థాయిలాండ్

థాయిలాండ్ లేదా థాయ్‌లాండ్ (English: Thailand నించి, Thai: ประเทศ, translit. ప్రాటెట్ థాయ్ "ప్రదేశ థాయి"), అధికారికంగా థాయి రాజ్యం (ราชอาณาจักรไทย రచ్చ అన్న చక్ర థాయ్ "రాజా ఆజ్ఞ చక్ర థాయి"; Kingdom of Thailand కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్), ఒక ఆగ్నేయ ఆసియా దేశము. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా ద్వీపకల్పం మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది. థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్,కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, మలేషియా, పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ యందు వియత్నాం, ఇండోనేషియా, భారతదేశం ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనికదళాధిపతి, బౌద్ధమతానునయుడు, అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.

థాయి రాజ్యం

ราชอาณาจักรไทย
Ratcha Anachak Thai
Flag of థాయిలాండ్
జండా
Emblem of థాయిలాండ్
Emblem
నినాదం: 
ชาติ ศาสนา พระมหากษัตริย์ (Thai)
Chat Satsana Phramahakasat
"Nation, Religion, King" (unofficial)
గీతం: Phleng Chat Thai
Thai National Anthem (Instrumental)

Royal anthem: en:Sansoen Phra Barami
Thai Royal Anthem (instrumental)
Location of థాయిలాండ్
రాజధానిen:Bangkok
అధికార భాషలుThai[1]
Official scriptThai alphabet
జాతులు
(2009[1][2])
పిలుచువిధంThai
ప్రభుత్వంUnitary parliamentary en:constitutional monarchy
• King
en:Bhumibol Adulyadej
(en:Rama IX)
Prayut Chan-o-cha (NC)
శాసనవ్యవస్థNational Assembly
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
House of Representatives
Formation
1238–1448
1351–1767
1768–1782
6 April 1782
• Constitutional monarchy
24 June 1932
విస్తీర్ణం
• మొత్తం
513,120 km2 (198,120 sq mi) (51st)
• నీరు (%)
0.4 (2,230 km2)
జనాభా
• 2011 estimate
66,720,153[3] (20వ)
• 2010 census
65,479,453[4]
• జనసాంద్రత
132.1/km2 (342.1/sq mi) (88th)
GDP (PPP)2013 estimate
• Total
$701.554 billion[5]
• Per capita
$10,849[5]
GDP (nominal)2013 estimate
• Total
$424.985 billion[5]
• Per capita
$6,572[5]
జినీ (2010)39.4[6]
medium
హెచ్‌డిఐIncrease 0.690[7]
medium · 103వ
ద్రవ్యంబహ్ట్ (฿) (THB)
కాల విభాగంUTC+7
వాహనాలు నడుపు వైపుleft
ఫోన్ కోడ్+66
Internet TLD
  • .th
  • .ไทย

థాయ్‌లాండ్ సుమారు 5,13,000 చదరపు కిలోమీటర్ల (1,96,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో, ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. థాయ్‌లాండ్‌లో అతిపెద్ద, రాజధాని నగరం బాంకాక్. బాంకాక్ థాయ్‌లాండ్ దేశానికి రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. థాయ్‌లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు థాయ్ చైనీయులు, 3% మంది ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు. మిగిలిన అల్పసంఖ్యాకులలో మోనులు, ఖెమరానులు, వివిధ గిరిజన సంప్రదాయానికి చెందినవారు కలరు. థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్, మతం బౌద్ధమతం. బౌద్ధమతాన్ని థాయ్‌లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985, 1996లో అతివేగంగా ఆర్థికాభివృద్ధి చెంది, ప్రస్తుతం ఒక పారిశ్రామిక దేశంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా తయారైనది. దేశాదాయంలో పర్యాటక రంగం కూడా ప్రధానపాత్ర వహిస్తుంది. దేశంలో, చట్టబద్ధంగా, చట్టవ్యతిరేకంగా, 20 లక్షల వలసప్రజలు నివసిస్తున్నారు. అలాగే దేశంలో అభివృద్ధి చెందిన దేశాలనుండి వచ్చి చేరిన బహిష్కృతులు అనేకమంది నివసిస్తున్నారు.

పేరువెనుక చరిత్ర

థాయ్‌లాండ్‌ను ఇక్కడి ప్రజలు సాధారణంగా మెయాంగ్ థాయ్‌ అని పిలుస్తూ ఉంటారు, ఇతరులు " ది ఎక్సోనిం సియాం " అని సియాం, శ్యాం, శ్యామ అని కూడా అంటారు. 'శ్యామా' అంటే సంస్కృతంలో 'నల్లని 'అని అర్ధం. 1851-1868 మధ్యకాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23న ఈ దేశం పేరు థాయ్‌లాండ్ గా మార్చబడింది.1945 నుండి 1949 మే 11 వరకు థాయ్‌లాండు తిరిగి సియాంగా పిలుబడింది. తరువాతి కాలంలో మరల థాయ్‌లాండుగా మార్చబడింది. థాయ్ అనే మాట చలా మంది అనుకున్నట్లు 'స్వతంత్రం' అని అర్ధం వచ్చే పదముకు సంబంధించినది కాదు; అక్కడ నివసించే ఒక జాతి ప్రజలను సూచిస్తుంది. ప్రముఖ పరిశోధక విద్యార్థిఒకరు థాయ్ అంటే " ప్రజలు ", " మానవుడు " అని అర్ధమని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పటికీ థాయ్‌లాండ్ గ్రామాలలో ప్రజలను ఉద్దేశించడానికి 'ఖోన్ 'కు బదులుగా 'థాయ్'ని వాడుతుంటారు. థాయ్ అనే మాటకు స్వేచ్ఛ అని అర్ధం కూడా ఉంది. దక్షిణాసియాలో యురోపియన్ ఆక్రమణకు గురికాని ఒకే ఒక్క దేశం థాయ్‌లాండ్ కనుక ఇక్కడి ప్రజలు తమదేశాన్ని " ద లాండ్ ఆఫ్ ఫ్రీడం " (స్వతంత్ర భూమి) అని సగర్వంగా పిలుచుకుంటారు. అయినప్పటికి కొందరు ప్రజలు ప్రాథెట్ థాయ్, మెయాంగ్ థాయ్ లేక చిన్నాగా థాయ్ అనీ అంటుంటుంటారు. థాయ్ అంటే దేశం అయినప్పటికీ నగరం, పట్టణం అని కూడా అర్ధం స్పూరిస్తుంది. రాచా అనాచక్ థాయ్ అంటే థాయ్‌లాండ్ సామ్రాజ్యం అని అర్ధం. రాచా అంటే సంస్కృతంలో రాజా, రాజరికం అని అర్ధం. అనా అంటే సంస్కృతంలో ఆఙ అని అర్ధం. చక్ అంటే సంస్కృతంలో చక్రం అనగా అధికారానికి, పాలనకు గుర్తు. థాయ్‌లాండ్ జాతీయగీతాన్ని 1930లో దేశభక్తుడైన పీటర్ ఫియట్ రచించాడు.

చరిత్ర

థాయ్ ల్యాండ్ ఉద్భవనం కొద్ది కాలమే ఉన్న 1238 నాటి సుఖోథాయ్ రాజ్యానికి ఆపాదిస్తారు. ఈ రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి సి ఇంథ్రాథిత్. దీని తర్వాత ఆయుత్థాయ రాజ్యం 14వ శతాబ్దంలో స్థాపించబడింది. థాయ్ సంస్కృతి చైనా, భారతదేశముల వల్ల ప్రభావితము చెందినది. మిగిలిన దక్షిణాసియా దేశాముల వలె థాయ్‌లాండ్‌లో 40,000 సంవత్సరాలాకు పూర్వమే మానవులు నివసించిన ఆధారాలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో ఖేమర్ సామ్రాజ్యానికి చెందిన ఫ్యునాన్ పాలనా సమయం నుండి థాయ్‌లాండ్ ప్రజలమీద భారతీయ సంప్రదాయ, మత ప్రభావం అధికంగా ఉంది. ఆయుత్థాయ వద్ద ఉన్న " వాట్ చైనావాతానారాం " అవశేషాలు 1767లో బర్మీయులు రాజా హిబంషిన్ ఆధ్వర్యంలో ఈ దేశంలో సాగించిన భస్మీపటలానికి గుర్తుగా నిలిచాయి. 13వ శతాబ్దంలో ఖేమర్ సామ్రాజ్య పతనం తరువాత థాయ్, మాన్, మలాయ్ రాజ్యాలు వర్ధిల్లాయి. ఈ ప్రదేశాలలో పురాతత్వ పరిశోధనలు, కళాఖండాలు, సియాం సామ్రాజ్య అవశేషాలు ఇప్పటికీ విశేషంగా లభిస్తున్నాయి. 12 వ శతాబ్ధానికి ముందు థాయ్ లేక సియామీ సామ్రాజ్యానికి చెందిన బుద్ధసంప్రదాయాన్ని అనుసరించే సుఖోథాయ్ పాలనసాగినట్లు 1238లో లభించిన ఆధారాలు తెలియజేస్తున్నాయి.

ఆయుత్థాయ వద్ద వాట్ చైవత్తనారాం శిథిలాలు. ఈ నగరం (1767లో) బర్మా రాజు హసీన్ భ్యూశిన్ సైనికుల ద్వారా కాల్చి, ఆక్రమింపబడినది .

