అండమాన్ సముద్రం

సముద్రం

అండమాన్ సముద్రం ఈశాన్య హిందూ మహాసముద్రంలో ఉన్న మార్జినల్ సముద్రం. ఇది మార్తాబన్ గల్ఫ్ వెంట మయన్మార్, థాయిలాండ్ తీరప్రాంతాల మధ్య ఉంది. మలయ్ ద్వీపకల్పానికి పడమటి వైపున ఉంది. అండమాన్ సముద్రానికి పశ్చిమాన ఉన్న బంగాళాఖాతం నుండి దీన్ని వేరు చేస్తూ మధ్యలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. దీని దక్షిణ కొసన బ్రీహ్ ద్వీపం ఉంది. అండమాన్ సముద్రాన్ని చారిత్రికంగా బర్మా సముద్రం అని కూడా పిలుస్తారు [3]  

అండమాన్ సముద్రం
అక్షాంశ,రేఖాంశాలు10°N 96°E / 10°N 96°E / 10; 96
రకంసముద్రం
బేసిన్ దేశాలుభారతదేశం, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా
గరిష్ట పొడవు1,200 km (746 mi)
గరిష్ట వెడల్పు645 km (401 mi)
600,000 km2 (231,700 sq mi)
సగటు లోతు1,096 m (3,596 ft)
అత్యధిక లోతు4,198 m (13,773 ft)
నీటి ఘనపరిమాణం660,000 km3 (158,000 cu mi)
మూలాలు[1][2]

సాంప్రదాయికంగా, ఈ సముద్రం తీరప్రాంత దేశాల మధ్య చేపల పెంపకం కోసం, ఆ దేశాల రవాణా కొరకూ ఉపయోగపడింది. దాని పగడపు దిబ్బలు, ద్వీపాలూ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. 2004 లో వచ్చిన హిందూ మహాసముద్ర భూకంపం, సునామీ కారణంగా మత్స్య, పర్యాటక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

భౌగోళికం

92° E - 100° E రేఖాంశాల మధ్యన్, 4° N - 20° N అక్షంశాల మధ్యనా విస్తరించి ఉన్న అండమాన్ సముద్రం హిందూ మహాసముద్రంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. అయినప్పటికీ చాలా కాలం పాటు దీన్ని ఎవరూ అన్వేషించలేదు. మయన్మార్‌కు దక్షిణాన, థాయిలాండ్‌కు పశ్చిమాన, ఇండోనేషియాకు ఉత్తరాన, ఉన్న ఈ సముద్రాన్ని బంగాళాఖాతం నుండి అండమాన్, నికోబార్ దీవులు, ఇండో - బర్మీస్ ప్లేట్ సరిహద్దులో ఉన్న సముద్ర పర్వతాల గొలుసు వేరు చేస్తున్నాయి. బేసిన్ కు దక్షిణ నిష్క్రమణ మార్గంగా మలక్కా జలసంధి (మలయ్ ద్వీపకల్పం, సుమత్రాల మధ్య) ఉంది.ఇది 3 కి.మీ. వెడల్పు, 37 మీటర్ల లోతూ ఉంటుంది.

అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ సంస్థ "అండమాన్ లేదా బర్మా సముద్రం" పరిమితులను ఈ క్రింది విధంగా నిర్వచిస్తుంది: [4] : p.21 

వృక్షజాలం

అండమాన్ సముద్రం తీరప్రాంతాల్లో మడ అడవులు, సముద్రపు గడ్డి మైదానాలూ ఉంటాయి. మడ అడవులు 600 చ.కి.మీ. మలయ్ ద్వీపకల్పంలోని థాయ్ తీరాలలో, సముద్రపు పచ్చికబయళ్ళు త్9 చ.కి.మీ విస్తీరణం లోనూ ఉన్నాయి. [5] : 25–26  తీరప్రాంత జలాల్లో అధికంగా ఉండే ఉత్పాదకతకు మడ అడవులు ఎక్కువగా కారణం. వాటి వేర్లు, నేలను, అవక్షేపాలను పట్టుకుంటాయి. చేపలకు, చిన్న జల జీవులకూ వేటజీవుల నుండి ఆశ్రయం కల్పిస్తాయి. మడ చెట్లు గాలి నుండి తరంగాల నుండి తీరాన్ని రక్షిస్తాయి. వాటి మృతభాగాలు జల ఆహార గొలుసులో భాగం. అండమాన్ సముద్రంలోని థాయ్ మడ అడవులలో చాలా భాగాన్ని 1980 ల నాటి ఉప్పునీటి రొయ్యల పెంపకం సమయంలో తొలగించారు. 2004 సునామీ కారణంగా మడ అడవులు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత వాటిని కొంతవరకూ తిరిగి నాటారు. కాని మానవ కార్యకలాపాల కారణంగా వాటి విస్తీర్ణం క్రమంగా తగ్గుతూనే ఉంది. [5] : 6–7 

