాలకు సంబంధించిన ఉచిత సెర్చి ఇంజను. ఇది ప్రధానంగా రిఫరెన్స్‌లు, సారాంశాల MEDLINE డేటాబేస్‌ను యాక్సెస్ చేస్తుంది. అమెరికా లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లోని యునైటెడ్ స్టేట్స్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (NLM) ఎంట్రెజ్ సిస్టమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్‌లో భాగంగా ఈ డేటాబేసును నిర్వహిస్తుంది. [1]

1971 నుండి 1997 వరకు, MEDLINE డేటాబేస్‌ను ఆన్‌లైన్‌లో అందుకోగలిగే అనుమతి ప్రాథమికంగా విశ్వవిద్యాలయ లైబ్రరీల వంటి సంస్థాగత సౌకర్యాల వారికే ఉండేది. పబ్‌మెడ్, 1996 జనవరిలో మొదటిసారిగా విడుదలై, ప్రైవేటు వ్యక్తులకు, ఉచితంగా, ఇంటికీ, కార్యాలయానికీ -మెడ్‌లైన్ శోధన యుగానికి నాంది పలికింది. [2] 1997 జూన్ నుండి పబ్‌మెడ్ వ్యవస్థ ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. [3]

కంటెంటు

MEDLINEతో పాటు, PubMed కింది వాటిని కూడా అందిస్తుంది:

  • 1951 లోను, అంతకు ముందూ ప్రింటైన ఇండెక్స్ మెడికస్ నుండి పాత ఆకరాలు,
  • ఇండెక్స్ మెడికస్, మెడ్‌లైన్‌ లలో ఇండెక్స్ చేయడానికి ముందు కొన్ని జర్నల్‌ల ఆకరాలు, ఉదాహరణకు <i id="mwKw">సైన్స్</i>, BMJ, అన్నల్స్ ఆఫ్ సర్జరీ
  • మెడికల్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్ (MeSH)లో ఇండెక్సు కాకముందే, MEDLINEకి జోడించబడటానికి ముందే - వ్యాసాల ఇటీవలి రికార్డులు
  • పూర్తి పాఠం, NLM రికార్డుల ఇతర ఉపసమితులు అందుబాటులో ఉన్న పుస్తకాల సేకరణ [4]
  • PMC అనులేఖనాలు
  • NCBI బుక్షెల్ఫ్

పబ్‌మెడ్ ఐడెంటిఫైయర్

PMID (పబ్‌మెడ్ ఐడెంటిఫైయర్ లేదా పబ్‌మెడ్ యూనిక్ ఐడెంటిఫైయర్) [5] అనేది ఒక ప్రత్యేక పూర్ణాంక సంఖ్య. ఇది 1 నుండి మొదలై, ప్రతి పబ్‌మెడ్ రికార్డుకు ఒక సంఖ్య ఉంటుంది. పిఎమ్‌ఐడి అనేది పిఎంసిఐడి (పబ్‌మెడ్ సెంట్రల్ ఐడెంటిఫైయర్) లాంటిది కాదు. పిఎంసిఐడి ఉచితంగా యాక్సెస్ చేయగల పబ్‌మెడ్ సెంట్రల్‌లో ప్రచురించబడిన అన్ని కృఫ్తులకూ ఇచ్చిన ఐడెంటిఫైయర్. [6]

ఒక ప్రచురణకు PMID లేదా PMCIDని కేటాయించడంతో దాని కంటెంట్ రకం గురించి గాని, లేదా నాణ్యత గురించి గానీ పాఠకులకు ఏమీ చెప్పినట్లు కాదు. ఎడిటర్‌కు లేఖలు, సంపాదకీయ అభిప్రాయాలు, అభిప్రాయ వ్యాసాలు, జర్నల్‌లో చేర్చడానికి ఎడిటర్ ఎంచుకున్న ఏ ఇతర భాగానికైనా, అలాగే పీర్-రివ్యూ పేపర్‌లకూ PMIDలను కేటాయిస్తారు. ఈ గుర్తింపు సంఖ్య ఇచ్చారంటే దాని అర్థం - మోసం, అసమర్థత లేదా దుష్ప్రవర్తన కారణంగా ఆయా వ్యాసాలను ప్రచురణ నుండి వెనక్కి తోఈసుకోలేదని రుజువు చూపినట్లేమీ కాదు. ఒరిజినల్ పేపర్‌లకు ఏవైనా సవరణల గురించిన ప్రకటనకు కూడా PMID ని కేటాయించవచ్చు.

పబ్‌మెడ్ శోధన విండోలో ఇచ్చిన ప్రతి సంఖ్యనూ డిఫాల్ట్‌గా PMID లాగానే పరిగణిస్తుంది. కాబట్టి, PMIDని ఉపయోగించి PubMedలో ఏ ఆకరాన్నైనా గుర్తించవచ్చు.

మూలాలు