ఆదిల్ రషీద్

ఆదిల్ ఉస్మాన్ రషీద్ (జననం 1988 ఫిబ్రవరి 17) ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాడు, అతను ఇంగ్లండ్ తరపున వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్లలో ఆడతాడు. గతంలో టెస్ట్ జట్టు కోసం ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో, అతను యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. పలు ట్వంటీ20 లీగ్‌లలో ఆడాడు. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.[1]

ఆదిల్ రషీద్
2019 లో బౌలింగు చేస్తూ రషీద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆదిల్ ఉస్మాన్ రషీద్
పుట్టిన తేదీ (1988-02-17) 1988 ఫిబ్రవరి 17 (వయసు 36)
బ్రాడ్‌ఫోర్డ్, వెస్ట్ యార్క్‌షైర్, ఇంగ్లాండ్
మారుపేరుడీల్, డిల్లీ, రాష్
ఎత్తు5 ft 8 in (1.73 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 668)2015 అక్టోబరు 13 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2019 జనవరి 23 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 210)2009 ఆగస్టు 27 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 మార్చి 6 - బంగ్లాదేశ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.95
తొలి T20I (క్యాప్ 46)2009 జూన్ 5 - నెదర్లాండ్స్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - న్యూజీలాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.95
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006–presentయార్క్‌షైర్
2010/11–2011/12సౌత్ ఆస్ట్రేలియా
2015/16అడిలైడ్ స్ట్రైకర్స్
2017Dhaka Dynamites
2021–presentNorthern Superchargers
2021పంజాబ్ కింగ్స్
2023–presentPretoria Capitals
2023–presentసన్ రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుటి20FC
మ్యాచ్‌లు1912595175
చేసిన పరుగులు540734926,822
బ్యాటింగు సగటు19.2818.846.5732.48
100లు/50లు0/20/10/010/37
అత్యుత్తమ స్కోరు616922180
వేసిన బంతులు3,8166,2631,98829,901
వికెట్లు6018395512
బౌలింగు సగటు39.8332.2025.8335.05
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు22020
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు0001
అత్యుత్తమ బౌలింగు5/495/274/27/107
క్యాచ్‌లు/స్టంపింగులు4/–40/–28/–79/–
మూలం: Cricinfo, 1 August 2023

రషీద్, 2009లో వన్‌డే, T20I ల్లో అడుగుపెట్టాడు. 2015, 2019 మధ్య టెస్ట్ జట్టు కోసం ఆడాడు. అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్,[2] 2022 T20 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్లలో సభ్యుడు.[3]

రషీద్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలరు. అతను వన్‌డేలు, T20Iలు రెండింటిలోనూ స్పిన్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలరు. మొత్తం T20Iలలో ఇంగ్లండ్ క్రిస్ జోర్డాన్ తర్వాత రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.[4][5] జోస్ బట్లర్‌తో పాటు, అతను వన్‌డేలలో ఏడవ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యానికి ప్రపంచ రికార్డు సాధించాడు: 2015లో న్యూజిలాండ్‌పై 177 చేసారు.[6] 2023లో కింగ్ చార్లెస్ III 'బర్త్‌డే గౌరవాల జాబితాలో రషీద్ MBEగా ఎంపికయ్యాడు.

నేపథ్యం

రషీద్ 1988 ఫిబ్రవరి 17న వెస్ట్ యార్క్‌షైర్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో జన్మించాడు. తన ఇంగ్లండ్ సహచరుడు మొయిన్ అలీ లాగా, రషీద్ కూడా పాకిస్తాన్ సంతతికి చెందినవాడు.[7][8] అతను మీర్పూరి కమ్యూనిటీకి చెందినవాడు. అతని కుటుంబం, 1967లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్పూర్ నుండి ఇంగ్లండ్‌కు వలస వచ్చింది.[9]