13-15వ శతాబ్దంలో ఖేమర్ సామ్రాజ్యం పతనం తరువాత భౌద్ధసంప్రదాయానికి చెందిన సుఖోథాయ్ సామ్రాజ్యం, లాన్నా, క్సాంగ్ (ఇప్పుడు లావోస్) వర్ధిల్లాయి. అయినప్పటికీ ఒక శతాబ్దం తరువాత అనగా 14 వ శతాబ్దంలో సుఖోథాయ్ అధికారం దిగువ చాయో ఫ్రయా నది లేక మెనాం ప్రదేశంలో స్థాపించబడిన ఆయుథ్థాయ సామ్రాజ్యం వశమైంది. మెనాంను కేంద్రీకృతం చేసుకుని ఆయుథ్థాయ సామ్రాజ్యం విస్తరిస్తున్న సమయాన నార్తన్ వెల్లీలో లాన్నా సంరాజ్యం, థాయ్ నగరం భూభాగం కూడా దానిలో అనత్భాగం అయ్యాయి. 1431లో ఖేమర్ అంకారును విడిచివెళ్ళిన తరువాత అయుథాయా సైన్యాలు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నాయి. థాయ్‌లాండ్ పొరుగు రాజ్యాలతో చేరి వాణిజ్య సంప్రదాయం దక్కించుకుని చైనా, భారతదేశం, పర్షియా, అరబ్ దేశాలతో వాణిజ్యసంబంధాలు ఏర్పరచుకుంది. ఆయుథ్థాయ ఆసియాలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారితో మొదలై ఫ్రెంచ్,డచ్, ఆంగ్లేయులు, మొదలైన ఐరోపావ్యాపారుల రాక కొనసాగింది.

ఆయుత్థాయ హిస్టారికల్ పార్క్ లో స్తూపాలు.

1767 తరువాత అయుథాయ సామ్రాజ్య పతనం తరువాత రాజా టక్సిన్ తన రాజ్య రాజధానిని థాయ్‌లాండ్ నుండి థాన్‌బురికి 15 సంవత్సరాల వరకు తరలించాడు. ప్రస్తుత రత్తానకోసియన్ శకం 1787 నుండి ఆరంభమైంది. తరువాత మొదటి రాజారామా ఆధ్వర్యంలో బ్యాంకాక్‌ను రాజధానిగా చేసుకుని చక్రి సంరాజ్య స్థాపన జరిగింది. బ్రిటానికా ఎంసైక్లోపీడియాను అనుసరించి థాయ ప్రజలలో మూడుభాగాలు, బర్మీయులు 17-19 శతాబ్ధాలలో బానిసలుగా వాడుకోబడ్డారు.

యురోపియన్ల వత్తిడికి ప్రతిగా యురోపియన్ సామ్రాజ్యలకు లోబడని ఏకైక దక్షిణాసియా దేశంగా థాయ్‌లాండ్ నిలబడింది. నాలుగు శతాబ్ధాల కాలంగా శక్తివంతమైన పాలకులు దీర్ఘకాలం థాయ్‌లాండ్‌ను పాలించడమే ఇందుకు ప్రధాన కారణం. థాయ్‌లాండ్ పాలకులు ఫ్రెంచ్ ఇండోచైనా, బ్రిటిష్ సామ్రాజ్యం వత్తిడి, శత్రువానికి 4 శతాబ్ధాల కాలం ఎదురొడ్డడం విశేషం అని చెప్పవచ్చు. దక్షిణాసియా దేశాలు ఫ్రెంచ్, బ్రిటిన్ సామ్రాజ్యల మద్య ఉన్నందున థాయ్‌లాండ్ పశ్చిమదేశాల ప్రభావానికి లోనయ్యింది. పశ్చిమదేశాల ప్రభావంతో 19వ శతాబ్దంలో వివిధరకాల సంస్కరణలు జరిగాయి. అలాగే ప్రధానంగా మెకాంగ్ తూర్పు భాగంలో విస్తారమైన భూభాగం ఫ్రెంచ్ వశపరచుకోగా బ్రిటన్‌ ప్రభుత్వం అంచలంచలుగా మలే ద్వీపకల్పంలోని భూభాగాలను స్వాధీనం చేసుకుంది.

20వ శతాబ్దం

An example of pottery discovered near Ban Chiang in Udon Thani province, the earliest dating to 2100 BCE.

పెనాంగ్‌తో మొదలైన నష్టం కొనసాగి చివరకు మలే సంప్రదాయక ప్రజలు నివసిస్తున్న నాలుగు ప్రాంతాలు కూడా ఆక్రమణకు లోనయ్యాయి. తరువాత 1909లో ఆంగ్లో - సియామీ ఒప్పందం కారణంగా ఆ నాలుగు భూభాగాలు మలేషియా ఉత్తరభూభాగ ప్రాంతాలుగా అయ్యాయి. 1932లో సైన్యానికి చెందిన ఖానా రాసడాన్నా బృందం, సివిల్ అధికారుల యకత్వంలో రక్తపాతరహిత ఉద్యమం చెలరేగి పాలనాధికారం చేతులుమారింది. రాజా ప్రజాధిపాక్ సియాం భూభాగాన్ని ప్రజలహస్థగతం చేయడంతో శతాబ్దాలుగా సాగిన రాజులపాలన ముగింపుకు వచ్చింది.రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ థాయ్‌లాండ్ అధికారాన్ని మయాయ్ సరిహద్దులకు మార్చమని వత్తిడి చేసింది. థాయ్‌లాండ్ దేశంమీద దండయాత్ర చేసిన జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలను ప్లిక్ పిబల్సంగ్రం వద్ద 6-8 గంటల వరకు నిలిపి ఉంచాయి. 1941 డిసెంబరు 21 న జరిగిన ఈ సంఘటన తరువాత జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలకు దారి ఇచ్చింది. థాయ్‌లాండ్, జపాన్ ఫ్రెంచ్, బ్రిటిష్ సైన్యాలకు ఎదురించి పోరాడడానికి రహస్యఒప్పందం కుదుర్చుకున్నాయి. 1942లో థాయ్‌లాండ్ జపాన్ సాయతో అమెరికా, యునైటెడ్ కింగ్‌డం మీద యొద్ధం ప్రకటించింది. థాయ్‌లాండ్ అదేసమయం సెరీ-థాయ్ పేరుతో జపాన్‌ను అడ్డుకునే ఉద్యమం కూడా కొనసాగించడం విశేషం. థాయ్‌లాండ్- బర్మా డెత్-రైల్వే పనిలో 2,00,000 ఆసియన్ (ప్రధానంగా రోముషాకు చేరినవారు) కూలీలు, 60,000 సంయుక్త సైనికదళ సభ్యులు పాల్గొన్నారు. యుద్ధం తరువాత థాయ్‌లాండ్ అమెరికా సహాయ దేశంగా మారింది.ప్రచ్ఛన్న యుద్ధం తరువాత థాయ్‌లాండ్ మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలమాదిరిగా రాజకీయ అస్థిరత వంటి సమస్యలను ఎదుర్కొంది. అయినప్పటికీ 1880 నాటికి స్థిరమైన సమృద్ధి, స్వాతంత్ర్యం సాధించింది.

చిత్రమాలిక

దక్షిణ భూభాగం

The southern provinces of Thailand showing the Malay-Muslim majority areas.

థాయ్‌లాండ్ 1400 లో మలాయ్ ద్వీపకల్పం మీద ఆధిక్యత సాధించింది. మలాక్కా అనకూడా పిలువబడే ఈ భూభాగంలో టమాసెక్ (ప్రస్తుత సింగపూర్), అండమాన్ ద్వీపాలలో కొన్ని, జావా కాలనీ కూడా అంతర్భాగంగా ఉండేది. అయినప్పటికీ చివరకు సుల్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా దాడి చేసిన బ్రిటిష్ సైన్యాల ధాటికి వెనుకంజ వేయక తప్పలేదు. మలాయ్ సుల్తాన్ రాజ్యానికి చెందిన ఉత్తర భూభాగం నుండి థాయ్ రాజాకు బంగారు పుష్పాలరూపంలో సంవత్సర కానుకలు సామంతరాజులు ఇచ్చే కప్పంలా అందుతూ ఉండేవి. మలాయ్ సామ్రాజ్యంలో బ్రిటిష్ ప్రవేశం తరువాత " ఆంగ్లో-సియామీస్ " ఒప్పందం తరువాత బ్యాంకాక్ వరకు రైల్వే మార్గం నిర్మించడానికి సన్నాహాలు ఆరంభం అయ్యాయి. ఈ ఒప్పంద తరువాత సాతన్, పట్టాని భూభాగాలు థాయ్‌లాండుకు ఇవ్వబడ్డాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మలాయ్ ద్వీపకల్పం జపానీయుల చొరబాటుకు గురైంది. 1942 నుండి 2008 వరకు కమ్యూనిస్టుల ఆధిపత్య కొనసాగింది. చైనా సాంస్కృతిక విప్లవం తరువాత చైనా, వియత్నాం భూభాగంలో కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గడంతో థాయ్, మలయా శాంతి కొరకు పోరాటం సాగించారు. రెండవ ప్రపంచయుద్ధం తరువాత పి.యు.ఎల్.ఒ కొరకు సుకర్నో మద్దతుతో శాంతిపోరాటం తీవ్రం అయింది. ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన బౌద్ధులు, ముస్లిములు అత్యధికంగా ప్రాణాలు అర్పించవలసిన పరిస్థితి ఎదురైంది.

విదేశీసంబంధాలు

Thai Prime Minister Yingluck Shinawatra greets U.S. President Barack Obama at the Government House, during his official state visit to Thailand on 18 November 2012.