అండమాన్ సముద్రంలోని పోషకాల యొక్క ఇతర ముఖ్యమైన వనరులు సీగ్రాస్, మడుగులు, తీర ప్రాంతాల బురద అడుగులు. బొరియల్లోను, సముద్రగర్భం లోనూ జీవించే అనేక జీవులకు అవి ఆశ్రయాన్నిస్తాయి. అనేక జల జాతులు రోజూ సీగ్రాస్‌ నుండి, సీగ్రాస్‌కూ వలస పోతూంటాయి. సముద్ర తీర పడకలను దెబ్బతీసే మానవ కార్యకలాపాలలో తీరప్రాంత పరిశ్రమలు, రొయ్యల పొలాలు, ఇతర రకాల తీరప్రాంత అభివృద్ధి కార్యక్రమాల నుండి వెలువడే వ్యర్థ జలాలు, అలాగే ట్రాలింగ్, పుష్ నెట్స్, డ్రాగెట్ల వాడకమూ ఉన్నాయి. 2004 నాటి సునామీ అండమాన్ సముద్రం వెంట 3.5% సీగ్రాస్ ప్రాంతాలు ఇసుక అవక్షేపణ వలన ప్రభావితమయ్యాయి. 1.5% ప్రాంతంలో పూర్తిగా ఆవాస నష్టం జరిగింది. [6] : 7 

జంతుజాలం

ఫాంటమ్[permanent dead link] బ్యానర్ ఫిష్ ( హెనియోకస్ ప్లూరోటెనియా ), సిమిలాన్ దీవులు, థాయిలాండ్
డుగోంగ్[permanent dead link]
స్టార్[permanent dead link] ఫిష్, అండమాన్ సముద్రం

మలయ్ ద్వీపకల్పంలోని సముద్ర జలాలు మోలస్కాన్ పెరుగుదలకు అనుకూలంగా ఉన్నాయి. 75 కుటుంబాలకు చెందిన 280 తినదగిన చేప జాతులు ఉన్నాయి. వాటిలో, 232 జాతులు (69 కుటుంబాలు) మడ అడవులలో కనిపిస్తాయి. 149 జాతులు (51 కుటుంబాలు) సీగ్రాస్‌లో నివసిస్తున్నాయి; కాబట్టి రెండు ఆవాసాల్లోనూ నివసించే జాతులు 101. [7] : 26  ఉనికి ప్రమాదకరంగా ఉన్న పలు జంతుజాతులు -డుగోంగులు, ఇరవాడి డాల్ఫిన్ వంటి అనేక డాల్ఫిన్ జాతులు, నాలుగు జతుల సముద్ర తాబేళ్లు- కూడా ఈ సముద్రంలో ఉన్నాయి. సముద్ర తాబేళ్లలో తీవ్రమైన ఆపద ఎదుర్కొటున్న లెదర్‌బ్యాక్ తాబేలు, హాక్స్బిల్ తాబేలు, ఆకుపచ్చ తాబేలు, ఆలివ్ రిడ్లీ తాబేలు ఉన్నాయి. అండమాన్ సముద్రంలో రానోంగ్, సాతున్ ప్రావిన్సుల మధ్య అక్కడక్కడా 150 దుగోంగ్‌లు మాత్రమే ఉన్నాయి. సీగ్రాస్ పచ్చికభూముల క్షీణత ప్రభావం ఈ జాతులపై తీవ్రంగా ఉంటుంది. [7] : 8 

అండమాన్ సముద్రంలో పగడపు దిబ్బలు 117 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. [8]

మానవ కార్యకలాపాలు

చేపలు పట్టడానికీ, తీరప్రాంత దేశాల మధ్య రవాణాకూ ఈ సముద్రం చాలాకాలంగా ఉపయోగపడుతోంది.

