అంతర్గత దహన యంత్రం

అంతర్గత దహన యంత్రం (ఆంగ్లం: Internal combustion engine), ఒక ఉష్ణ యంత్రం. ఇది ఇంధనాన్ని ఏదైనా ఆక్సీకరణి (Oxidizer) (సాధారణంగా గాలి) సహాయంతో, వ్యాపన ద్రవ వలయం (working fluid circuit) కలిగిన ఒక గదిలో దహనం చేస్తుంది. అంతర్గత దహన యంత్రంలో ఇంధన దహనం ద్వారా ఉత్పన్నమైన అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం కలిగిన వాయువులు వ్యాకోచం చెంది, ఇంజన్ లోని కొంత భాగం మీద నేరుగా బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలం సాధారణంగా పిస్టన్లు (ముషలకం), ఏదైనా పరివర్తకం (turbine) రెక్కలు, తిరగలి పరికరం, లేదా నాజిల్ మీద ప్రయోగించబడుతుంది. ఈ బలం వల్ల ఈ వస్తువులు కొంత దూరం జరిగి ఏదైనా ఉపయోగకరమైన పని జరుగుతుంది. ఈ విధంగా రసాయన శక్తి, యాంత్రిక శక్తిగా మారుతుంది. ఈ యంత్రాలు బహిర్గత దహన యంత్రాల స్థానంలో వచ్చి చేరి యంత్రాల పరిమాణాన్ని తగ్గించాయి.

4-స్ట్రోక్ గ్యాసోలిన్ ఇంజన్లలో సాధారణంగా కనిపించే సిలిండరు బొమ్మ:
  • C – క్రాంక్‌షాఫ్ట్
  • E –  ఎక్సాస్ట్ క్యామ్‌షాఫ్ట్
  • I –  ఇన్‌లెట్ క్యామ్‌షాఫ్ట్
  • P – పిస్టన్ (ముషలకం)
  • R – కనెక్టింగ్ రాడ్
  • S – స్పార్క్ ప్లగ్
  • V – వాల్వులు. ఎరుపు: ఎక్సాస్ట్, blue: ఇన్ టేక్.
  • W – కూలింగ్ వాటర్ జాకెట్
  • gray structure – ఇంజన్ బ్లాక్

మొదటి అంతర్గత దహన యంత్రాన్ని 1860 లో ఎటిన్నె లెనాయిర్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు.[1] మొదటి ఆధునిక అంతర్గత దహన యంత్రాన్ని 1876 లో నికోలస్ ఒటో కనిపెట్టాడు. దీన్నే ఒటో ఇంజిన్ అని కూడా అంటారు.

అంతర్గత దహన యంత్రాలు సాధారణంగా శిలాజ ఇంధనాల నుంచి లభించే శక్తి దట్టంగా కేంద్రీకృతమైన గ్యాసోలిన్, డీజిల్ లాంటి ఇంధనాల సహాయంతో పని చేస్తాయి. స్థిరంగా పనిచేసే యంత్రాలు ఉన్నప్పటికీ వీటిని ఎక్కువగా కార్లు, విమానాలు, ఓడల్లాంటి కదిలే వాహనాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు.

స్పార్క్ ప్లగ్

స్పార్క్ ప్లగ్ అనేది అంతర్గత దహన యంత్రంలో ఒక స్పార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఒక విద్యుత్ పరికరం, ఇది దహన చాంబర్‌లోని గాలి-ఇంధన మిశ్రమాన్ని మండిస్తుంది.

మూలాలు