థాయ్‌లాండ్ అత్యధికంగా అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది. థాయ్‌లాండ్ అలీనోద్యమరాజ్యాలలో ప్రధానమైనది అలాగే యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ వాచ్ లిస్ట్ 301 దేశాలలో ప్రాధాన్యత కలిగి ఉంది. అసోసేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఎ.ఎస్.ఎ.ఎన్) లో క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉంది. థాయ్‌లాండ్ మిగిలిన ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా, మలేషియా,ఫిలిప్పైన్స్,సింగపూర్, బ్రూనై,లావోస్,కంబోడియా,బర్మా, వియత్నాం లతో సంబంధాలను అభివృద్ధి చేసుకుంటుంది. అలాగే సంవత్సర విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటూ ఉంది. ఆర్థిక, వాణిజ్యం, బ్యాంకింగ్, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలకు సహాయసహకారాలు అందిస్తుంది. 2003లో ఎ.పి.సి.ఇకి ఆతిథ్యం ఇచ్చింది. థాయ్‌లాండ్ గత ఉపముఖ్యమంత్రి డాక్టర్ సుపాచై పనిట్చ్‌పక్డి ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌గా ఐక్యరాజ్యసమితి ట్రేడ్ ఎండ్ డెవలప్మెంట్ సమావేశంలో ( యు.ఎన్.సి.టి.ఎ.డి) పాల్గొన్నాడు. థాయ్‌లాండ్ 2005 లో ఈస్ట్ ఆసియా సమ్మిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది.

గత కొన్నిసంవత్సరాలుగా అంతర్జాతీయ వేదిక మీద చురుకైన పాత్రపోషిస్తుంది. తూర్పు తైమూర్ ఇండోనేషియా నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత థాయ్‌లాండ్ మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి శాంతి దళాలలో భాగస్వామ్యం వహించింది. థాయ్‌లాండ్ సైనిక బృందాలు ఇప్పుడు ఐక్యరాజ్యసమితి శాంతిసైన్యంలో నిలిచాయి. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో భాగంగా థాయ్‌లాండ్ ప్రాంతీయ సంస్థలు, అమెరికా సంస్థలు, " ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోపరేషన్ ఇన్ యూరప్ " సంస్థలలో భాగస్వామ్యం వహిస్తుంది.ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ పునర్నిర్మాణ కార్యక్రమాలలో థాయ్‌లాండ్ బృందాలు పనిచేస్తున్నాయి. థాయ్‌లాండ్ చైనా, ఆస్ట్రేలియా, బహ్రయిన్,భారతదేశం అరియు అమెరికా లతో వ్యాపారసంబంధాలకు ప్రయత్నాలు చేస్తున్నది. తరువాత అధికథరల కారణంగా తీవ్రవిమర్శలకులోనై థాయ్ పరిశ్రమలు తుడిచిపెట్టుకు పోయాయి. థాక్సిన్ విదేశీసహాయాన్ని నిరాకరించి నిధిసహాయ దేశాలతో కలిసి పొరుగున ఉన్న మెకాంగ్ భూభాగ అభివృద్ధి కొరకు కృషిచేసింది. థాక్సిన్ పొరుగున ఉన్న లావోస్ వంటి వెనుకబడిన దేశాలకు థాయ్‌లాండ్ నాయకత్వం వహించాలని అభిలషిస్తూ వాటి అభివృద్ధి కొరకు వివిధ ప్రణాళికలను ప్రవేశపెట్టింది. థాక్సిన్ వివాదాస్పదంగా నిరంకుశ బర్మాప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. యు.ఎస్ నాయకత్వం వహించిన ఇరాక్ యుద్ధానికి 423 మంది శక్తివంతమైన యోధులను పంపి సహకరించింది. 2004 సెప్టెంబరులో థాయ్ తన బృందాలను వెనుకకు తీసుకుంది. ఈ యుద్ధంలో థాయ్ ఇద్దరు యోధులు మరణించారు.

పీపుల్స్ అలయంస్ ఫర్ డెమాక్రసీ లీడర్ కాసిట్ పిరోమ్యాను విదేశాంగమంత్రిగా నియమించాడు. విదేశాంగమంత్రిగా నియమించడానికి ముందు కాసిట్ కంబోడియా వ్యతిరేక పార్టీకి నాయకత్వం వహించాడు. 2009లో థాయ్, కంబోడియాల మద్య పెద్దేత్తున యుద్ధం చెలరేగింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న 900 సంవత్సరాల విహియర్ హిందూ ఆలయం సమీపంలో ఈ యుద్ధం జరిగింది. కంబోడియా ప్రభుత్వం తాము 4 థాయ్ సైనికులను చంపామని 10 మందిని యుద్ధఖైదీలుగా పట్టుకున్నామని ప్రకటించారు. అయినప్పటికీ థాయ్‌లాండ్ మాత్రం తమ సైనికులు మరణినించినట్లుగాని గాయపడినట్లుగాని అంగీకరించలేదు. యుద్ధం తాము ఆరంభించలేదని రెండు దేశాలు గట్టిగా వాదించాయి.

సైన్యం

The HTMS Chakri Naruebet, an aircraft carrier of the Royal Thai Navy.

థాయ్ సైనికదళం " ది రాయల్ థాయ్ ఆర్ముడ్ ఫోర్స్ " అనిపిలివబడుతుంది. ఇందులో రాయల్ థాయ్ ఆర్మీ, ది రాయల్ థాయ్ నేవీ, రాయల్ థాయ్ ఎయిర్ అంతర్భాగంగా పారామిలిటరీ దళాలు ఉంటాయి. అంతేకాక పారామిలటరీ దళాలు కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. ప్రస్తుతం సైన్యం మొత్తం సంఖ్య 8,00,000 మంది నియమించబడి ఉన్నారు.రాజా భూమిబోల్ అదుల్యతేజ్ (9వ రామా ) సైన్యాలకు నామమాత్ర అధ్యక్షత (చొంతాక్) వహిస్తాడు. థాయ్‌లాండ్ రక్షణ మంత్రిత్వశాఖ థాయ్ సైనికదళాల నిర్వహణా వ్యవహారాలను చూసుకుంటుంది. థాయ్ సైనిక ప్రధానకార్యాలయ ఆధ్వర్యంలో సైనికదళం బాధ్యతలు నిర్వహిస్తుంది. సైనికాధికారిగా థాయ్‌లాండ్ రక్షణదళ ఉన్నతాధికారి బాధ్యతలు నిర్వహిస్తాడు.థాయ్‌లాండ్ సైనికదళ వ్యయం దాదాపు 100 కోట్లు అమెరికన్ డాలర్లు.

రాజ్యాంగబద్ధంగా సైన్యంలో పనిచేయడం ప్రతిఒక్క పౌరుని బాధ్యతగా భావించబడుతుంది. అయినప్పటికీ రిజర్వ్ దళ శిక్షణలో చేరనివారిలో 21సంవత్సరాలు నిండిన వారికి సవచ్చంధ సైనికసేవలో కాని లేక ఆపత్జాల సైనిక బృందాలలో కాని పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. శిక్షణాకాలానికి అభ్యర్థులకు కాలనిర్ణయానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. 6-24 మాసాల శిక్షణ వారి విద్యార్హత, వారి రిజర్వ్ శిక్షణ లేక సైనికదినంలో (సాధారణంగా ఏప్రిల్ 1 వ తారీఖు ) వారి స్వచ్ఛంద సేవ మీద ఆధారపడి ఉంటుంది. గుర్తింపు పొందిన కళాశాల 1 విద్య పూర్తిచేసిన వారికి సంవత్సర ఆపత్కాల సైనిక శిక్షణకు కాని వారి జిల్లాలోని సైనిక కాత్యాలయంలో 6 మాసాల పనిచేయడానికి అర్హులౌతారు. 3 సంవత్సరాల పట్టవిద్య పూర్తిచేసిన వారు 1 సంవత్సరం ఆపత్కాల సైనికసేవ లేక వారి వారి జిల్లాలలో ఆరుమాసాల సేవకు అర్హులౌతారు. అంటే 1 సంవత్సర విద్య పూర్తిచేసినవారికి ఒక సంవత్సర శిక్షణార్హత ఉంటుంది.2 సంవత్సర విద్య పూర్తిచేసినవారికి ఒక సంవత్సర శిక్షణార్హత ఉంటుంది, సంవత్సర విద్య పూర్తిచేసినవారు పూర్తిశిక్షణకు అర్హులౌతారు. " ది రాయల్ ఆర్ముడ్ ఫోర్స్ " దినం జనవరి 18 జరుపుకుంటున్నారు. 1593 లో బర్మారాజకుమారునితో రాజనరేసుయన్ యుద్ధంచేసి విజయం సాధించిన రోజును సైనికదినంగా జరుపుకుంటున్నారు.

భౌగోళికం

View of the Luang Prabang Range straddling the Thai/Lao border in northern Thailand.