తొలి ఎదుగుదల

ఆదిలోనే ప్రతిభ

రషీద్ చిన్నప్పటి నుండే ప్రతిభ కనబరచాడు: టెర్రీ జెన్నర్ అతనిని 14 ఏళ్ల వయస్సులో గుర్తించాడు,[10] 2005 జూలై ప్రారంభంలో, 17 సంవత్సరాల వయస్సులో, అతను యార్క్‌షైర్ అకాడమీ (యువత) జట్టు కోసం 6–13 సాధించాడు.[11] కొన్ని రోజుల తర్వాత అతను యార్క్‌షైర్ క్రికెట్ బోర్డ్ అండర్-17ల కోసం అండర్-17ల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో చెషైర్ జట్టుపై 111 పరుగులు చేశాడు.[12]

2006లో, అతను యార్క్‌షైర్ సెకండ్ XI కోసం అనేక ఆటలు ఆడాడు. వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు.[10] ఈ ఫారమ్, డారెన్ లెమాన్‌కు పిక్క గాయం అవడం కలిసి, అతనికి ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసే అవకాశాన్ని సంపాదించిపెట్టింది.

2006: కౌంటీ రంగప్రవేశం, యూత్ టెస్టులు

రషీద్ నార్త్ మెరైన్ రోడ్, స్కార్‌బరోలో వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన విదేశీ బ్యాట్స్‌మెన్ డారెన్ లీమాన్ స్థానంలో కౌంటీ క్రికెట్ రంగప్రవేశం చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అతను 6/67తో వార్విక్‌షైర్ మిడిల్ ఆర్డర్‌ను కూల్చి, యార్క్‌షైర్‌కు మ్యాచ్‌ను గెలుచుకోవడానికి బాట వేశాడు.[13][14][15] ఆ తర్వాత రషీద్‌ను భారత్ అండర్-19 తో సిరీస్ కోసం ఇంగ్లండ్ అండర్-19 టెస్ట్ జట్టులో చేర్చారు.[16] కాంటర్‌బరీలో జరిగిన మొదటి టెస్టులో జట్టు తరపున రంగప్రవేశం చేసిన అతను 13, 23 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు.[17] టౌంటన్‌లో జరిగిన రెండవ టెస్టులో, అతను 114, 48 చేసి 8/157, 2/45 సాధించి ఆల్ రౌండ్ ప్రదర్శనను ప్రదర్శించాడు.[18][19][20][21][22] అతను షెన్లీలోని డెనిస్ కాంప్టన్ ఓవల్‌లో జరిగిన మూడవ టెస్ట్‌లో కూడా ఆడాడు, అయితే అతను కేవలం మూడు వికెట్లు తీయడంతోపాటు 15, 12 పరుగులు చేయడం ద్వారా అంతగా ప్రభావం చూపలేకపోయాడు.[23][24]

ఆగస్టు మధ్య నుండి సీజన్ ముగిసే వరకు, అతను యార్క్‌షైర్‌లో ఒక సాధారణ స్థానాన్ని ఆక్రమించాడు.[25] స్కార్‌బరోలో మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4/96 స్కోర్ చేశాడు.[26][27] క్రెయిగ్ వైట్‌తో కలిసి నాల్గవ వికెట్ స్టాండ్‌లో 130 పరుగులతో హెడింగ్లీలో నాటింగ్‌హామ్‌షైర్‌పై అతని తొలి ఫస్ట్-క్లాస్ హాఫ్ సెంచరీ, 63 పరుగులు చేశాడు. యార్క్‌షైర్‌కు మ్యాచ్‌ను గెలవడానికి నాటింగ్‌హామ్‌షైర్ చివరి బ్యాటర్లను ఔట్ చేసాడు.[28][29][30][31] ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన రెండు-రోజుల "స్పిన్ మ్యాచ్"లో కూడా రషీద్ కనిపించాడు. ఈ కార్యక్రమం యువ స్పిన్ బౌలర్లను అభివృద్ధి చేయడానికి వివిధ మ్యాచ్-ఆధారిత దృశ్యాలను సిమ్యులేటు చేస్తుంది.[32]