చేపలు పట్టడం

థాయిలాండ్ ఒక్కటే 2005 లో 9,43,000 టన్నుల చేపలను [9] 2000 లో 7,10,000 టన్నుల చేపలనూ పట్టింది. ఆ 7,10,000 టన్నులలో, 4,90,000 ట్రాలర్లతో (1,017 నౌకలు), 184,000 పర్స్ సీన్ ద్వారా (415 నౌకలు) 30,000 గిల్నెట్స్ ద్వారానూ పట్టింది. థాయ్‌లాండ్ పట్టిన మొత్తం సముద్ర చేపల్లో 41 శాతం థాయ్‌లాండ్ గల్ఫ్‌లోను, 19 శాతం అండమాన్ సముద్రంలోనూ పట్టారు. నలభై శాతం థాయిలాండ్ EEZ బయట పట్టుకున్నారు. [10]

మలేషియా చేపల ఉత్పత్తి బాగా తక్కువగా ఉంది. మయన్మార్‌ ఉత్పత్తి సుమారుగా అంతే లేదా కొద్దిగా ఎక్కువ గానీ ఉంటుంది. [11] చేపల కోసం మయన్మార్, థాయిలాండ్ ల మధ్య ఉన్న పోటీ అనేక ఘర్షణలకు దారితీసింది. 1998, 1999 లలో, ఈ ఘర్షణలు ఇరువైపులా మరణాలకు దారితీసాయి. సైనిక ఘర్షణకు దరిదాపుల్లోకి వెళ్ళాయి. ఈ రెండు సందర్భాల్లోనూ, వివాదాస్పద సముద్ర ప్రాంతాలలో చేపలు పడుతున్న థాయ్ ఫిషింగ్ బోట్లను అడ్డుకోవడానికి బర్మీస్ ఓడలు ప్రయత్నించినప్పుడు థాయ్ నావికాదళం జోక్యం చేసుకుంది. యుద్ధ విమానాలను మోహరించాలని థాయ్ జాతీయ భద్రతా మండలి భావించింది. థాయ్ ఫిషింగ్ బోట్లను మలేషియా నావికాదళం కూడా అడ్డుకుంటూ ఉంటుంది. విదేశీ జలాల్లో లైసెన్స్ లేకుండా చేపలు పట్టకుండా థాయ్ ప్రభుత్వం తన సొంత మత్స్యకారులను హెచ్చరించాల్సి వచ్చింది [12]