థాయ్‌లాండ్ వైశాల్యం 5,13,120 చదరపు కిలోమీటర్లు (1,98,120 చదరపు మైళ్ళు. వైశాల్యారంగా థాయ్‌లాండ్ ప్రపంచంలో 51వ స్థానంలో ఉంది. ఇది యోమన్ కంటే స్వల్పంగా చిన్నది అలాగే స్పెయిన్ కంటే స్వల్పంగా పెద్దది. థాయ్‌లాండ్ పలు విభిన్న భూభాగాలకు పుట్టిల్లు. థాయ్ ఉన్నతభూములు ( హైలాండ్స్) అనిపిలువబడే పర్వతభూభాగం థాయ్‌లాండ్ ఉత్తరదిశలో ఉన్నాయి. తనాన్ తాంగ్ చై పర్వతావళిలో సముద్రమట్టానికి 2,565 మీటర్ల (8,415 అడుగులు ) ఎత్తులో ఉన్న ఇంతానాన్ శిఖరం దేశంలో ఎత్తైన భూభాగంగా భావించబడుతుంది. ఈశాన్యంలో సముద్రతీరం, మెకాంగ్ నది సరిహద్దుల మద్య " ఖోరత్ పీ,ఠభూమి " ఉంది. దేశం మద్యభాగంలో ప్రధానంగా థాయ్‌లాండ్ అఖాతం (గల్ఫ్) వద్ద సముద్రసంగమం చేస్తున్న చయో ఫర్యా నదీ మైదానం ఆధిక్యత కలిగి ఉంది.

Satellite image of flooding in Thailand in October 2011.

దక్షిణ థాయ్‌లాండ్ భుభాగంలో సన్నని క్రా ఇస్త్మస్ మలేషియా వరకు విస్తరించి ఉంది. థాయ్‌లాండ్ జసంఖ్య, ప్రధాన వనరులు, సహజసిద్ధమైన భూభాగం, సాంఘిక అరియు ఆర్థిక స్థితిగతుల భేదంకలిగిన ఆరుభాగాలుగా రాజకీయంగా విభజించబడి ఉంది. థాయ్‌లాండ్ భౌతిక ఆకర్షణీయతకు ఈ వైవిధ్యాలు విపరీతంగా భాగస్వామ్యం వహిస్తున్నాయి.

చయో ఫర్యా, మెకాంగ్ నదులు గ్రామీణ థాయ్‌లాండ్ స్థిరమైన వనరుగా భావించబడుతుంది. ఈ రెండు నదులు, ఉపనదులు థాయ్‌లాండ్ వ్యవసాయ ఉత్పత్తికి ఆధారభూతంగా ఉదహరించబడుతున్నాయి. 3,20,000 కిలోమీటర్ల (1,24,000 మైళ్ళ ) పొడవైన థాయ్‌లాండ్ అఖాత సముద్రతీరాలో చాయో ఫర్యా, మెకాంగ్, బాంగ్ పకాంగ్, తాపి నదులు సముద్రసంగమం చేస్తున్నాయి. ఇది థాయ్‌లాండ్ పర్యాటకరంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. థాయ్ అఖాతం లోతు తక్కువైన స్వచ్ఛమైన జలాలు పర్యాట్కులను అత్యధికంగా ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ తీరంలో ఉన్న క్రా ఇస్త్మస్ ప్రాతం ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. థాయ్‌లాండ్ అఖాతం పారిశ్రామికంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. థాయ్‌లాండ్ ప్రధాన నౌకాశ్రయం అయిన సతాహిప్ పోర్ట్ బాంకాక్ ఇన్‌లాండ్ సీపోర్ట్ ప్రవేశంగా ఉంది. అత్యధికంగా పర్యాటక ఆకర్షణ కలిగిన విలాసవంతమైన రిసార్ట్లు ఉన్న అండమాన్ సముద్రతీర ప్ర్రంతం ఆసియాలో పసిద్ధి చెందాయి. ఫూకెట్, క్రబీ, రనాంగ్, ఫంగ్ న్గా, ట్రాంగ్, సుందరమైన థాయ్‌లాండ్ ద్వీపాలు అన్నీ అండమాన్ సముద్రతీరంలో ఉన్నాయి. 2004లో సంభవించిన సునామీ సంఘటనలను అధిగమించి ఆసియా ఉన్నత వర్గానికి చెందిన ప్రజలకు ఇవి జలక్రీడా మైదానాలుగా ఉన్నాయి. సూయజ్, పనామా కాలువల మాదిరిగా " తాయ్ కెనాల్ " నిర్మించి రవాణా సౌకర్యాన్ని ఏర్పరచాలన్న వ్యూహాత్మకంగా ప్రణాళికలు సాగుతున్నాయి. థాయ్ రాజకీయనాయకులు సహితం ఈ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కాలువ నిర్మాణంతో సింగపూర్ నౌకాశ్రయ చార్జీలు తగ్గడం అలాగే చైనా, భారత్‌లతో వాణిజ్యసంభంధాలు మెరుగుపడగలవని యోచిస్తున్నారు. మలాకా సంధిలోని సముద్రచోరులనుండి రక్షణ లభించడం రవాణా సమయం తగ్గడం వంటి ప్రయోజనాలే కాక ఆసియాలో థాయ్‌లాండ్ ప్రధాన నౌకాకేంద్రంగా మారే అవకాశాల దృష్ట్యా ఈ ప్రభుత్వ ప్రణాళికు వ్యాపారవర్గాల మద్దతు కూడా లభిస్తుంది. థాయ్‌లాండ్ దక్షిణతీర నౌకాశ్రయాలు దేశ ఆర్థికరంగ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది. ప్రధానంగా పర్యాటకరంగం ద్వారా లభిస్తున్న దేశాదాయం ఇప్పుడు సేవారంగానికి విస్తరించడం ద్వారా థాయ్‌లాండ్ ఆసియా సేవాకేంద్రగా మారనున్నది. ఇంజనీరింగ్ ప్రాధాన్యత కలిగిన ఈ కాలువ నిర్మాణానికి సుమారుగా 20-30 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయం కాగలదని భావిస్తున్నారు. ఉష్ణమండల ఉష్ణోగ్రతలు కలిగిన థాయ్‌లాండ్ వాతావరణం మీద వర్షాల ప్రభావంకూడా అధికంగానే ఉంటుంది. వర్షాలతో కూడిన, వెచ్చని, చల్లని సౌత్-వెస్ట్ వర్షపాతం మే మాసం మద్య నుండి సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. దక్షిణ ఇస్త్మస్ వేడి, తడితో కూడిన మిశ్రిత వాతావరణం కలిగి ఉంటుంది.

విద్య

ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, థాయి లాండ్

థాయ్‌లాండ్‌లో అక్షరాస్యత అత్యున్నతమైన స్థాయిలో ఉంది. అలాగే థాయ్‌లాండ్‌లో చాక్కగా నిర్వహిస్తున్న విద్యావిధానంలో కిండర్‌గార్డెన్, లోయర్ సెకండరీ, అప్పర్ సెకండరీ పాఠశాలలు, లెక్కకు మించిన ఒకేషనల్ కాలేజులు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగ విద్యావిధనం కూడా చక్కగా అభివృద్ధి చెంది అన్ని రంగాలకు చెందిన విద్యను అందిస్తూ ప్రభుత్వరంగ విద్యాసంస్థలను అధిగమించింది. 14 సంవత్సరాల వరకు నిర్భంధ విద్యావిధానం అమలులో ఉంది. అలాగే ప్రభుత్వం 17 సంవత్సరాల వరకు ఉచిత విద్యను అందిస్తుంది.

చులాలోంగ్కార్న్ యూనివర్శిటి స్థాపన 1917, థాయి లాండ్ లో ప్రాచీన విశ్వవిద్యాలయం.

విద్యావిధానం విద్యార్థులపై కాఏంద్రీకృతమై ఉంది. అయినప్పటికీ పాఠ్యాంశాలు మాత్రం నిరంతరం మార్పులకు లోనౌతున్న కారణంగా ఉపాధ్యాయులకు తాము బోధించవాసినది ఏమిటో తెలియక, పాఠ్యపుస్తకాల రచయితలు తమపనిని కొనసాగించఏని స్థితిలో ఉన్నారు. ఇది కొన్ని సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయాలలో సహితం వివాదాంశంగా మారింది. అయినప్పటికీ 2001 నాటికి విద్యావిధానం అత్యున్నత స్థాయికి చేరుకుంది. వర్తమాన విద్యార్థులలో అధికులు కంప్యూటర్ సంబంధిత విద్యకు ముఖ్యత్వం ఇస్తున్నారు. ఆంగ్లభాషా సామర్ధ్యంలో థాయ్‌లాండ్ ఆసియాలో 54వ స్థానంలో ఉంది.

2010 నుండి 2011 జనవరి వరకు దేశమంతా ఐ.క్యూ పరీక్షలు నిర్వహించబడ్డాయి. సరాసరి ఐక్యూ 98.59 గా నిర్ణయించబడింది. ఇది ముపటి అధ్యయనాలకంటే అధికం. దక్షిణ భూభాగం ఐక్యూ శక్తి 88.7 గా నిర్ణయించబడింది. నాంతబురీ భూభాగంలో అత్యధికంగా ఐక్యూ శక్తి 108.91 గా నిర్ణయించబడింది. థాయ్ ఆరోగ్యశాఖ ఐడోడిన్ లోపం ఇందుకు కారణమని భావించి పశిమదేశాల మాదిరిగా అయోడిన్ చేర్చబడిన ఉప్పును ప్రజలకు అందించాలని సూచిస్తుంది. 2013లో విద్యాశాఖ 27,231 పాఠశాలలకు అంతర్జాల వసతి కల్పించబడుతుందని ప్రకటించింది.

