అన్వర్ ఇబ్రహీం

మలేషియా 10వ ప్రధానపంత్రి

అన్వర్ ఇబ్రహీం మలేషియా కు 10వ ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు.[1] నేషనల్ ప్యాలెస్ లో 2022 నవంబర్ 24వ తేదీన రాజు సుల్తాన్ అహ్మద్ షా ప్రధానిగా అన్వర్ తో ప్రమాణం చేయించారు.[2] నవంబర్ 19వ తేదీన 15వ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అన్వర్ నేతృత్వంలోని అలయన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలిచింది. అన్వర్ సంస్కరణవాది కాగా, మితవాదైన మాజీ ప్రధాని మహియుద్దీన్ యాసిన్ పార్టీ నేషనల్ అలయన్స్ 73 సీట్లు వచ్చాయి. 222 సీట్లు గల మలేషియా పార్లమెంట్లో మెజారిటీ కావాలంటే 112 సీట్లు రావాలి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో రాజు జోక్యం చేసుకొని అన్వర్ సారాధ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు యునైటెడ్ మలయిస్ నేషనల్ ఆర్గనైజేషన్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. రాజు ఆల్ సుల్తాన్ అబ్దుల్లా పార్లమెంట్ సభ్యులతో సంప్రదించి 2022 నవంబర్ 24వ తేదీన అన్వర్ ఇబ్రహీం తో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.[3] 1990 దశకంలో మలేషియా డిప్యూటీ ప్రాథమిక అన్వర్ విధులు నిర్వహించారు.

అన్వర్ ఇబ్రహీం

మూలాలు