ఉదయం

ఉదయం అంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు ఉండే కాలం. ఉదయం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేదానికి కచ్చితమైన సమయాలు లేవు (అలాగే సాయంత్రం, రాత్రికి కూడా) ఎందుకంటే ఇది ఒకరి జీవనశైలి, సంవత్సరంలో ప్రతి సమయంలో పగటి వేళల ప్రకారం మారవచ్చు.[1] అయితే, ఉదయం అనేది కచ్చితంగా మధ్యాహ్నం ముగుస్తుంది, అంటే ఉదయం తరువాత మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ఉదయం అంటే అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు అని కూడా నిర్వచించవచ్చు. అయితే అనేక సందర్భాలలో అర్ధరాత్రి నుండి సూర్యోదయం వరకు ఉండే కాలాన్ని తెల్లవారుజాము అంటారు.

ఉదయం, నమీబియాలోని ఒక పొలంలో సూర్యోదయం తర్వాత

ఉదయం అనేది అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు (00:00:01-11:59:59) పగటి సమయ వ్యవధి.[2][3] ఉదయం సాధారణంగా మధ్యాహ్నం (12:00:01-17:59:59) కంటే చల్లగా ఉంటుంది

ఉదయం ఒక రోజు క్రమంలో మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి ముందు ఉంటుంది. వాస్తవానికి, ఈ పదం సూర్యోదయాన్ని సూచిస్తుంది.[4] ఉదయమునకు భాగములుగా అర్థరాత్రి పైన అని, బ్రహ్మముహుర్తము అని, తెల్లవారుజాము అని, పొద్దుపొద్దునే అని, పొద్దున్నే అని, పొద్దేక్కినాక అని విభజించవచ్చు.

  • భారత కాలమానం ప్రకారం ఉదయమును విభజించి సుమారు సమయములుగా చెప్పినట్లయితే:
  • ఉదయం - 00:00:01-11:59:59
  • అర్థరాత్రి పైన - 00.01 am to 3.00 am
  • బ్రహ్మముహుర్తము - 4.24 am to 5.12 am
  • తెల్లవారుజాము - 3.00 am to 5.00 am
  • పొద్దుపొద్దునే - 5.00 am to 5.30 am
  • పొద్దున్నే - 5.30 am to 7.00 am
  • పొద్దేక్కినాక - 7.00 am to 10.00 am
  • మధ్యాహ్నం కావొస్తుంది - 10.00 am to 11.59 am

మూలాలు