సైన్స్ , టెక్నాలజీ

థాయ్‌లాండ్‌లో సైన్స్ గురించిన పరిశోధనలు, ఆర్థిక సంబంధిత బాధ్యతను " ది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ " విభాగం వహిస్తుంది. భౌతిక, రసాయనిక, మెటీరియల్ సైంసెస్ సంబంధిత విషయాలకు " ది సిన్‌క్రోట్రాన్ లైట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్.ఎ.ఆర్)" సంస్థ సహకారం అందిస్తున్నది. ఇది " సురానరీ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ " (ఎస్.యు.టి) లో అంతర్భాగంగా ఉంది. ఈ ఇన్‌స్టిట్యూటుకు " మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎం.ఒ.ఎస్.టి) ఆర్ధికసాయం అందిస్తుంది. దక్షిణాసియాలో అత్యధిక ఆర్ధికసాయంతో నడుస్తున్న ఇన్‌స్టిట్యూట్‌గా భావించబడుతుంది. ఎస్.ఒ.ఆర్.టి.ఇ.సి సింక్రోట్రాన్ ముందుగా జపాన్‌లో ఆరంభించి తరువాత థాయ్‌లాండుకు తరలించబడింది.

అంతర్జాలం

థాయ్‌లాండ్‌ ప్రభుత్వం 23,000 వై.వై అంతర్జాల అనుసంధాన కేంద్రాలు ప్రజల కొరకు అందిస్తుంది. థాయ్‌లాండ్‌లో అంతర్జాలం 10గిగాబైట్ల హైస్పీడ్ ఫైబర్-ఆప్టిక్ లైన్లు ఉన్నాయి. ఐ.ఎస్.పి , కె.ఐ.ఆర్.జెడ్ సంస్థలు నివాసగృహాలకు అంతర్జాల వసతి అందిస్తుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వం అంతర్జాలాన్ని సెంసార్ చేసి కొన్ని సైట్స్‌ను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటుంది. రాయల్ థాయ్ పోలీస్, ది కమ్యూనికేషన్ అథారిటీ, సమాచార మంత్రిత్వశాఖ సెంసార్ బాధ్యత వహిస్తుంది.

శక్తి

థాయ్‌లాండులో అణుధార్మిక విద్తుత్ సంస్థలు లేవు. అయినప్పటికీ 2026లో ఆరంభించడానికి అవకాశం ఉంది. ప్రస్థుతం 80% విద్యుత్తు ఫాసిల్ ఫ్యూయల్ నుండి లభిస్తుంది.

ఆర్ధికరంగం

బాంకాక్, పెద్ద నగరం, వ్యాపార పరిశ్రమల కేంద్రం, థాయి లాండ్.
Thailand is the largest rice exporter in the world.

థాయ్‌లాండ్ సరికొత్తగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్న దేశాలలో ఒకటి. 1985-1996 మద్య అత్యధికసాయిలో సాధించిన అభివృద్ధి తరువాత థాయ్‌లాండ్ ద్రవ్యం సంవత్సరానికి 12.4% అభివృద్ధి రేటును నమోదు చేస్తుంది. 1997లో దేశం ఎదుర్కొన్న ఆర్ధికసంక్షోభం కారణంగా దేశ ఆర్ధిక అభివృద్ధి 1.9% పతనం అయింది. సంక్షోభాన్ని నివారించలేని అసమర్ధత కారణంగా " చవాలిత్ యోంగ్‌చైయుధ్ రాజ్యాంగం మంత్రిమండలితో సహా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఎదురైంది. 1978 నాటికి అమెరికన్ డాలరుకు బదులుగా 25 బాహ్త్‌ (థాయ్ ద్రవ్యం) 1997 నాటికి 56 బాహ్త్‌ల స్థాయికి పతనం అయింది. 1998 నాటికి మరో 10.8% పతనం అయింది. ఈ పతనం ఆసియన్ ఆర్థిక సంక్షోభం మీద మరింత ప్రభావం చూపింది. 1999 లో థాయ్‌లాండ్ ఆర్థికవ్యవస్థ కోలొకోవడం ప్రారంభం అయింది. అత్యధికంగా పెరిగిన ఎగుమతులే ఇందుకు ప్రధానకారణం. 2001లో సరళీకృతం చేయబడిన ప్రపంచ ఆర్థికవ్యవస్థ కారణంగా థాయ్‌లండ్ 2.2% ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది. తురువాత కాలంలో థాయ్‌లాండ్ ఆసియా ఆర్థికవ్యవస్థలో క్రమాభివృద్ధి సాధించింది. బలహీనమైన బాహ్త్ ఎగుమతులను ప్రోత్సహించిఅడమేకాక భారి ప్రణాళికలు, ప్రధానమంత్రి అందిచిన ప్రోత్సాహం దేశాంతర్గత కొనుగోలుశక్తి అధికం అయింది. 2002,2003, 2004 సంవత్సరానికి 5.7% ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది.2005,2006, 2007 సంవత్సర అభివృద్ధి 4-5% అభివృద్ధి కొనసాగింది. 2008 నాటికి అమెరికన్ డాలర్ బలహీనపడడం, థాయ్‌లాండ్ ద్రవ్యం బలపడడం కొనసాగిన కారణంగా 2008 నాటికి అమెరికన్ డాలర్‌కు ఎదురుగా బాహ్త్ 33 స్థాయికి అభివృద్ధి కొనసాగింది.

థాయ్‌లాండ్ సంవత్సరానికి సేవలరూపంలో అందిస్తున్నది, వస్తురూపంలో ఎగుమతి చేస్తున్న వాణిజ్యం విలువ 105 అమెరికన్ డాలర్లు. ఎగుమతులలో ప్రధానమైనవి థాయ్ బియ్యం, వస్త్రాలు, పూలు, మత్య ఉత్పత్తులు,రబ్బర్, ఆభరణాలు, కార్లు, కంప్యూటర్లు, విద్యుత్తు పరికరాలు మొదలైనవి. బియ్యం ఎగుమతులలో థాయ్‌లాండ్ మొదటి స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ సంవత్సరానికి 6.5 మిలియన్ టన్నులు బియ్యం ఎగుమతి చేస్తున్నది. దేశంలో ప్రధాన పంట వరి. 27.25% సారవంతమైన భూములతో థాయ్‌లాండ్ పంటభూములు అధికంగా కలిగిన దేశాలలో మహా మెకాంగ్ భూభాగంలో ప్రథమ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ సాగుభూములలో 55% వరి పంటకు ఉపయోగించబడుతుంది.

విజయవంతంగా నడుస్తున్న విద్యుత్తు ఉపయోగ పరికరాలు, విడిభాగాలు, కంప్యూటర్లు విడిభాగాలు, కార్ల సంబంధిత ఉత్పత్తులు దేశాదాయానికి ఉపకరిస్తుండగా. థాయ్‌లాండ్ ఆదాయానికి పర్యాట్కరగం నుండి 6% ఆదాయం లభిస్తుంది. అలాగే పేదరికం, సాంస్కృతిక పరిస్థితులు మిళితమైన కారణంగా చట్టవిరుద్దమైన కార్యకలాపాలతో సంపాదించిన న్యాయవిరుద్ధమై ద్రవ్యంతో 2003 లో థాయ్‌లాండ్ జి.డి.పి 3% అభివృద్ధి చెందింది. ఇలా చేరిన ద్రవ్యం విలువ సుమారు 3 బిలియన్ల (300 కోట్లు) అమెరికన్ డాలర్లని అంచనా. 1993 లో చట్టవిరుద్దమైన కార్యకలాపాలతో సంపాదించిన ద్రవ్యంతో థాయ్‌లాండ్ జి.డి.పి 2.7% పెరిగిందని చులాలాంకోన్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పర్యాటక రంగం నుండి లభిస్తున్న ఆదాయంలో 10% చట్టవిరోధ కార్యకలాపాలద్వారా లభిస్తుందని అంచనా. థాయ్‌లాండ్ జి.డి.పి విలువ 602 బిలియన్ల ( 60200 కోట్లు ) అమెరికన్ డాలర్లు. థాయ్‌లాండ్ ఆర్థికశక్తి దక్షిణాసియాలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో ఇండోనేషియా ఉంది. థాయ్‌లాండ్ తలసరి ఆదాయం దక్షిణాసియా దేశాలలో 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలలో సింగపూర్, బ్రూనై, మలేషియా ఉన్నాయి. పొరుగున ఉన్న లావోస్, బర్మా, కంభోడియా దేశాలకు థాయ్‌లాండ్ ఆర్థికరంగం మూలాధారంగా ఉంది. 1997-1998 ఆసియా ఆర్థిక సంక్షోభానికి అనేక ఇతరకారణలాతో ఎగుమతులు ప్రధాన కారణమైయ్యాయి. ప్రపంచంలో ఆటోమోటివ్, విద్యుత్తు ఉపయోగ పరికరాలు ఏగుమతులలో థాయ్‌లాండ్ ప్రథమ స్థానంలో ఉంది. 1997, 2010 మద్యకాలంలోంపరిశ్రమల సమ్మిళితం, సంపద విక్రయాల విలువ 81 మిలియన్ల (8,100 కోట్లు) అమెరికండాలర్లని థాయ్ ఫార్ంస్ ప్రకటించింది. 2010 లో మాత్రమే ఈ విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టిస్తూ 12 మిలియన్ల (1,200 కోట్లు) అమెరికండాలర్లని అంచనా. 2011 లో జరిగిన పి.టి.టి కెమికల్స్ పి.సి.ల్ కపెనీ సమ్మిళితం అతి పెద్ద విక్రయంగా భావించబడుతుంది.ఈ విక్రయం విలువ 3.8 బిలియన్ల (380 కోట్లు).