2008: జాతీయ జట్టుతో మొదటి పర్యటన

2008 జనవరిలో, రషీద్ భారతదేశంలో 2007–08 దులీప్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ లయన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[33] ఆ టోర్నమెంటులో రెండు గేమ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.[34] వరుసగా రెండవ సీజన్‌లో అతను ఛాంపియన్ కౌంటీ ఈసారి సస్సెక్స్^తో వ్యతిరేకంగా ఆడేందుకు మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ జట్టులో కూడా స్థానం పొందాడు.[35][36] ఇంగ్లండ్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ స్క్వాడ్‌లో కూడా అతను తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.[37][38]

సీజన్ ప్రారంభంలో రషీద్ బౌలింగులో వైవిధ్యం కోల్పోతుందనే ఆందోళన ఏర్పడింది. బ్యాటింగుకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు అనిపించింది.[39] అయితే అతను రోజ్ బౌల్‌లో హాంప్‌షైర్‌పై 7/107తో కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను అందుకున్నాడు.[40][41] అతను లాంకషైర్‌పై 5/95 [42][43][44] ససెక్స్‌పై 7/136 పరుగులతో దీనిని అనుసరించాడు.[45][46] రషీద్ 62 వికెట్లతో సీజన్‌ను ముగించాడు. యార్క్‌షైర్‌లో వరుసగా రెండో ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.[39][47]

సంవత్సరం చివరలో, రషీద్‌ను భారత పర్యటన కోసం ఇంగ్లీష్ జాతీయ జట్టులో చేర్చారు. అయితే అతను మ్యాచ్‌ ఆడే అవకాశం లేదని భావించినప్పటికీ, కేవలం అనుభవం కోసం మాత్రమే పర్యటనలో ఉన్నాడు.[48][49] అతన్ని వెస్టిండీస్ తదుపరి పర్యటన కోసం జట్టులో చేర్చుకున్నారు.[50] అతను సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జట్టుతో జరిగిన టూర్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టులో భాగమయ్యాడు.[51][52]

ప్రారంభ అంతర్జాతీయ అవకాశాలు

2009: ప్రపంచ ట్వంటీ20, వన్‌డే రంగప్రవేశం

వెస్టిండీస్‌తో జరిగిన టూర్ మ్యాచ్ కోసం రషీద్ మళ్లీ ఇంగ్లాండ్ లయన్స్ జట్టులో తీసుకున్నారు.[53] అతను మంచి ఆల్ రౌండ్ ప్రదర్శనను కనబరిచాడు, ఇంగ్లాండ్ లయన్స్ మొదటి ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్సులో 3/66 తీసుకున్నాడు.[54][55] ఈ సీజన్‌లోని వారి మొదటి రెండు ట్వంటీ20 మ్యాచ్‌లకు యార్క్‌షైర్ జట్టులో చేర్చబడనప్పటికీ, రషీద్ ఫామ్‌ను చూసి గాయపడిన ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు స్థానంలో 2009 ICC వరల్డ్ ట్వంటీ 20 కి జాతీయ జట్టుకు తీసుకున్నారు.[56] స్కాట్లాండ్‌తో జరిగిన టోర్నమెంటు కోసం ఇంగ్లండ్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో, రషీద్ భయాందోళనకు గురయ్యాడు, కానీ వెస్టిండీస్‌తో జరిగిన రెండవ వార్మప్ మ్యాచ్‌లో అతను మరింత స్థిరంగా కనిపించాడు. అతని 4 ఓవర్లలో 1/20 తీసుకున్నాడు.[57][58] టోర్నమెంటు సమయంలోనే అతను పాకిస్తాన్,[59][60] వెస్టిండీస్,[61][62] లపై అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. 4 మ్యాచ్‌లలో 31.66 సగటుతో, 7.30 పరుగుల ఎకానమీతో 3 వికెట్లతో టోర్నమెంటును ముగించాడు.[63]

