అలాన్ పార్కర్

ఆంగ్ల సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత

సర్ అలాన్ విలియం పార్కర్ (1944, ఫిబ్రవరి 14 - 2020, జూలై 31) ఆంగ్ల సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.[1] కాపీ రైటర్ గా, టెలివిజన్ ప్రకటనల దర్శకుడిగా కూడా పనిచేశాడు. దాదాపు పదేళ్ళపాటు ప్రకటనలను రూపొందించాడు, వాటిలో చాలావరకు సృజనాత్మకతకు అవార్డులు గెలుచుకున్నాయి.


అలాన్ పార్కర్

A black-and-white photo of Parker looking toward the camera
అలాన్ పార్కర్ (2008, ఏప్రిల్)
జననం
అలాన్ విలియం పార్కర్

(1944-02-14)1944 ఫిబ్రవరి 14
ఇస్లింగ్టన్, లండన్, ఇంగ్లాండ్
మరణం2020 జూలై 31(2020-07-31) (వయసు 76)
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1971–2003
జీవిత భాగస్వామి
అన్నీ ఇంగ్లిస్
(m. 1966; div. 1992)
  • లిసా మోరాన్
పిల్లలు5, నాథన్ పార్కర్

జననం

పార్కర్ 1944, ఫిబ్రవరి 14న ఎల్సీ ఎల్లెన్ - విలియం లెస్లీ పార్కర్ దంపతులకు ఉత్తర లండన్ లోని ఇస్లింగ్టన్ లో జన్మించాడు.[2]

వ్యక్తిగత జీవితం

పార్కర్ కు రెండుసార్లు వివాహం జరిగింది. 1966లో అన్నీ ఇంగ్లిస్ ను వివాహం చేసుకున్నాడు. వారు 1992లో విడాకులు తీసుకున్నారు. తరువాత నిర్మాత లిసా మోరాన్ ను వివాహం చేసుకున్నాడు.[3][4] వారికి స్క్రీన్ రైటర్ నాథన్ పార్కర్ తో సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు.[3]

సినిమారంగం

బగ్సీ మలోన్ (1976), ఫేమ్ (1980), పింక్ ఫ్లాయిడ్ - ది వాల్ (1982), ది కమిట్మెంట్స్ (1991), ఎవిటా (1996), మిడ్నైట్ ఎక్స్ప్రెస్ (1978), మిస్సిస్సిప్పి బర్నింగ్ (1988), కమ్ సీ ది పారడైజ్ (1990), ఏంజెలా ' స్ యాషెస్ (1999), ఏంజెల్ హార్ట్ (1987), ది లైఫ్ ఆఫ్ డేవిడ్ గేల్ (2003) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.[5]

అవార్డులు

ఇతడు తీసిన సినిమాలకు పది గోల్డెన్ గ్లోబ్స్, ఆరు అకాడమీ అవార్డులతోపాటు పంతొమ్మిది బాఫ్టా అవార్డులను గెలుచుకున్నాయి. బర్డీ అనే సినిమా నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ 1984లో టాప్ టెన్ సినిమాలలో ఒకటిగా ఎంపిక చేసింది. 1985 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ స్పెషల్ డు జ్యూరీ బహుమతిని గెలుచుకుంది. బ్రిటిష్ సినీరంగానికి ఇతడు చేసిన సేవలకుగాను పార్కర్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్గా నియమించబడ్డాడు. 2002లో నైట్ పదవిని పొందాడు. గ్రేట్ బ్రిటన్ డైరెక్టర్స్ గిల్డ్ వ్యవస్థాపక సభ్యుడిగా, వివిధ ఫిల్మ్ స్కూళ్ళలో ఉపన్యాసాలు ఇవ్వడంతోపాటు బ్రిటిష్ సినిమా, అమెరికన్ సినిమా రెండింటిలోనూ చురుకుగా పనిచేశాడు.

2000లో సినిమాటోగ్రఫీ - వీడియో లేదా యానిమేషన్ లలో కృషికి రాయల్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ లుమియర్ అవార్డును అందుకున్నాడు.[6] 2013లో బ్రిటిష్ ఫిల్మ్ అకాడమీకి ఇచ్చే అత్యున్నత గౌరవమైన బాఫ్టా అకాడమీ ఫెలోషిప్ అవార్డును అందుకున్నాడు. పార్కర్ తన వ్యక్తిగత ఆర్కైవ్ ను 2015లో బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యొక్క నేషనల్ ఆర్కైవ్ కు విరాళంగా ఇచ్చాడు.[7]

సినిమాలు

  • మెలోడీ
  • మా సీసీ
  • బగ్సీ మలోన్
  • మిడ్నైట్ ఎక్స్‌ప్రెస్
  • పింక్ ఫ్లాయిడ్ - ది వాల్
  • ఏంజెల్ హార్ట్
  • మిస్సిస్సిప్పి బర్నింగ్
  • ది రోడ్ టు వెల్విల్లే
  • ఎవిటా
  • ఏంజెలా యాషెస్

మరణం

సుదీర్ఘ అనారోగ్యం కారణంగా తన 76 సంవత్సరాల వయసులో 2020, జూలై 31న లండన్ నగరంలో మరణించాడు.[3][8]

మూలాలు

బయటి లింకులు