థాయ్‌లాండ్ శ్రామికులలో 49% వ్యవవసాయక్షేత్రాలలో పనిచేస్తున్నారు. అయినప్పటికీ 1980లో వ్యవసాయక్షేత్రాలలో 70% శ్రామికులు పనిచేసేవారు. పారిశ్రామిక సంస్థలకు శ్రామికులు అధికంగా తరలిపోవడంతో వ్యవసాయరంగం శ్రామికుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. 1962-1983 మద్యకాలంలో వ్యవసాయరంగం 4.1% అభివృద్ధిని సాధించింది. తరువాత సంవత్సరాలలో సరాసరి 2.2% అభివృద్ధి కొనసాగింది. వస్తువుల ఎగుమతి, సేవారంగంలో జి.డి.పి అభివృద్ధి కొనసాగుతున్న తరుణంలో వ్యవసాయరంగ జి.డి.పి మాత్రం తగ్గుముఖం పట్టింది. 2011లో థాయ్‌లాండ్ నిరుద్యోగం 0.4%తో ఆరంభం అయింది. సమీపకాలంలో అనుకోకుండా తలెత్తిన తిరుగుబాటు, సైకప్రపాలన ప్రభావం వలన దేశంలో అస్థిరత ఏర్పడినప్పటికీ జి.డి.పి అభివృద్ధి మాత్రం 4-5% వద్ద నిలదొక్కుకుంది. సివిలియన్ పాలనలో 5-7% ఉన్న జి.డి.పి రాజకీయ అస్థిరత వలన కొంత క్షీణించింది.

థాయ్‌లాండ్ సాధారణంగా మెట్రిక్ విధానం అనుసరిస్తున్నా భూ పరిమాణ కొలతలకు అంగుళాలు, అడుగుల వంటి సంప్రదాయక విధానాలను అనుసరిస్తుంది. కొన్ని సమయాలలో వడ్రంగి పనికి ఉపకరించే కొయ్యను కొలడానికి కూడా ఈ పద్ధతి అనుసరించబడుతుంది. విద్యాబోధనకు బి.ఇ ( బౌద్ధ శకం) విధానంలో కాలగణన జరుగుతున్నప్పటికీ పౌరసేవలకు, ప్రభుత్వ ఒప్పందాలకు, వార్తాపత్రికలకు, బ్యాంకింగ్, పరిశ్రమలు, వాణిజ్య సంబంధిత వస్షయాలకు మాత్రం పాశ్చాత్య విధానంలో క్రీస్తుశకం కాలగణను అనుసరిస్తుంది.

గణాంకాలు

భాష

Historical populations
సంవత్సరంజనాభా±%
1910 81,31,247—    
1919 92,07,355+13.2%
1929 1,15,06,207+25.0%
1937 1,44,64,105+25.7%
1947 1,74,42,689+20.6%
1960 2,62,57,916+50.5%
1970 3,43,97,371+31.0%
1980 4,48,24,540+30.3%
1990 5,45,48,530+21.7%
2000 6,09,16,441+11.7%
2010 6,59,26,261+8.2%
Source: [1] National Statistical Office of Thailand
Ethnic map of Thailand

థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్ - కడై. ఇది లావోస్, బర్మాలోని షాన్ భాషకు సమీపంగ ఉంటుంది. దక్షిణ చైనా సరిహద్దులకు సమీపంగా ఉన్న హన్నియన్ యోమన్ నగరాలలో ఉపభాషలు కొన్ని మాట్లాడబడుతున్నాయి. థాయ్ - కడై భాషా విద్యబోధనకు, ప్రభుత్వనిర్వహణకు ఉపకరిస్తూ దేశమంతటా వాడుకలో ఉంది. మద్య థాయ్‌లాండ్‌లో వాడుకలో ఉన్న భాష ప్రామాణిక భాషగా భావించబడుతుంది. ఇది థాయ్ అక్షరమాల, అబుగిడా లిపి ( ఖేమర్ లిపి ప్రభావితంగా ఏర్పడినది) గా వాడబడుతుంది. పలు ఇతర భాషలు వాడుకలో ఉన్నాయి. దక్షిణ థాయ్ భాష దక్షిణ థాయ్‌లాండ్‌లో మాట్లాడబడుతుంది. ఉత్తర భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. స్వతంత్రరాజ్యమైన లానథాయ్ భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. థాయ్‌లాండ్ పలు అల్పసంఖ్యాక భాషాకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. వీటిలో పెద్దది లావో యాసతో కూడిన ఇసాన్ ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. ఇది ఒక్కోసారి థాయ్ భాషగా పరిగణించబడుతుంది. ఈ భాషను మాట్లాడే ప్రాంతం ఒకప్పుడు లావోస్ రాజ్యంలో (లన్ క్సనంగ్ సామ్రాజ్యం) ఉంటూ వచ్చింది. సుదూర దక్షిణ ప్రాంతంలో మలేషియా దేశ ప్రధాన భాషైన మలాయ్ యాసతో కూడిన యావీ భాష మాట్లాడబడుతుంది. అత్యధికంగా ఉన్న చైనీయులు వైవిధ్యమైన చైనా భాషలు మాట్లాడబడుతున్నాయి. టియోచ్యూ వీటిలో ప్రధానమైనది.

మాన్-ఖేమర్ కుటుంబం చెందిన మాన్, వియట్, మ్లబ్రి, ఆస్ట్రోనేషియన్ కుటుంబానికి చెందిన ఒరంగ్ అస్లి, చాం, మోకెన్. సినో - టిబెటన్ కుటుంబానికి చెందిన లావా, అఖాన్, ఇతర థాయ్ భాషలైన నియా, ఫూథాయ్, సియాక్ వంటి పలు గిరిజన భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. హమాంగ్ ప్రజల మధ్య హమాంగ్ భాష వాడుకలో ఉంది. దీనిని భాషాకుటుంబానికి చెందిన ప్రజలకు వాడుకలో ఉన్న భాషగా గౌరవిస్తున్నారు. పాఠశాలలలో ఆంగ్లభాషను నిర్బంధం చేస్తున్నప్పటికీ ఆంగ్లభాషను ధారాళంగా మాట్లాడుతున్న ప్రజలసంఖ్య మాత్రం తక్కువగా ఉన్నారు. ప్రత్యేకంగా నగరానికి వెలుపల నివసిస్తున్న ప్రజల మధ్య ఆగ్లభాష వాడకం తక్కువగా ఉంది.

మతం

థాయ్‌లాండ్‌లో సాధారణంగా తరవాడ బుద్ధమతం ఆచరణలో ఉంది. ప్రపంచంలో తరవాడ బుద్ధిజం ఉన్నతమైన బుద్ధమతంగా భావించబడుతుంది. చివరి గణాంకాలను అనుసరించి బుద్ధమతావలంబీకులలో 94.6% మంది తరవాడ బుద్ధిజాన్ని అనుసరిస్తున్నారని భావిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో రెండవ స్థానంలో ఉన్న ముస్లిం మతాన్ని 4.6% ప్రజలు ఆచరిస్తున్నారు. థాయ్‌లాండ్‌ దక్షిణ భూభాగాలలో పట్టాని, యాల, నరాథివాట్, సంగ్కాల చుంఫాన్‌లో కొంతభాగం ముస్లిములు అధికంగా ఉన్నారు. జనసంఖ్యలో క్రైస్తవ మతావలంబీకులు 07% ఉన్నారు. దేశంలోని నగరాలలో స్వల్పసంఖ్యలో సిక్కు మతావలంబీకులు, హిందూ మతావలంబీకులు ఉన్నారు. దేశంలో 17వ శతాబ్ధనికి చెందిన ప్రజలలో కొందరు జ్యూయిష్ మతస్థులు కూడా ఉన్నారు.

సంస్కృతి

Theravada Buddhism is highly respected in Thailand.

థాయిలాండ్ ఒకప్పటి అఖండ భరత్ లో భాగం కనుక అక్కడ హిందూ సంస్కృతి మొదటి నుండి ఉంది. భారతదేశం నుండి పోయిందని విశ్లేషకులు చెప్తున్నారు కానీ అది ఎలా సాధ్యం? భారతదేశంలో భాగం థాయిలాండ్ ఒకప్పుడు. కనుక హిందూ సంస్కృతి అనేది థాయ్ ప్రజలు మొదటి నుండి పాటిస్తున్నారు. వాళ్ళ భాషలు సంస్కృతముతో ముడి పడి ఉన్నాయి.

థాయ్ సంస్కృతి భారతీయ, లావో, బర్మా, కంబోడియా, చైనా సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకుంది. థాయ్ సంప్రదాయాలు కూడా భారతీయ, కంబోడియా, చైనా, ఇతర దక్షిణాసియా సంప్రదాల వలన ప్రభావితమై ఉంది. థాయ్‌లాండ్ దేశీయ మతం తరవాడ బుద్ధిజం ఆధునిక థాయ్‌లాండ్ ఒక ప్రత్యేకతగా ఉంది. థాయ్ బుద్ధిజం కాలానుగుణంగా హిందూయిజం, అనిమిజం అలాగే పూర్వీకుల ఆరాధనా విధానాల వంటి అనేక మతవిశ్వాలతో ప్రభావితమైంది. థాయ్ అధికారిక క్యాలెండర్ బౌద్ధశక ఆధారితంగా తయారుచేయబడింది. ఇది గ్రిగేరియన్ క్యాలెండరుకు (పాశ్చాత్య) 543 సంవత్సరాలకు ముందు ఉంటుంది. ఉదాహరణగా సా.శ. 2012 థాయ్ క్యాలెండరులో 2555 ఉంటుంది.