ప్రపంచ ట్వంటీ 20 ప్రదర్శనల తరువాత అతన్ని, ఆస్ట్రేలియాతో జరిగిన 2009 యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ శిక్షణా జట్టులో తీసుకున్నారు. ఫామ్‌లో లేని మాంటీ పనేసర్‌కు ప్రత్యామ్నాయంగా అతన్ని భావించారు. కానీ ఇంగ్లాండ్ XIతో వార్మప్ గేమ్ ఆడటానికి బదులు, అతను ఆస్ట్రేలియాతో జరిగిన టూర్ మ్యాచ్‌లో మళ్లీ ఇంగ్లాండ్ లయన్స్‌ జట్టులో ఆడాడు.[64][65][66] యాషెస్ [67] ఆడే ఇంగ్లాండ్ తుది జట్టు నుండి అతన్ని తీసేసారు. యార్క్‌షైర్‌తో కౌంటీ క్రికెట్ ఆడటానికి తిరిగి వచ్చాడు. రషీద్ తన కెరీర్-బెస్టు 117 నాటౌట్‌ను సాధించాడు. తర్వాత యార్క్‌షైర్ హాంప్‌షైర్‌ను 5/41తో ఔట్ చేయడంలో సహాయం చేశాడు.[68][69][70] తర్వాత అతను లాంకషైర్‌పై అజేయంగా 157 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5/97 తీసుకున్నాడు.[71][72] ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేయడం, ఐదు వికెట్లు తీసుకోవడం అతని కెరీర్‌లో అది మూడోది; యార్క్‌షైర్ తరపున ఒక సీజన్‌లో రెండుసార్లు ఈ ఫీట్ సాధించిన చివరి ఆటగాడు 1911లో జార్జ్ హిర్స్టు.[73]

2009 ఆగస్టు 27న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ తన వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు. అతను 7 పరుగులు చేసి, 1/16 బౌలింగ్ గణాంకాలు నమోదు చేసాడు.[74] అతను ఆస్ట్రేలియాతో జరిగిన 1వ వన్‌డే కోసం జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అత్యుత్తమంగా ఆడి, 10 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగులో 23 బంతుల్లోనే 31 పరుగులతో నాటౌట్‌గా రాణించాడు.[75][76] అతను తన ప్రదర్శనతో ఆస్ట్రేలియన్లు మైఖేల్ క్లార్క్, జేమ్స్ హోప్స్‌ను ఆకట్టుకున్నాడు.[77][78] కానీ ఆశ్చర్యకరంగా అతన్ని, తదుపరి మ్యాచ్‌కి జట్టు నుండి తొలగించారు.[79] సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లకు తిరిగి వచ్చాడు, అయితే [80] 74 సగటుతో 2 వికెట్లు మాత్రమే సాధించాడు.

రషీద్ పేలవమైన పర్యటన తరువాత, బంగ్లాదేశ్ పర్యటన కోసం ఇంగ్లాండ్ జట్టు నుండి తప్పించారు. బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పాకిస్తాన్ A కి వ్యతిరేకంగా ఇంగ్లాండ్ లయన్స్ తరపున ఆడటానికి పంపించారు.[81] అతను UAEలో గడిపిన సమయం కొంత విజయవంతమైంది. ఇంగ్లండ్ లయన్స్‌కు సిరీస్ విజయాన్ని సాధించే క్రమంలో పాకిస్తాన్ Aతో జరిగిన రెండవ ట్వంటీ20లో 3/13 తీసుకున్నాడు.[82][83] పాకిస్తాన్ Aతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ తర్వాత, ప్రధాన ఇంగ్లాండ్ జట్టుతో కూడా ఇంగ్లాండ్ లయన్స్ ఒక ట్వంటీ 20 ఆడింది, రషీద్ 3/22 బౌలింగ్ ప్రదర్శనతో లయన్స్ అనుకోని విజయం సాధించింది.[84][85]