థాయ్‌లాండ్‌లో 2004 సముద్ర ఉత్పత్తి: పెలాజిక్ ఫిష్ 33 శాతం, డీమెర్సల్ ఫిష్ 18 శాతం, సెఫలోపాడ్ 7.5 శాతం, క్రస్టేసియన్స్ 4.5 శాతం, పనికిరాని చేపలు 30 శాతం, ఇతరాలు 7 శాతం. [13] : 12  పనికిరాని చేపల్లో, తినకూడని జాతులు, తక్కువ వాణిజ్య విలువ కలిగిన తినదగిన జాతులు, చేపల పిల్లలూ ఉంటాయి. వీటిని తిరిగి సముద్రం లోకి వదిలేస్తారు. [13] : 16  పెలాజిక్ చేపల్లో ఆంకోవీస్ (19 శాతం), ఇండో-పసిఫిక్ మాకేరెల్ (18 శాతం), సార్డినెల్లాస్ (14 శాతం), స్కాడ్ (11 శాతం), లాంగ్‌టైల్ ట్యూనా (9 శాతం), ఈస్టర్న్ లిటిల్ టూనా (6 శాతం), ట్రెవాలీస్ (6 శాతం), బిగ్‌ఐ SCAD (5 శాతం), ఇండియన్ మాకెరెల్ (4 శాతం), కింగ్ మాకెరెల్ (3 శాతం), టార్పెడో SCAD ( మెగలాస్పిస్ కార్డిలా, 2 శాతం), తోడేలు హెర్రింగ్స్ (1 శాతం), ఇతరులు (2 శాతం) ఉంటాయి. [13] : 13  డీమెర్సల్ చేపల్లో పర్పుల్-స్పాటెడ్ బిజీ, థ్రెడ్‌ఫిన్ బ్రీమ్, బ్రష్‌టూత్ లిజార్డ్ ఫిష్, సన్నని బల్లి ఫిష్, జింగా రొయ్యలు ఉన్నాయి. స్పానిష్ మాకేరెల్, కారంగిడే, టార్పెడో స్కాడ్ మినహా చాలా జాతులను 1970-90 ల నుండి అతిగా (ఓవర్ ఫిషింగ్) పట్టారు. మొత్తం ఓవర్ ఫిషింగ్ రేటు 1991 లో పెలాజిక్ లు 333 శాతం, డీమెర్సల్ జాతులకు 245 శాతం. [13] : 14  సెఫలోపాడ్స్‌ను స్క్విడ్, కటిల్ ఫిష్, మోలస్కులుగా విభజించారు. థాయ్ జలాల్లో స్క్విడ్, కటిల్ ఫిష్ లు 10 కుటుంబాలు, 17 ప్రజాతులు, 30 కి పైగా జాతులూ ఉన్నాయి. అండమాన్ సముద్రంలో పట్టుబడిన ప్రధాన మోలస్క్ జాతులు స్కాలోప్, బ్లడ్ కాకిల్ చిన్న-మెడ క్లామ్. వాటిని పట్టాలంటే, సముద్రపు అడుగును దేవే గేర్లు అవసరం. ఇవి సముద్రపు అడుగుభాగాన్ని దెబ్బతీస్తాయి, అంచేత వీటికి ప్రజాదరణ లేదు. కాబట్టి, మోలస్క్ ఉత్పత్తి 1999 లో 27,374 టన్నుల నుండి 2004 లో 318 టన్నులకు తగ్గిపోయింది. 2004 లో మొత్తం సముద్ర ఉత్పత్తులలో క్రస్టేసియన్లు 4.5 శాతం మాత్రమే ఉండగా, విలువలో మాత్రం అవి 21 శాతం ఉన్నాయి. అరటి రొయ్యలు, టైగర్ రొయ్యలు, కింగ్ రొయ్యలు, పాఠశాల రొయ్యలు, బే ఎండ్రకాయలు, మాంటిస్ రొయ్యలు, ఈత పీతలు, మట్టి పీతలు వీటిలో ప్రధానంగా ఉంటాయి. 2004 లో మొత్తం క్యాచ్‌లో స్క్విడ్, కటిల్ ఫిష్ 51,607 టన్నులు, క్రస్టేసియన్లు 36,071 టన్నులు ఉన్నాయి. [13] : 18–19 

ఖనిజ వనరులు

సముద్రపు ఖనిజ వనరులలో మలేషియా, థాయిలాండ్ తీరాలలో తగరం నిక్షేపాలు ఉన్నాయి. ప్రధాన ఓడరేవులు భారతదేశంలో పోర్ట్ బ్లెయిర్ ; మయన్మార్‌లోని డావీ, మావ్లామైన్, యాంగోన్ ; థాయిలాండ్‌లోని రానోంగ్ నౌకాశ్రయం ; మలేషియాలో జార్జ్ టౌన్, పెనాంగ్ ; ఇండోనేషియాలోని బెలవన్ .  

పర్యాటకం

అండమాన్ సముద్రం లోని మలయ్ ద్వీపకల్పపు పశ్చిమ తీరం, అండమాన్ నికోబార్ దీవులు, మయన్మార్లు పగడపు దిబ్బలతో, ఆఫ్షోర్ దీవులతో అలరిస్తూ ఉంటాయి. 2004 సుమత్రా భూకంపం, సునామీ కారణంగా దెబ్బతిన్నప్పటికీ, అవి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. [14] సమీప తీరంలో అనేక సముద్ర జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. ఒక్క థాయిలాండ్‌లోనే 16 ఉన్నాయి, వాటిలో నాలుగు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చే ప్రతిపాదనలో ఉన్నాయి. [15] : 7–8 

ఇవి కూడా చూడండి

మూలాలు