భారతదేశం నుంచి విస్తరించిన హిందూ, బౌద్ధమతాల ప్రభావాలు కాంభోజదేశం నుంచి థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించింది. అంతేకాక భారతదేశం నుంచి విజ్ఞాన కృషి చేయడానికి వచ్చిన బ్రాహ్మణులు, వ్యాపారానికి వచ్చిన వర్తకులు ఈ మతప్రచారం చేశారు. థాయ్‌లాండ్‌లోని మతం, భాష, సంస్థలు, లిపి, కళలు, సాహిత్యం వంటివాటిలో భారతీయ ముద్ర కనిపిస్తుంది.[8]

థాయ్ ప్రజల నిర్లక్ష్యానికి గురైన పలు ప్రత్యేక ఆదివాసి ప్రజలలో కొంతమంది బర్మా, లావోస్, కంబోడియా, మలేషియాలలో ప్రవేశించి వారితో కలిసిపోయారు. మిగిలిన వారు వారి సంప్రదాయాలకు ప్రాంతీయ సంస్కృతో సంప్రదాయాలు, అంతర్జాతీయ సంప్రదాయాలను మిశ్రితంచేసి సరికొత్త వరవడిని సృష్టించుకున్నారు. చైనా నుండి వచ్చి చేరిన ప్రజలు కూడా థాయ్ ప్రజలలో గుర్తించ తగినంత సంఖ్యలో ఉన్నారు. వీరు ప్రత్యేకంగా బ్యాంకాక్, దాని పరిసరప్రాంతాలలో ఉన్నారు. వారు తాయ్ ప్రజలతో మిశితం అవడం వలన వారు ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రత్యేక స్థానం వహిస్తున్నారు. వారికి ఉన్న అంతర్జాతీయ కుటుంబ సంప్రదాయ సంబంధాలతో వారు వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుని వాణిజ్యరంగంలో విజయం సాధించారు. ఖోన్ షో థాయ్‌లాండ్ కళాప్రదర్శనలలో ప్రాబల్యం సంతరించుకుంది.

Khon Show is the most stylised form of Thai performance.

థాయ్ యువత ఒకరిని ఒకరు కలుసుకున్న సమయాలలో వాయ్ అని ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకుంటారు. వాయ్ అంటే రెండుచేతులు కలిపి నమస్కరించి తల వంచి చేతి వేళ్ళను తాకుతూ తమ గౌరవాన్ని తెలియజేస్తూ మాటలలో " సవాస్దీ ఖ్రాప్ " అని పురుషులకు, " సవాస్దీ కా " అని స్త్రీలకు పలుకుతారు. వయసులో పెద్దవారు కూడా అలాగే ప్రతిస్పందిస్తారు. అధికారులు, పెద్దవారు, పూజ్యులు ప్రత్యేకంగా ఇలా గౌరవాన్ని అందుకుంటారు. భారతదేశం, నేపాల్ దేశాలలో నమస్కారం పోలినదే వాయ్. ఫుట్ బాల్ క్రీడ థాయ్ సంప్రదాయక క్రీడ అయిన మాయ్ క్రీడను అధిగమించింది. సమకాలీన థాయ్‌లాండ్ యువత ఈ క్రీడలను చూడడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. థాయ్ ప్రజలు అధికంగా ఆదరిస్తున్న ఇతర క్రీడలలో గాలిపటాలు ఎగురవేయడానికి ప్రత్యేకస్థానం ఉంది.

థాయ్ ఆహార సంస్కృతిలో ప్రధానంగా ఐదు రుచులు ప్రాధాన్యత వహిస్తాయి. అవి వరుసగా తీపి, ఖారం, వగరు, చేదు, ఉప్పు. థాయ్ వంటలలో తెల్లగడ్డలు, మిరపకాయలు, నిమ్మకాయ రసం, నిమ్మగడ్డి, ఫిష్ సాస్ ప్రధానంగా చోటుచేసుకుంటాయి. థాయ్ ప్రధాన ఆహారం బియ్యం. ప్రత్యేకంగా జాస్మిన్ బియ్యం ( దీనిని హాం మాలి రైస్ అని కూడా అంటారు) దాదాపు తాయ్ ఆహారలు అన్నింటికి చేర్చుకుంటారు. బియ్యం ఎగుమతిలలో అంతర్జాతీయంగా ప్రథమస్థానంలో ఉన్న థాయ్‌లాండ్‌లో ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి సరాసరి 100 కిలోల బియ్యం తన ఆహారంలో ఉపయోస్తున్నాడు. థాయ్‌లాండ్ నుండి సేకరించిన 5,000 వరివంగడాలు ఫిలిప్పైన్‌లో ఉన్న " రైస్ జెనె బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ " (ఐ.ఆర్.ఆర్.ఐ) సంరక్షించబడుతున్నాయి. థాయ్‌లాండ్ రాజు ఐ.ఆర్.ఆర్.ఐ అధికారిక పోషకుడుగా ఉంటాడు.

అనేక ఆసియన్ సంస్కృతుల మాదిరిగా థాయ్‌లాండ్ మతసంప్రదాయాలు పూర్వీకులపట్ల గౌరవం ప్రదర్శినడానికి ప్రధాన్యత ఇస్తాయి. వంశానుగతంగా వచ్చిన సంస్కృతి వలన సేవాభావం, ఔదార్యం థాయ్ సంస్కృతిలో భాగమై ఉంది. పెద్దరికం అన్నది థాయ్ సంప్రదాయంలో అత్యంత ప్రధాన్యత కలిగి ఉంది. పండుగలు, సంప్రదాయ వేడుకలు, కుటుంబ నిర్ణయాలు చేయడంలో పెద్దలకు సముచిత స్థానం ఉంటుంది. సంతానంలో పెద్దవారు చిన్నవారి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.

థాయ్‌లాండ్ సంస్కృతిలో కాలితో మరొకరి తలను తాకడం నిషేధం. థాయ్‌లాండ్ ప్రజలు కాళ్ళు శరీరంలో హీనమైన భాగంగా భావించడమే ఇందుకు కారణం. థాయ్ ప్రజలు గతకొన్ని సనత్సరాలుగా పలుభాషా సాహిత్యాన్ని చదివి ఆనందిస్తున్నారు. సమీపకాలంగా దేశంలో పలుభాషా సాహిత్యం అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం. దేశంలో ఆంగ్ల, థాయ్, చైనా పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలను ఆకర్షించడానికి పలు థాయ్ పత్రికలు కూడా ఆంగ్లశీర్షికలను ప్రచురిస్తుంటాయి. థాయ్‌లాండ్ వాణిజ్యంలో అధికంగా ఆంగ్లభాషను ఉపయోగిస్తారు. అలాగే కొంత వరకు ఇతర భాషలను కూడా మాట్లాడుతుంటారు.

థాయ్‌లాండ్ దేశంలో వార్తా పత్రికల ప్రచురణ దక్షిణాసియాలోనే ప్రత్యేకత కలిగి ఉంది. 2013 వ సంవత్సరంలో దేశంలో ఒకరోజుకు 13 మిలియన్ల దినపత్రికలు విక్రయించబడ్డాయి. బ్యాంకాక్ లోని అప్ కౌంటీ ప్రాతం మీడియాకు ప్రధానంగా స్థావరంగా వర్ధిల్లుతుంది. ఉదాహరణగా 2003-2004 థాయ్‌లాండ్స్ పబ్లిక్ రిలేషంస్ డిపార్ట్మెంట్ నివేదికలను అనుసరించి థాయ్‌లాండ్ ఈశాన్యభాగంలో 116 వార్తాపత్రికలు, రేడియో, టి.వి, కేబుల్ సంస్థలు పనిచేస్తున్నాయి.

హిందూ దేవాలయాలు

నకోన్‌ రాచసీమ రాష్ట్రంలో సా.శ. 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం ఉంది. అందులోని శివలింగం, నంది విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అక్కడికి 15 కి.మీల దూరంలో పిమాయ్‌ చారిత్రాత్మక పార్కు ఉంది. 11-12 శతాబ్దాల్లో నిర్మించిన ఈ నగరం పేరు వాస్తవానికి విమయపుర తరువాతి కాలంలో విమయ, పిమాయ్‌గా మారింది. హిందూఖేమర్‌ వంశస్థులు నిర్మించిన ఈ నగరం కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం కోరట్‌. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆదిమానవుల అవశేషాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలో సందర్శించాల్సిన మరో నగరం ఆయుతయ. ఇది కోరట్‌ - బ్యాంకాక్‌ మధ్య చావ్‌ ప్రాయా నది ఒడ్డున ఉన్న ప్రాచీన నగరం. ఆయుతయ... మన అయోధ్య నుంచి వచ్చిందని అభిప్రాయం. ఈ నగరంలో చాయ్‌వతనరం బౌద్ధాలయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ప్రధానమైనది. నాలుగు గోపురాల నడుమ 35 మీటర్ల ప్రధాన గోపురం నాటి నిర్మాణ శైలిని, నైపుణ్యాన్ని కళ్ళకు కడుతోంది.

పండుగలు

థాయ్‌ల్యాండ్‌ పండుగల్లో సోంక్రన్‌, లోయ్‌క్రతాంగ్‌ ప్రధానమైనవి. ప్రాచీన థాయ్‌ క్యాలెండర్‌ ప్రకారం సంవత్సరాదిన అంటే ఏప్రిల్‌ ఒకటోతేదీన మొదలయ్యే సోంక్రన్‌ మన హోలీ లాంటిదే. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ మూడురోజులపాటు ఉత్సాహంగా జరుగుతుంది. అలాగే లోయ్‌ క్రతాంగ్‌ పండుగ మన బతుకమ్మ, కార్తీక పౌర్ణమి వేడుకల్ని గుర్తు చేస్తుంది. అరటి దొప్పలో ఆకులు, పూలు, క్యాండిల్‌‌స అమర్చి నీటిలో వదులుతారు.