2011–12: ఆటలో క్షీణత

వోర్సెస్టర్‌షైర్‌తో జరిగిన యార్క్‌షైర్ ప్రారంభ మ్యాచ్‌లో 6/77, 5/37తో రషీద్ 2011 సీజన్‌ను బాగానే ప్రారంభించాడు,[86][87][88] కానీ మొత్తమ్మీద అతను ఫామ్ కోసం కష్టపడ్డాడు. తన కెరీర్‌లోనే చెత్త బౌలింగ్ గణాంకాలను సాధించాడు. సస్సెక్స్‌పై 187 పరుగులు ఇచ్చాడు, వికెట్లు పడలేదు.[89][90] అతని పేలవమైన ఫామ్ 2012 సీజన్‌లో కూడా కొనసాగింది. కౌంటీ కెరీర్‌లో మొదటిసారిగా అతన్ని యార్క్‌షైర్ జట్టు నుండి తొలగించారు. కౌంటీ సీజన్‌లో అతని చెత్త ప్రారంభం ఫలితంగా ఇది వచ్చింది, అతని మొదటి ఆరు మ్యాచ్‌లలో 49.00 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.[91] యార్క్‌షైర్ ప్రెసిడెంట్ జెఫ్రీ బాయ్‌కాట్ కౌంటీ క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి రషీద్ ఏమాత్రం పురోగతి సాధించలేదని విమర్శించాడు. పేలవమైన ప్రదర్శనలకు రషీద్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పాడు.[92] 2012లో పది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో అతను 41 సగటుతో కేవలం 16 వికెట్లు తీశాడు. 16.12 సగటుతో 129 పరుగులు చేశాడు. ఆట ఎంతలా క్షీణించందంటే అతన్ని ఇంగ్లండ్ లయన్స్ తరపున ఆడే అవకాశం కూడా రాలేదు.[93]

అంతర్జాతీయ క్రికెట్‌కి తిరిగి రాక

2014–15: దక్షిణాఫ్రికా A, వెస్టిండీస్, ఐర్లాండ్

కౌంటీ క్రికెట్‌లో 2013, 2014 సీజన్లలో అతని ఫామ్ మెరుగుపడింది. దాంతో, రషీద్‌ను 2015 ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఇంగ్లాండ్ లయన్స్ జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా A కి వ్యతిరేకంగా వారి ఫస్ట్-క్లాస్, వన్-డే సిరీస్ రెండింటిలోనూ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు.[94] అతను అనధికారిక టెస్టులలో 78, 68 ఇన్నింగ్స్‌లతో పర్యటనలో బాగా బ్యాటింగ్ చేశాడు.[95][96] 2015 మార్చిలో, వెస్టిండీస్ పర్యటన కోసం రషీద్ ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[97][98] వెస్టిండీస్‌తో జరిగిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దారితీసిన టూర్ మ్యాచ్‌లలో, రషీద్ టెస్ట్ జట్టులోకి రావడానికి తగిన ప్రదర్శన కనబరచలేదు. సెలెక్టర్లు అతనికంటే జేమ్స్ ట్రెడ్‌వెల్‌కు ప్రాథమ్యత ఇచ్చారు.[99] టెస్ట్ మ్యాచ్‌లలో ఆడించనప్పటికీ, కౌంటీ క్రికెట్ సీజన్ ప్రారంభంలో యార్క్‌షైర్‌తో ఆడేందుకు రావడానికి జట్టు అనుమతించలేదు.[100] అయినప్పటికీ రషీద్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ వన్‌డే జట్టులో చేరడానికి పర్యటన నుండి ముందుగానే వెళ్ళిపోయాడు.[101] ఆ మ్యాచ్ తర్వాత, యార్క్‌షైర్ హాంప్‌షైర్‌తో జరిగిన తమ తదుపరి కౌంటీ మ్యాచ్ కోసం రషీద్‌ను తీసుకువెళ్లేందుకు ఒక ప్రైవేట్ జెట్‌ను అద్దెకు తీసుకుంది. ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాలుగేసి వికెట్లు తీసుకున్నాడు.[100][102]

