ఊరు పేరు భైరవకోన

ఊరు పేరు భైరవకోన 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ సినిమాకు వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్, ఆయన ఫస్ట్ లుక్, స్పెషల్ మేకింగ్ వీడియో ను 2022 మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి,[1] సినిమాలోని ‘నిజమేనే చెబుతున్నా’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను 2023 మార్చి 31న విడుదల చేశారు.[2]

ఊరు పేరు భైరవకోన
దర్శకత్వంవీఐ ఆనంద్‌
రచనవీఐ ఆనంద్‌
మాటలుభాను భోగవరపు, నందు సవిరిగాన
నిర్మాతరాజేశ్‌ దండా
తారాగణం
ఛాయాగ్రహణంరాజ్ తోట
కూర్పుఛోటా కె ప్రసాద్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
  • హాస్య మూవీస్
విడుదల తేదీ
2023 (2023)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఊరు పేరు భైరవకోన సినిమా 2023 ఫిబ్రవరి 9న విడుదలై[3], అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో మార్చి 9 నుండి నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

కథ

ఓ ఇంట్లో నగలు దొంగ‌త‌నం చేసి పోలీసుల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో బ‌స‌వ‌, అత‌డి స్నేహితుడు జాన్, మరో దొంగ అగ్రహారం గీత భైర‌వ‌కోన‌ అనే విచిత్రమైన ఊరిలో అడుగుపెడ‌తారు. ఆ ఊళ్లో అడుగుపెట్టిన వాళ్లు ఎవ‌రూ ప్రాణాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన దాఖ‌లాలు ఉండ‌వు. ఆ ఊరు నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వీలుప‌డ‌దు. ఈ నేప‌థ్యంలో వారి వ‌ద్ద ఉన్న బ్యాగును ఆ ఊరిలోని ఓ ముఠా దొంగిలిస్తారు. ఆ బ్యాగును తిరిగి తీసుకు వ‌చ్చే క్ర‌మంలో బ‌స‌వ‌కు ఎదురైన ప‌రిస్థితులు ఏమిటి? గ‌రుడ పురాణంలో మిస్స‌యిన నాలుగు పేజీల‌తో భైర‌వ‌కోన‌కు ఉన్న సంబంధం ఏమిటి? బ‌స‌వ, గీత‌, జాన్ భైర‌వ కోన నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారా? లేదా? అనేదే మిగతా సినిమా కథ.[5][6]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: హాస్య మూవీస్
  • నిర్మాత: రాజేశ్‌ దండా[7][8]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీఐ ఆనంద్‌
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
  • ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
  • ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
  • మాటలు: భాను భోగవరపు, నందు సవిరిగాన

పాటలు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నిజమే నే చెబుతున్నా[9]"శ్రీ మణిసిద్ శ్రీరామ్3:34
2."హమ్మ హమ్మా[10]"శేఖర్ చంద్ర, తిరుపతి జవానురామ్ మిరియాల3:09
3."హరోమ్హారా"చైతు సత్సంగిచైతు సత్సంగి2:27
4."కిల్ ది డెవిల్"నికేశ్ కుమార్ దశగ్రంధిశేఖర్ చంద్ర, దినేష్ రుద్ర, రితేష్ జి రావు2:05
5."ఇది బైరవకోన"చైతు సత్సంగిచైతు సత్సంగి1:46

మూలాలు