వినోదం

దేశంలో వ్యవసాయానికి, పశుసంపదకు ప్రసిద్ధి పొందిన ప్రదేశం కూడా కౌయాయ్‌ రీజియన్‌ మాత్రమే. ప్రత్యేక వాహనాల్లో వైన్‌ యార్డు మొత్తం తిరిగి చూడవచ్చు. కౌయాయ్‌ డెయిరీ ఫామ్‌‌సకి కూడా ప్రసద్ధి. చోక్‌చాయ్‌ ఫామ్‌ ఆసియాలోకి పెద్దది. 50 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఫామ్‌ గొప్ప పర్యాటక ప్రదేశం కూడ. సాధారణ పర్యాటకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు... ఏడాదికి కనీసం మూడు లక్షల మంది సందర్శిస్తారు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ బయోడీజిల్‌, ఐస్‌క్రీమ్‌ వంటి పాల ఉత్పత్తులు తయారుచేసే చోక్‌చాయ్‌ ఫామ్‌ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సందర్శకుల బస కోసం అత్యాధునిక గుడారాలు, వినోదం కోసం కౌబాయ్‌ షోవంటి వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ సెంటర్లు ఉన్నాయి.

పర్యాటకులకు వసతులు

థాయ్‌లో పట్టాయాలో బీచ్‌ రిసార్టులు, హోటళ్లు ఉన్నట్లే కౌయాయ్‌లో రిసార్టులు పచ్చటి చెట్లు, పర్వత శ్రేణుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ప్రతి రిసార్‌‌ట, హోటల్‌ పర్యాటకుల వినోదాల కోసం ఏదో ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, అడ్వెంచర్‌ స్పోర్‌‌ట్స, స్విమ్మింగ్‌ పూల్‌‌స, కౌబాయ్‌ షోలవంటి వినోద కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. అరడజనుపైగా గోల్‌‌ఫ మైదానాలు ఉన్నాయి. దారిపొడవునా ప్రీమియం ఔట్‌లెట్‌‌స, లోటస్‌ మాల్‌‌స వంటి షాపింగ్‌ సెంటర్లు ఉంటాయి. ఇక్కడి పాలియో షాపింగ్‌ మాల్‌లో ఏదీ కొనకుండా విండో షాపింగ్‌ చేయడమూ చక్కని అనుభవమే. కౌయాయ్‌ ప్రాంతంలోనే ఉన్న డాన్‌క్వియాన్‌ ప్రాంతం పాటరీకి ప్రసిద్ధి.

ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం

మరకత బుద్ధుడు థాయ్‌ టూర్‌లో మరో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఎమరాల్‌‌డ బుద్ధుడిని చూడడం. వాట్‌ ప్రాకయో (ఎమరాల్‌‌డ బౌద్ధ ఆలయం) కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. పచ్చని గ్రానైట్‌ రాతితో నిర్మించిన బుద్ధుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శతాబ్దాల క్రితం భారతదేశం నుంచి కాంబోడియా, లావోస్‌, వియత్నాం దేశాలగుండా చేతులు మారుతూ బ్యాంకాక్‌ చేరింది. బౌద్ధులు జీవితంలో ఒక్కసారైనా మరకత బుద్ధుడిని దర్శించుకోవాలనుకుంటారు. ఈ ఆలయం బ్యాంకాక్‌లో చావ్‌ప్రాయ నది ఒడ్డున ఉంది. ఈ నదికి మరో ఒడ్డున నిర్మించిన వాట్‌ అరుణ్‌ దేవాలయం మరో అద్భుత కట్టడం. 79 మీటర్ల పొడవైన పగోడా సూర్య కాంతితో మిలమిలా మెరుస్తూంటుంది. ఇటాలి యన్‌శైలిలో ఉన్న థాయ్‌ రాజపస్రాదం ఆనంద సమక్రోమ్‌ కూడా చూసి తీరాల్సిన కట్టడమే. బ్యాంకాక్‌లో చూడాల్సిన అనేక విశేషాల్లో జిమ్‌ థామ్సన్‌ హౌస్‌ మ్యూజియం, సువాన్‌ పక్కడ్‌ ప్యాలెస్‌ మ్యూజియం ఉన్నాయి. సువాన్‌ పక్కడ్‌ మ్యూజియం ప్రాచీన థాయ్‌ ఇళ్ల నిర్మాణాన్ని అనుసరించి ఉంటుంది. రాజవంశస్తులు దేశ, విదేశాల నుంచి సేకరిం చిన అనేక వస్తువులు ఇందులో ఉన్నాయి.

షాపింగ్ సెంటర్లు

బ్యాంకాక్‌లో షాపింగ్‌ సెంటర్లలో ప్రముఖమైనది ఆసియాటిక్‌ షాపింగ్‌ సెంటర్‌. ఇది కూడా చావ్‌ప్రాయ నది ఒడ్డునే ఉంది. ఇందులో వందల షాపులు, అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే పహూరత్‌ బాంబే మార్కెట్‌ కూడ. ఇది థాయ్‌లాండ్‌కు వలస వెళ్లిన భారతీయులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్‌. థాయ్‌లాండ్‌లో వాతావరణం మన వాతావరణాన్నే తలపిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యటనకు మన వాళ్లు ప్రత్యేక దుస్తులవంటి ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. థాయ్‌లాండ్‌లో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ, అక్కడి వారు టూరిస్టుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. గొడవలు ఏమున్నా పార్లమెంటుకే పరిమితం. టూరిస్టులు నిర్భయంగా దేశంలో ఎక్కడైనా పర్యటిం చవచ్చు అని థాయ్‌లాండ్‌ పర్యాటకం అథారిటీ ప్రకటించింది.

కౌయాయ్‌ నేషనల్‌ పార్కులో...

పర్వతశ్రేణులు, దట్టమైన అడవులు, జలపాతాలు, సెలయేళ్లు, క్రూరమృగాల సంచారం, అరుదైన పక్షుల కిలకిలరవాలు, ఆది మానవుల అవశేషాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంటే... అత్యాధునికతకు ప్రతీకగా హాలిడే రిసార్ట్స, గోల్‌‌ఫ కోర్టులు ఉన్నాయి. టూరిస్టుల కోసం క్యాంపింగ్‌, నైట్‌ సఫారీ, ట్రెకిగ్‌కు ఏర్పాట్లు ఉన్నాయి. హనీమూన్‌ కపుల్‌ని అలరించే బ్యూటిఫుల్‌ స్పాట్‌లతోపాటు పిల్లలతో వచ్చిన కుటుంబాలు సేదదీరే సౌకర్యం ఉన్న ప్రదేశం కౌయాయ్‌. ఈ పార్‌‌క పురావస్తు పరిశోధన, ప్రాచీన కళలు, నిర్మాణం వంటి అంశాలపై ఆసక్తి ఉన్న వారికి సరైన గమ్యస్థానం కూడ. కౌయాయ నేషనల్‌ పార్‌‌క నాలుగు రాషా్టల్ల్రో విస్తరించి ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

మసాజ్‌ సెంటర్‌‌

బ్యాంకాక్‌లో ఏ వీధిలో చూసినా మసాజ్‌ సెంటర్లు కనిపిస్తాయి. ఇది వారి సంప్రదాయ వైద్యవిధానం. థాయ్‌ల్యాండ్‌ మసాజ్‌ సెంటర్ల మీద మన వాళ్లకు ఏ అభిప్రాయం ఉన్నా థాయ్‌ వాసులు మాత్రం దాన్ని పవిత్రంగా భావిస్తారు. మనం కేరళ ఆయుర్వేద మసాజ్‌ను గౌరవించినట్లు.

ఎలా వెళ్లాలి

థాయ్‌లాండ్‌ వెళ్లాలంటే వీసా ఆన్‌ అరైవల్‌ సౌకర్యం ఉంది. వెట్‌ బ్యాగ్రౌండ్‌లో తీసిన రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, రెగ్యులర్‌ కౌంటర్‌లో 1000 బాత్‌లు లేదా తత్కాల్‌ కౌంటర్‌లో 1200 బాత్‌ల ఫీజు చెల్లించాలి. డబ్బును రెండుమూడు వేల బాత్‌లుగా, మిగిలినది డాలర్లుగా తీసుకువెళ్ళటం మంచిది. దేశంలో కరెన్సీ ఎక్సే్చజ్‌ సెంటర్లు చాలా ఉన్నాయి. డాలర్లను క్షణాల్లో థాయ్‌ బాత్‌లుగా మార్చుకోవచ్చు. థాయ్‌ బాత్‌ విలువ దాదాపుగా రూపాయి ఎనభై పైసలు. నాలుగు రోజుల ట్రిప్‌కు ఒక్కరికీ 20 నుంచి 25 వేల రూపాయవుతుంది. హోటల్‌ రెంట్‌ రోజుకు వెయ్యి నుండి ఆరేడు వేల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం థాయ్‌లాండ్‌ పర్యాటకం అథారిటీ వెబ్‌సైట్‌ చూడవచ్చు. థాయ్‌ సంప్రదాయ నాట్యం లికాయ్‌. ఈ కళాకారులు బౌద్ధాలయాల్లో ప్రదర్శనలిస్తారు. ఈ నాట్యం చేసేటప్పుడు కళాకారుల వస్త్రధారణ, కథాంశం అన్నీ భారతీయతను పోలి ఉంటాయి.

అధికారికం

ఇతరాలు

మూలాలు