2015: న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన వన్‌డే జట్టుకు తిరిగి రాక

2015లో న్యూజిలాండ్‌పై రషీద్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు

2015 యాషెస్ కొద్దిరోజుల్లో జరగనున్నందున, న్యూజిలాండ్‌తో జరిగిన వన్‌డే సిరీస్ నుండి మొయిన్ అలీకి విశ్రాంతి ఇవ్వాలని ఇంగ్లీష్ సెలెక్టర్లు నిర్ణయించి, అతని స్థానంలో రషీద్‌ను తీసుకున్నారు.[103] సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో రషీద్ వెంటనే ప్రభావం చూపాడు, జోస్ బట్లర్‌తో కలిసి వన్‌డే చరిత్రలో అత్యధిక 7వ వికెట్ భాగస్వామ్యంలో పాల్గొన్నాడు, అక్కడ వారు 177 పరుగులు చేశారు.[104] రషీద్ తన తొలి అర్ధ సెంచరీని కేవలం 37 బంతుల్లో సాధించి, మొత్తం 69 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను మ్యాచ్‌లో అత్యంత ఆకర్షణీయమైన బౌలింగ్‌ని అందించాడు, కేన్ విలియమ్సన్ వికెట్ పడగొట్టడానికి తన గూగ్లీని ఉపయోగించాడు. మొత్తం 4/55 సాధించాడు.[105] రషీద్ ఇంగ్లండ్ తరఫున సిరీస్‌లోని మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి, మొత్తం 8 వికెట్లతో ముగించాడు.[106]

యాషెస్‌లోని మొదటి టెస్టు కోసం ఇంగ్లండ్ 13 మంది సభ్యులతో కూడిన జట్టులో రషీద్‌ని చేర్చారు.[107] అయితే స్పిన్నింగ్ పిచ్ ఉన్నట్లయితే, సెలెక్టర్లు రషీద్‌ను రెండో స్పిన్నర్‌గా మోయిన్ అలీతో మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.[108] యాషెస్‌లోని ప్రతి మ్యాచ్‌కు రషీద్ టెస్టు జట్టులో కొనసాగాడు కానీ ఆడలేదు.[109] దాని బదులు అతను యార్క్‌షైర్‌కు కౌంటీ క్రికెట్ ఆడటం కొనసాగించి, డర్హామ్‌పై సెంచరీ చేశాడు.[110] రషీద్ యాషెస్‌లో అస్సలు ఆడనప్పటికీ, ఆస్ట్రేలియాతో జరిగిన వన్‌డే సిరీస్‌లో ఆడగలిగాడు. 1వ వన్‌డేలో 4/59,[111] 2 వ వన్‌డేలో 2/41తో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.[112] ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ బౌలర్లలో అత్యధికంగా 7 వికెట్లు పడగొట్టాడు.[113]

వెస్టిండీస్‌తో జరిగిన ఓపెనింగ్ గేమ్‌లో రషీద్ 1-20 సాధించాడు. రెండవ గేమ్‌లో అతను దక్షిణాఫ్రికాపై 1–35, ఆఫ్ఘనిస్తాన్‌పై 2–18 తీశాడు. సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఇంగ్లండ్ శ్రీలంకను ఓడించాల్సిన అవసరం ఉన్న మ్యాచ్‌లో రషీద్ 0–31తో ముగించాడు. ఇంగ్లండ్ పది పరుగుల తేడాతో గెలిచింది. అతను సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై వికెట్ తీయలేదు, కానీ వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌లో 1–23తో మంచి ప్రదర్శన కనబరిచాడు. అతని ప్రదర్శన బాగున్నప్పటికీ, ఇంగ్లాండ్ స్వల్ప ఓటమిని చవిచూసింది. రన్నరప్‌గా నిలిచింది.

2019లో ఇంగ్లండ్‌ వెస్టిండీస్‌ పర్యటనలో రషీద్‌ మూడు జట్లలోనూ ఎంపికయ్యాడు. అతను ఒకే ఒక టెస్టు ఆడాడు, అందులో అతని గణాంకాలు 0–117. మొదటి వన్‌డేలో అతను 3–74తో, ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలిచాడు. రెండవదానిలో, అతను 1–28తో ఓడిపోయాడు. నాల్గవ వన్‌డేలో అతను తన రెండవ వన్‌డేని ఐదు వికెట్ల కోసం తీసుకున్నాడు, 5-85తో ఇంగ్లండ్ 28 పరుగుల విజయాన్ని సాధించడంలో సహాయం చేశాడు.[114]

2016 T20 ప్రపంచ కప్

2019లో ఇంగ్లండ్‌ వెస్టిండీస్‌ పర్యటనలో రషీద్‌ మూడు జట్లలోనూ ఎంపికయ్యాడు. అతను ఒకే ఒక టెస్టు ఆడాడు, అందులో అతని గణాంకాలు 0–117. మొదటి వన్‌డేలో అతను 3–74తో సాధించగా, ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. రెండవదానిలో, అతను 1–28 చేసాడు. నాల్గవ వన్‌డేలో అతను వన్‌డేల్లో తన రెండవ ఐదు వికెట్ల పంట సాధించాడు. 5-85తో ఇంగ్లండ్ 28 పరుగుల విజయాన్ని సాధించడంలో సహాయం చేశాడు.[115]

2019 వెస్టిండీస్, క్రికెట్ ప్రపంచ కప్

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[116][117] 2019 జూన్ 21న, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, రషీద్ ఇంగ్లాండ్ తరపున తన 150వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాడు.[118]

2020, 2021

2020 మే 29 న, COVID-19 మహమ్మారి తరువాత ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు శిక్షణను ప్రారంభించడానికి 55 మంది ఆటగాళ్ల బృందంలో రషీద్ పేరు పెట్టారు.[119][120] 2020 జూలై 9 న, ఐర్లాండ్‌తో జరిగే వన్‌డే సిరీస్ కోసం శిక్షణ నిచ్చే 24 మంది సభ్యుల జట్టులో రషీద్‌ను చేర్చారు.[121][122] 2020 జూలై 27 న వన్‌డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులో రషీద్‌ని చేర్చారు.[123][124] ఐర్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో 150 వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్‌గా నిలిచాడు.[125] 2020 నవంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో, రషీద్ T20I క్రికెట్‌లో తన 50వ వికెట్‌ను తీసుకున్నాడు.[126]

2021 సెప్టెంబరులో, రషీద్ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[127]

క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ 2023 పుట్టినరోజు గౌరవాలలో రషీద్‌కు ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (MBE) లభించింది.[128]

బౌలింగ్ శైలి

రషీద్ లెగ్ బ్రేక్, టాప్ స్పిన్నర్, గూగ్లీ, స్లైడర్ - ఈ నాలుగు వైవిధ్యమైన డెలివరీలను వేస్తాడు.[129]

స్వచ్ఛంద సేవ

2018 నవంబరులో ఓవర్సీస్ ప్లాస్టిక్ సర్జరీ అప్పీల్ ఛారిటీకి రషీద్ అంబాసిడర్ అయ్యాడు. OPSA అనేది యార్క్‌షైర్ ఆధారిత స్వచ్ఛంద సంస్థ, ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో తమ పనిని చాలా వరకు నిర్వహిస్తుంది.[130]

మూలాలు