అకాడమీ పురస్కారాలు

ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు. దీని బహుమతి ప్రదానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు.[1]

అకాడమీ పురస్కారాలు
Current: 92వ అకాడమీ పురస్కారాలు
వివరణసినిమా రంగంలో అత్యున్నత ప్రతిభను కనబరిచినందుకు
దేశంఅమెరికా
అందజేసినవారుఅకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
మొదటి బహుమతిమే 16, 1929
వెబ్‌సైట్https://www.oscars.org/oscars Edit this on Wikidata

మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.

ఆస్కార్ పేరుకి మూలం

1939లో అధికారికంగా అకాడమీ అవార్డులను పేరును ఆస్కార్ అని స్వీకరించారు. ఈ సంస్థలో పనిచేసే మార్గరెట్ హెరిక్ అనే ఒక మహిళ విజేతలకు అందించే బొమ్మను ఆమె తొలిసారి చూసినప్పుడు, దీని ఆకృతి తన అంకుల్ ఆస్కార్‌లా ఉందన్నారు. అలా 'ఆస్కార్ అవార్డు' పేరు వచ్చింది అన్న ఊహాగానం ఉన్నది[2]

ఆస్కార్ ప్రతిమ

శిల్పి జార్జి స్టాన్లీ, పదమూడున్నర అంగుళాల ఎత్తు, ఎనిమిదిన్నర పౌండ్ల బరువు తో తయారు చేశారు దీనికి కు ఐదు 'స్పోక్స్' ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను ఇవి సూచిస్తాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు.

పురస్కాలు

  • ఉత్తమ చిత్రం
  • ఉత్తమ నటి
  • ఉత్తమ నటుడు
  • ఉత్తమ దర్శకుడు
  • ఉత్తమ సంగీతం
  • మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ
  • ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌
  • ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌
  • ఉత్తమ సహాయనటి
  • ఉత్తమ సహాయ నటుడు
  • ఉత్తమ యానిమేషన్‌ చిత్రం
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్‌)

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు